»   » ఎదురుగానే యువకుడు హస్త ప్రయోగం.. చాచి లాగి కొట్టిన విద్యాబాలన్

ఎదురుగానే యువకుడు హస్త ప్రయోగం.. చాచి లాగి కొట్టిన విద్యాబాలన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిజ జీవితంలో సినీ తారలు ఎదురయ్యే సంఘటనలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. బాలీవుడ్ తార విద్యాబాలన్‌కు ఎదురైన ఓ సంఘటన మరీ విచిత్రంగా ఉంది. తాను కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడు ఎదురైన ఓ ఘటనను మరో బాలీవుడ్ తార నేహా దూపియా హోస్ట్‌గా ఉన్న నో ఫిల్టర్ నేహా అనే కార్యక్రమంలో చెప్పింది. కాలేజీ డేస్‌లో ఓ లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న సమయంలో హస్త ప్రయోగానికి పాల్పడిన ఓ యువకుడితో ఘర్షణ పడ్డాను అని చెప్పింది. ట్రైన్‌లో అసలు ఏమీ జరిగిందంటే..

లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా

లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా

నేను నా స్నేహితులతో కలిసి లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్నాను. అప్పుడు నేను జేవియర్ కాలేజీలో చదివేదాన్ని. ముగ్గురు ఫ్రెండ్స్ లేడిస్ కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కి కూర్చున్నాం. మేము ముచ్చట్లో పడి ఉండగా ఎదురుగా ఓ యువకుడు వచ్చి కూర్చున్నాడు. అప్పుడు నేను ఇది లేడీస్ కంపార్ట్‌మెంట్ అని గుర్తు చేశాను. అందుకు అచ్చా లేడిస్ కంపార్ట్‌మెంటా అని అయితే వచ్చే స్టేషన్‌లో దిగిపోతాను అని యువకుడు అన్నాడు.

"VidyaVox" : YouTube Page Got 90 Million Views - Filmibeat Telugu
వచ్చే స్టేషన్‌లో

వచ్చే స్టేషన్‌లో

అంతలోపే స్టేషన్ వచ్చింది. ఆ యువకుడు లేచి డోర్ వద్దకు వెళ్లాడు. అతడు వెళ్లి పోతాం అని మేము అనుకొన్నాం. కానీ రైలు కదలగానే మళ్లీ వచ్చాడు. వచ్చే స్టేషన్‌లో దిగిపోతాను అని మళ్లీ చెప్పాడు. అంతలోనే ఆ యువకుడు దారుణంగా ప్రవర్తించాడు. దాంతో మా మతిపోయింది.

ప్యాంట్ జిప్ కిందకి లాగి

ప్యాంట్ జిప్ కిందకి లాగి

ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్న యువకుడు సర్రున ప్యాంట్ జిప్ కిందకి లాగాడు. వీడు తేడాగాడు అనుకునే లోపే మాకు అతను చేస్తున్న పని ఏంటో అర్థమైంది. మా ఎదుటనే హస్త ప్రయోగం చేయడం ప్రారంభించాడు. వెంటనే నా చేతిలో ఉన్న రైటింగ్ ప్యాడ్ తీసి విసిరి కొట్టాను.

అమ్మనా బూతులు తిట్టాను.

అమ్మనా బూతులు తిట్టాను.

ఆ యువకుడి వద్దకు వెళ్లి రెండు వాయించాను. అమ్మనా బూతులు తిట్టాను. నడుస్తున్న రైలులో నుంచి తోసేనంత పనిచేశాను. అతను చేసిన పనికి నేను కోపంతో ఊగిపోయాను అని విద్యాబాలన్ ఓ చేదు అనుభవాన్ని నేహాతో షేర్ చేసుకొన్నారు.

ట్వింకిల్ ఖన్నాకు ఇలాంటి ఘటనే

ట్వింకిల్ ఖన్నాకు ఇలాంటి ఘటనే

ఇలాంటి ఘటనే అక్షయ్ కుమార్ సతీమణి, ఒకప్పటి అందాల తార ట్వింకిల్ ఖన్నాకు ఎదురైందట. ముంబైలోని కొలాబాలో అమెరికా మహిళ ముందు ఓ యువకుడు హస్త ప్రయోగానికి పాల్పడటం అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు అని ట్వింకిల్ ఖన్నా ఇటీవల ఇంటర్వ్యూలో పేర్కొన్నది. మానసిక రోగుల్లాంటి వారే ఇలాంటి చర్యలకు పాల్పడుతారు అని ట్వింకిల్ వ్యాఖ్యానించడం గమనార్హం.

English summary
Bollywood star Vidya Balan recently appeared on the latest episode of the podcast, No Filter Neha, hosted by Neha Dhupia. On the show, she revealed that she once had to fight a man who was masturbating at her in a local train in Mumbai. She said that the incident happened in the ladies compartment when she was travelling back from her college with her friends.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X