»   » వీడియో : చిరంజీవి పై పూరి జగన్నాధ్ షాకింగ్ కామెంట్

వీడియో : చిరంజీవి పై పూరి జగన్నాధ్ షాకింగ్ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పూరి జగన్నాథ్, చిరంజీవి కాంబినేషన్ లో ప్రతిష్ట్రాత్మకమైన చిత్రం రూపొందనుందనే వార్తలు అప్పట్లో వచ్చాయి. నిర్మాతగా రామ్ చరణ్ సైతం ఈ విషయాన్ని ఎనౌన్స్ చేసారు. అయితే అనుకోని విధంగా ఆ ప్రాజెక్టు పెండింగ్ లో పడింది. ఈ విషయమై తర్వాత చిరంజీవి మీడియాతో మాట్లాడుతు సెకండాఫ్ బాగోలేకపోవటం వల్ల ఆ ప్రాజెక్టు చేయలేదు అన్నారు. పూరి జగన్నాథ్ పుట్టిన రోజు సందర్బంగా ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయమై ఆయన కొన్ని కామెంట్స్ చేసారు వాటిని ఈ క్రింద చూడండి.

నేను చిరంజీవికి కథ చెప్పాను, కానీ ఆయనకు నచ్చలేదు. దీంతో అనిశ్చితి కొనసాగుతోంది. ఆ సినిమా చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. మొదట కథ చెప్పాక... సగం నచ్చిందని చెప్పారు. మళ్లీ రెండో సగం చెప్పాక, 'నేను మళ్లీ కబురు పెడతా' అన్నారు. ఇంతలో రెండో సగ భాగం కథ నచ్చలేదని ఆయన మీడియాతో చెప్పారు.

ఒకవేళ అదే విషయం నాకు చెప్పుంటే కథలో ఏం నచ్చలేదో తెలుసుకొని మార్పులు చేసేవాణ్ని అంటూ పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు. సోమవారం పూరి జగన్నాథ్‌ జన్మదినం. ఈ సందర్భంగా ఆయన ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్బంగా చిరంజీవి 150వ సినిమాని మీరు చేస్తున్నట్టేనా? అని అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానమిచ్చారు.

గతంలో...
"నాకు పూరి జగన్నాథ్ నేరేట్ చేసిన కథ సెకండాఫ్ నచ్చలేదు ," అంటూ చిరంజీవి తన 150 వ చిత్రం గురించి చాలా కాలం తర్వాత నోరు విప్పారు. ఆయన తెలుగులో ఓ లీడింగ్ టీవి ఛానెల్ తో మాట్లాడుతూ ఇలా స్పందించారు. ఓ మూడు నెలల లోపు స్క్రిప్టుని ఫైనలైజ్ చేసి పట్టాలు ఎక్కిస్తామనే ధీమాగా ఆయన చెప్పుకొచ్చారు. చిరంజీవి, పూరి కాంబినేషన్ లో ఆటో జాని చిత్రం వస్తుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి ఇలా చెప్పి దానికి అడ్డుకట్ట వేసారు.

VIDEO: Puri Jagannadh's Shocking Allegations On Chiranjeevi

 
వివి వినాయిక్ తోనే చిరంజీవి ముందుకు వెళ్తాడని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిమిత్తం ఇండస్ట్రీలోని టాప్ రైటర్స్ చేత కథలు సిద్దం చేస్తున్నట్లు వార్త. వాటిలో ఒకటి ఫైనలైజ్ చేస్తారని అంటున్నారు.

అందుతున్న సమాచారాన్ని బట్టి చిరంజీవి తన 150వ మెసేజ్ ఓరియెంటెడ్ లాగ కాకుండా ఓ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా చూడాలనకుంటున్నారని, అది లాండ్ మార్క్ గా నిలిచిపోయేలే చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

చిరంజీవి అంచనాల మేరకు ఏ స్క్రిప్టు ఓకే కాకపోవటంతో ప్రాజెక్టు డిలే అవుతూ వస్తోంది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తారు...చిరంజీవి గారి సతీమణి సురేఖ సమర్పిస్తారు. మరో ప్రక్క చిరంజీవి ఈలోగా రామ్ చరణ్ తాజా చిత్రం బ్రూస్ లీ లో గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు.

English summary
Puri Jagannadh has finally opened up about the story behind shelving project. According to him, Chiranjeevi did not inform him that he did not like the second half of the script and directly told the media. Talking to the media on the occasion of his birthday, Puri said that the actor only told him that he will get back to him later.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu