»   » దెబ్బ తగిలినా ...జిమ్ లో కష్టపడుతున్న హీరోయిన్ (వీడియో)

దెబ్బ తగిలినా ...జిమ్ లో కష్టపడుతున్న హీరోయిన్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ షూటింగులో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో ఆమె కుడి భుజానికి గాయమైంది. అయితే ఆమె ఫిటెనెస్ విషయంలో మాత్రం వెనకడుగు వేసేటట్లు కనపడటం లేదు. గాయపడినా సరే ఆమె జిమ్ కు వెళ్లటం మాత్రం మానలేదు. ఈ విషయం తెలియచేస్తూ ఆమె పర్శనల్ ఫిటెనెస్ ట్రైనర్ ఈ వీడియోని పోస్ట్ చేసారు. మీరూ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ప్రస్తుతం అలియా ‘కపూర్ అండ్ సన్స్' చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ తమిళనాడులోని కూనూర్‌లో జరుగుతోంది. అయితే పెద్ద గాయమేమీ కాదని, ప్రస్తుతం కోలుకుంటున్నట్లు అలియా భట్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

కపూర్ అండ్ సన్స్ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నాడు. శకున్ బాత్రా దర్శకత్వం వహిస్తుండగా ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు.

ఆలియా భట్ తన బోయ్ ఫ్రెండ్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఎలా ఇచ్చిందో చూడండి. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ఆలియా భట్‌ - సిద్ధార్థ్‌ మల్హోత్రా మధ్య ఉన్న బంధమేంటి? బాలీవుడ్‌లో చాలా కాలం నుంచి నడుస్తోన్న చర్చ ఇది. స్నేహితులా... ప్రేమికులా? ఈ ప్రశ్నకు ఆలియా లేదంటే సిద్ధార్థే సమాధానం చెప్పాలి. ఈ ఇద్దరూ ఇందుకు సుముఖంగా లేరు.

Video : Injured Heroine Alia Bhatt hits the GYM!

ఇటీవల ఇదే ప్రశ్న ఆలియాను అడిగితే 'నా సొంత విషయాలు అందరికీ చెప్పాలా?' అని అంతెత్తు ఎగిరింది. ఇప్పుడు ఈ బంధం గురించి నోరు విప్పినట్లుందంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. ప్రముఖ ఫ్యాషన్‌ పత్రిక వోగ్ కు ఆలియా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిశాయంట.

ఈ పత్రిక రూపొందించిన టీజర్‌ వీడియోలో ఆలియాను చాలా ప్రశ్నలు వేశారు. చాలా ప్రశ్నలకు టపీటపీమని వూ కొట్టిన ఆలియా 'సిద్ధార్థ్‌కు నీకు మధ్య ఉన్న బంధమేంటి?' అనేసరికి ఉలిక్కిపడి లేచి 'వెళ్లి పత్రిక చదివి తెలుసుకొండి' అంటూ గయ్యిమంది. మరి అందులోనైనా చెప్పిందా? లేక 'మీకెందుకు' అంటుందా చూడాలి. అన్నట్లు 'రణ్‌బీర్‌ కపూర్‌ నా మొదటి క్రష్‌' అంటూ ఇందులోనే ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.

కొంత కాలంగా బాలీవుడ్ ను ఏలుతున్న ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, కత్రినా కైఫ్ అవకాశాలకు ఎసరు పెట్టి స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేరుకుంది యంగ్ బ్యూటీ అలియా భట్. మహేశ్ భట్ డాటర్ గా ఎంట్రీ ఇచ్చినా.. షార్ట్ గ్యాప్ లోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. సీనియర్ బ్యూటీస్ కు పంటికింద రాయిలా.. బాలీవుడ్ సినీజనాలకు నోరూరించే పిప్పర్ మెంట్ బిళ్లలా మారిన అలియా భట్ సెక్సీ ఫిగర్ తోనే కాదు.. పర్ఫామెన్స్ లోనూ కేక పుట్టిస్తోంది...

ఒకప్పుడు బాలీవుడ్ సీరియల్ కిస్సర్ గా ఇమ్రాన్ హష్మి పేరే వినిపించేది. ఇప్పుడు ఈ సెక్సీ ఇమేజ్ ఈ చిన్నదాని సొంతమైపోయింది. అలియా నటించిన ప్రతి సినిమాలోనూ హీరోలతో లిప్ లాకులు వేస్తూ.. ఆడియెన్స్ కు కావాల్సినంత కిక్ అందించింది... ఇప్పటికే తన టాలెంట్ చూపించి.. బి-టౌన్ ను బోల్డ్ చేసేసిన ఈ సెక్సీ లేడి.. రీసెంట్ గా సింగర్ గానూ సత్తా చాటుతోంది... ఇప్పటికే రెండు పాటలేసుకున్న ఈ పాప.. తన సంగీత పరిజ్జానాన్ని విస్తరించాలని ట్రై చేస్తోందట..

English summary
Few days ago, Alia Bhatt got injured while shooting . This Short Sensation has hit the gym even though she is yet to recovery from the injury. Impressed with her dedication and commitment, Alia's personal fitness trainer Yasmin Karachiwala has posted the video of the actress working out with a sling on.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu