»   » బ్యాన్ చేయాలి: ‘ఉత్తమ విలన్’పై హిందూ సంఘాలు ఆగ్రహం

బ్యాన్ చేయాలి: ‘ఉత్తమ విలన్’పై హిందూ సంఘాలు ఆగ్రహం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కమల్ హాసన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఉత్తమ విలన్' చిత్రం విడుదలకు ముందే ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ చిత్రంపై నిషేధం విధించాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్ పీ) తమిళనాడు వింగ్ ఆందోళన ప్రారంభించింది. ఆ చిత్రంలోని సన్నివేశాలు హిందూవుల మనోభావాలను కించే పరిచే అవకాశం ఉన్న కారణంగా నిలుపుదల చేయాలంటూ పోలీస్ కమిషనర్ కు వీహెచ్ పీ ఓ నివేదికను సమర్పించింది.

విష్ణుమూర్తి భక్తుడు ప్రహ్లాదనకు, హిరణ్యకశపుడు అనే రాక్షసుడికి జరిగే సంభాషణ ఆధారంగా తెరకెక్కిన ఒక పాట విష్ణుమూర్తి భక్తులను నిరాశకు గురిచే విధంగా ఉందని, మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సినిమా సెన్సార్ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాలేదు.


VHP calls for ban on Kamal Haasan's 'Uttama Villain'

కమల్‌హాసన్‌ హీరోగా నటించిన చిత్రం 'ఉత్తమ విలన్‌'. రమేష్‌ అరవింద్‌ దర్శకత్వం వహించారు. ఇందులో కె.బాలచందర్‌ కీలకపాత్ర పోషించారు. కె.విశ్వనాథ్‌, ఆండ్రియా, పూజాకుమార్‌, నాజర్‌, ఎంఎస్‌ భాస్కర్‌ తదితరులు కూడా నటించారు. ఈ నెల పదో తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కొన్ని కారణాల వల్ల ముహూర్తం 17వ తేదీకి మార్చారు. ఇప్పుడు 24కు వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. థియేటర్ల సమస్య, తెలుగు వెర్షన్‌ పనుల కారణంగా ఆలస్యమవుతోందని సమాచారం.


ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సమర్పణలో తిరుపతి బ్రదర్స్‌ ఫిల్మ్‌ మీడియా ప్రై.లి., రాజ్‌కమల్‌ పిల్మ్‌ ఇంటర్నేషనల్‌ పతాకాలపై రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సి.కళ్యాణ్‌ అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.

English summary
Vishva Hindu Parishad's (VHP) Tamil Nadu wing has called for a ban on the Kamal Haasan's 'Uttama Villain'.
Please Wait while comments are loading...