»   » వివాదం కోసమేనా? ‌: వర్మ 'బ్రూస్ లీ' వీడియో సాంగ్ (వీడియో)

వివాదం కోసమేనా? ‌: వర్మ 'బ్రూస్ లీ' వీడియో సాంగ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: చూస్తూంటే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదానికి తెరతీశే ప్రయత్నాల్లో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పటికే 'వర్మ బ్రూస్ లీ' పేరుతో ట్రైలర్ రిలీజ్ చేసిన ఆయర తాజాగా ఆ చిత్రంలోని ఒక వీడియో సాంగ్ ని ట్విట్టర్ లో విడుదల చేశారు. దమ్ముంది.. తెగింపు ఉంది...ఇంకా నీకేం కావాలీ అంటూ.. కొనసాగే ఈ పాటలో ఓ అమ్మాయి మార్షల్ ఆర్ట్స్ చేస్తూ కనబడుతుంది.


అయితే ఇప్పటికే శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'బ్రూస్ లీ' విడుదలకు సిద్ధం అవుతుండగా, తమిళ్ లో జివి ప్రకాష్ హీరోగా మరో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ రేసులోకి వర్మ కూడా వచ్చి చేరారు. బ్రూస్ లీకి వీరాభిమాని అయిన వర్మ ఇది తొలి భారతీయ మార్షల్ ఆర్ట్స్ చిత్రమని ఇప్పటికే ప్రకటించారు.

తన ప్రతి సినిమాను వివాదాలతోనే ప్రమోట్ చేసుకునే వర్మ ఈసారి కూడా తన సినిమా ప్రమోషన్ కోసం టైటిల్ వివాదాన్ని తెరమీదకు తెచ్చారన్న వాదన వినిపిస్తుంది. మరి రామ్ గోపాల్ 'వర్మ' బ్రూస్ లీ పై ...రామ్ చరణ్ బ్రూస్ లీ యూనిట్ ఎలా స్పందించారో చూడాలి.

ఇక రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం విషయానికి వస్తే...

rgv bruslee

మంచు మోహన్ బాబు, విష్ణులతో ఆ మధ్య ఓ సినిమా చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మంచు మనోజ్ తో ప్రేక్షకులపై ‘అటాక్' చేయడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా చిత్రానికి సంబంధించిన సెకండ్ ట్రైలర్ విడుదలైంది. ప్రతి సినిమాను అతి తక్కువ రోజుల్లో పూర్తి చేసే వర్మ, మనోజ్ సినిమాను కూడా తక్కువ సమయంలోనే పూర్తి చేసాడు. ‘కరెంట్ తీగ' తర్వాత మంచు మనోజ్ నటిస్తున్న సినిమా ఇదే.

జగపతిబాబు, ప్రకాష్‌రాజ్‌, వడ్డే నవీన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా సురభిని ఎంచుకొన్నారు. ఉషాకిరణ్‌ ఫిలిమ్స్‌ చిత్రం 'బీరువా'తో తెలుగునాట అడుగుపెట్టింది సురభి. తొలి చిత్రంతోనే తన అందంతో, అభినయంతో ఆకట్టుకొంది. ఈ చిత్రం పూర్తి యాక్షన్ తో రూపొందనుందని సమాచారం. మంచు మనోజ్ లోని యాక్షన్ కోణాన్ని పూర్తిగ వాడుతున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ చిత్రాన్ని దగ్గుపాటి రానా తో అనుకున్నారు...కానీ చివరి నిముషంలో సీన్ లోకి మంచు మనోజ్ వచ్చారు.

మనోజ్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అది ఈ సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. చాలా కాలం క్రితం హీరో గా రిటైరయ్యి తప్పుకున్న వడ్డే నవీన్ ఇప్పుడు ఈ చిత్రంతో సీన్ లోకి వచ్చారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. మంచు మనోజ్, జగపతిబాబు కాంబినేషన్ లో ఇంతకు ముందు కరెంట్ తీగ చిత్రం వచ్చింది. సికె ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీ శుభశ్వేతా ఫిలింస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది.

English summary
Director Ram Gopal Varma shared his "Bruce Lee" Workout Song in Twitter.
Please Wait while comments are loading...