»   » వీడియో: మహేష్, మిగతా హీరోలపై తేజ సంచలన కామెంట్స్

వీడియో: మహేష్, మిగతా హీరోలపై తేజ సంచలన కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తన తాజా చిత్రం హోరా హోరీ ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు తేజ మహేష్ బాబు చేస్తున్న ఈ పనులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు ఇన్ కం టాక్స్ తగ్గించుకోవడానికే గ్రామాలను దత్తత తీసుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. దీంతో మహేష్ బాబు అభిమానులు తేజ మీద భగ్గుమన్నారు. ఇంతకీ తేజ ఏమన్నారు..స్వయంగా మీరే చూడండి..క్రింద వీడియోలో.

మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ గ్రామాల్ని దత్తత తీసుకోవడంపై మీ స్పందన ఏంటని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు తేజ బదులిస్తూ.. వారందరూ శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితోనే గ్రామాల్ని దత్తత తీసుకున్నారా అని ఎదురుప్రశ్న వేశారు. సామాజం కోసం వారు ఆ పని చేయట్లేదని అనుకుంటున్నా. సినీ నటులు ఐటీ డిడక్షన్స్ కోసమే ఈ పని చేస్తున్నారని తేజ వ్యాఖ్యానించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సామాజిక సేవ చేసే కార్పొరేట్ కంపెనీలకు పన్ను రాయితీ ఉంటుందని.. అందుకే సినీ నటులంతా గ్రామాల్ని దత్తత తీసుకునే పనిలో పడ్డారని తేజ చెప్పారు. నిజంగా సామాజిక సేవ చేయాలని మహేష్ బాబుకు ఉండి వుంటే అది ఒక్కడు సినిమా తర్వాతే గ్రామాన్ని దత్తత తీసుకుని వుండివుండొచ్చు కదా అని తేజ ప్రశ్నించారు.

స్లైడ్ షోలో ... మిగతా హీరోలుపై ఏమన్నారో వీడియోలు చూడండి.

మహేష్ గురించి ఇలా అన్నాడు...

ఐటి రిటర్న్స్ కోసమే దత్తత అన్నాడు.

Courtesy: Indiaglitz dot com

మిగతా హీరోల గురించి ఇలా...

తను దర్శకుడు అవ్వటానికి కారణాలు చెప్తు ...మిగతా హీరోలపైనా కామెట్స్ ఇలా

Courtesy: FilmTradeGuide Dot Com

ఫ్యాన్స్ రియాక్షన్

ఫ్యాన్స్ రియాక్షన్

నీకు చాన్స్ ఇచ్చిన ఒకే ఒక్క స్టార్ హీరో మహేష్ బాబు, అలాంటి వ్యక్తిని పట్టుకుని ఇలా అనడం సబబు కాదు. అందుకే నువ్వు టాలెంట్ ఉండి కూడా ఇలా దిగజారి పోయావ్ అంటూ మహేష్ బాబు అభిమానులు మండి పడుతున్నారు.

మహేష్-తేజ

మహేష్-తేజ

గతంలో మహేష్ ,తేజ కాంబినేషన్ లో నిజం చిత్రం వచ్చింది. అది భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.

ఈ రోజే

ఈ రోజే

అలా మొదలైంది', 'అంతకుముందు ఆ తరువాత' వంటి ఘనవిజయం సాధించిన, వైవిధ్యమైన కధా చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్. 'చిత్రం, 'నువ్వు నేను', జయం' అంటూ వెండితెరపై ప్రేమ కధా చిత్రాలకు సరికొత్తగా రూప కల్పన చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించిన దర్శకుడు తేజ. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'హోరా హోరీ'. ఈ రోజే విడుదల అవుతోంది.

English summary
When asked about Director Teja view on Mahesh Babu adopting the villages and Srimanthudu story line in a causal chat, the director called the hero's act as the one to escape tax deduction. He blatantly said that Mahesh is adopting the villages to get tax deductions. This has hurt Mahesh fans largely, which led to fans outrage on social networking sites.
Please Wait while comments are loading...