»   » హీరోయిన్ నయనతారతో లవ్ రిలేషన్లో ఉన్నాను: ట్విట్టర్ ద్వారా వెల్లడించిన దర్శకుడు!

హీరోయిన్ నయనతారతో లవ్ రిలేషన్లో ఉన్నాను: ట్విట్టర్ ద్వారా వెల్లడించిన దర్శకుడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సౌతిండియా స్టార్ హీరోయిన్ నయనతార కొంత కాలంగా దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారనే విషయం, సహజీవనం చేస్తున్నారనే విషయం బహిరంగ రహస్యమే అయినా.... ఏరోజూ తమ రిలేషన్ గురించి వారు బయటకు వెల్లడించలేదు. అయితే ఉమెన్స్ డే సందర్భంగా విఘ్నేష్ శివన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా నయనతారతో తన లవ్ రిలేషన్ గురించి అఫీషియల్ గా ప్రకటించారు.

Nayanthara quality time with her boyfriend

ట్విట్టర్ ద్వారా వెల్లడించిన విఘ్నేష్

ఈ ట్వీట్ చేయడం ద్వారా విఘ్నేష్ శివన్.... నయనతార లవ్ ఇంటెస్ట్ అని, ఆమెతో రిలేషన్ షిప్ లో ఉన్నాను అని చెప్పకనే చెప్పారు.

త్వరలో పెళ్లి?

త్వరలో పెళ్లి?

వీరి ప్రేమాయణం మొదలై దాదాపు రెండేళ్లు గడిచిపోయింది. ముచ్చటగా మూడో ఏడాది కూడా ఎలాంటి బ్రేకప్ లేకుండా సక్సెస్‌ఫుల్‌గా వీరి లవ్ ఎఫైర్ రన్ అవుతోంది. త్వరలోనే ఇద్దరూ ఓ ఇంటివారు కాబోతున్నారని, పెళ్లి భాజాలు మ్రోగబోతున్నాయని అంతా అనుకుంటున్నారు.

విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే...

విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే...

ఇటీవల ఓ ప్రెస్ మీట్లో పెళ్లి విషయమై విఘ్నేష్‌ను ప్రశ్నించగా.... ఆయన కళ్లలో ఏదో తెలియని గ్లో కనిపించింది. ఈ ప్రశ్నకు స్పందిస్తూ ప్రస్తుతం తన ఫోకస్ అంతా కెరీర్ మీదనే ఉందని, పెళ్లి ఆలోచన ఇప్పుడే లేదని తేల్చిచెప్పాడు. ఇలా చెప్పడం ద్వారా.... అప్పుడే పెళ్లి అనే ఊబిలో పడకుండా ఇంకా కొంతకాలం తాము జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం అని చెప్పకనే చెప్పాడు విఘ్నేష్.

హాలిడే ట్రిప్స్

హాలిడే ట్రిప్స్

మూడు ముళ్లు పడలేదు అనే మాటేగానీ.... ఇద్దరి మధ్య దాదాపు అన్ని ముచ్చట్లు తీరిపోయాయని, ఇద్దరికీ షూటింగులు లేనపుడు కలిసి ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారని, సీక్రెట్‌గా హాలిడే ట్రిప్పులు ఎంజాయ్ చేస్తున్నారని అంతా చర్చించుకుంటున్నారు.

ప్రభుదేవతో విడిపోయిన తర్వాత

ప్రభుదేవతో విడిపోయిన తర్వాత

ప్రభుదేవాతో ప్రేమాయణం, సహజీవనం తర్వాత అతడిని పెళ్లి చేసుకోవాలనుకున్న నయనతార తర్వాత పలు కారణాలతో అతడితో విబేధించి విడిపోయిన సంగతి తెలిసిందే. కొంతకాలం ఒంటరిగా ఉన్న నయనతార... విఘ్నేష్ శివన్‌తో ఓ సినిమాకు పని చేసింది. ఈ క్రమంలో అతడితో ప్రేమలో పడింది.

English summary
Noted filmmaker Vinesh Shivn just took to Twitter and wished the women in his life a Happy Women’s Day. In doing so, he practically confirmed that he is in a relationship with actor Nayanthara.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu