twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కరుణామయుడు’గా చేయటం వెనక..: విజయ్ చందర్

    By Srikanya
    |

    హైదరాబాద్ : జీసస్ అంటే విజయ్ చందర్ టక్కున గుర్తుకు వస్తారు. చిత్రం అంత గొప్పగా రావటానికి కారణం విజయ్ చందర్ అని అందరూ ఒప్పుకునే విషయం. అయితే హఠాత్తుగా విజయ్ చందర్ కి ఎందుకు ఏసుక్రీస్తు పాత్ర వేయాలనిపించింది అనేది మాత్రం అందరికీ సందేహమే. అయితే ఈ సందేహానికి సమాధానాన్ని విజయ్ చందర్ స్వయంగా ఇచ్చారు.

    విజయ్ చందర్ మాట్లాడుతూ...ఏసుప్రభు పాత్ర నేపథ్యాన్ని వివరిస్తూ... 69లో తంగప్ప అనే డాన్స్‌మాస్టర్‌ 'మేరీమాత' చిత్రాన్ని తీస్తూ ఎవరో చెబితే... నన్ను పిలిపించి క్రీస్తుగా ఆడిషన్‌చేశారు. బాడీ అంతా చెక్‌చేసి 'నాకు క్రీస్తు దొరికాడు' అన్నారు. కానీ ఆ తర్వాత వేరే సినిమా చేయడంవల్ల ఆ పాత్రచేయలేకపోయాను. 'మరో ప్రపంచం'లో ప్రమీలారాణితో కలిసి నటించాను. పిల్లల్లో మార్పు కోసం ఉద్యమం జరుగుతుంది. ఆ చిత్రంలో దొంగ వేషం వేశాను. ఆ గెటప్‌లో ఆదుర్తిసుబ్బారావు నన్ను చూసి క్రీస్తుగా చాలాబాగుంటావని ప్రశంసించారు. ఆ తర్వాత 'రారాజు క్రీస్తు'లో అవకాశం వచ్చింది. అప్పటికే 'రౌడీరాణి'లాంటి సినిమాల్లో నటిస్తున్నాను. హీరో అవ్వాలని ఈ రంగంలోకి వచ్చాను. 'సుపుత్రుడు'లో విలన్‌గా చేశాను. ఇలాంటి పాత్రలు చేస్తున్న నాకు అనుకోకుండా ఏసుక్రీస్తు వేషం వేయాల్సిన అవసరం ఏర్పడింది. పూర్తికావడానికి ఐదేళ్ళుపట్టినా... ఆ తర్వాత ఆదరణ ప్రపంచవ్యాప్తంగా పేరుతెచ్చిందని'' ఆనందాన్ని వ్యక్తం చేశారు.

    ఇక ఇప్పుడు ఆయన కరుణామయుడు సినిమా విడుదలై రేపటికి 34 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 'నేను - నా కరుణామయుడు' పుస్తకం రాసి విడుదల చేస్తున్నారు. పుస్తకం చివరి పేజీలో ఇలా పొందుపర్చారు. ''పాపుల్లో మహాపాపి అయిన విజయచందర్‌ కరుణామయుడు చిత్రంలో ఏసుక్రీస్తుపాత్ర వేయడానికి సాక్షాత్తూ ఆ ఏసుక్రీస్తు ప్రభువే ఎన్నుకొన్నాడు''. అని. మళ్ళీనేను 'నేను నా కరుణామయుడు' పుస్తకాన్ని రాయడానికి ఆయనే కారణం అన్నారు.

    ఈ పుస్తకాన్ని 28 భాషల్లో అనువదించబోతున్నాను. వృద్ధాశ్రమాల ఏర్పాటుకు వీటి ద్వారా వచ్చే ఆదాయం ఉపయోగపడుతుందన్నది నా నమ్మకం. ఆంధ్రప్రదేశ్‌లోని 23 జిల్లాల్లో జిల్లాకి 100 ఎకరాల చొప్పున ఒక్కో వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. సరైన పని సరైనవాడు చేస్తే.. వెనక ఎంతోమంది ఉంటారంటారు. నా నమ్మకం అదే'' అని చెప్పారు. 'నేను - నా కరుణామయుడు' పుస్తకావిష్కరణ శుక్రవారం జరగనుంది.

    English summary
    
 Commemorating 35th anniversary of ‘Karunamayudu’ film (which was released on December 21, 1978), veteran actor and producer T Vijayachander is all set to launch a book, ‘Nenu Na Karunamayudu’, on December 21. The book is recollection of his fond memories during the making of historic movie ‘Karunamayudu’, his tryst with Lord Jesus, hardships he went through during the filming and his experiences. Said to be a book with 670 with 500 colour pages, the book has unseen pictures shot during the making of movie and etc. The book will be launched on December 21 at Indira Priyadarshini auditorium in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X