For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఏదైనా అవ‌స‌రం వ‌స్తే కాల్ చెయ్.. తమ్ముడి విషయంలో విజయ్ డేరింగ్ స్టెప్

  |

  టాలీవుడ్ రౌడి స్టార్ విజయ్ దేవరకొండ ఏం మాట్లాడినా కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. అంతే కాకుండా ఆలోచింపజేసే విధంగా జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను చెబుతూ ఉంటాడు. మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి చాలా కష్టపడి పైకి వచ్చిన విజయ్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకడు. నెక్స్ట్ రాబోతున్న పూరి జగన్నాథ్, సుకుమార్ సినిమాలతో అతని స్థాయి మరింత పెరగనుందని చెప్పవచ్చు. అయితే విజయ్ తమ్ముడి విషయంలో మాత్రం ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నాడనే చెప్పాలి.

  రెండవ సినిమాకే..

  రెండవ సినిమాకే..

  ఇండస్ట్రీలో అన్నదమ్ములు ఎంత సపోర్టివ్ గా ఉంటారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కెరీర్ మొదట్లో సక్సెస్ కావాలి అంటే కొన్ని సినిమాల వరకు తప్పకుండా స్టార్ డమ్ ఉన్న బ్రదర్ సపోర్ట్ అడుగడుగున ఉండాల్సిందే. కానీ విజయ్ మాత్రం తమ్ముడిని రెండవ సినిమాకే కష్టపడు అనే విధంగా వదిలేశాడు. విజయ్ తన కథల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

  ఒంటరిగా కష్టపడితేనే

  ఒంటరిగా కష్టపడితేనే

  కేవలం కథలతోనే కాకుండా తన కృషి కష్టాన్ని కూడా బాగా నమ్ముతాడు. ఒంటరిగా కష్టపడితేనే మన బలమేంటో మనకు తెలుస్తుంది. ఇక అలాగే తమ్ముడు కూడా అలవాటు పడాలని అనుకున్నాడో ఏమో గాని మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా విషయంలో విజయ్ పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదని అర్ధమవుతోంది.

  ఆనంద్ సొంత నిర్ణయంతోనే..

  ఆనంద్ సొంత నిర్ణయంతోనే..

  మొదటి సినిమా దొరసాని ప్రయోగాత్మకంగా తెరకెక్కింది. నిజానికి విజయ్ ప్రమోషన్స్ విషయంలో చాలా హెల్ప్ చేశాడు. కానీ ఈ సారి కథల చర్చల్లో కూడా పాల్గొనలేదట. పూర్తిగా ఆనంద్ దేవరకొండ తన సొంత నిర్ణయంతోనే కథలను సెలెక్ట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా విజయ్ తన తమ్ముడి సినిమా చూసి చిత్ర యూనిట్ లో ప్రతి ఒక్కరి పనితనాన్ని మెచ్చుకున్నారు.

  Varsha Bollamma Chit Chat About Middle Class Melodies Movie
  తమ్ముడికి విజయ్ హ్యాట్సాఫ్

  తమ్ముడికి విజయ్ హ్యాట్సాఫ్

  చిత్ర‌యూనిట్‌ను ప్ర‌శంసిస్తూ ఓ లేఖ విడుద‌ల చేసిన విజయ్. ద‌ర్శకుడు వినోద్ అనంతోజుతో నటీనటులైన కొండ‌ల్ రావు, గోపాల్ చైత‌న్య‌, దివ్య‌, త‌రుణ్ భాస్క‌ర్ పెర్ఫెమెన్స్ పై ప్రశంసలు కురిపించారు. హీరోయిన్ వ‌ర్ష బొల్ల‌మ్మ పెద్ద క‌ళ్లేసుకుని క్యూట్‌గా క‌నిపిస్తూనే బాగా న‌టించింద‌ని అన్నారు. ఇక త‌మ్ముడి గురించి మాట్లాడుతూ.. సినిమా కథల ఎంపిక విధానానికి హ్యాట్సాఫ్ అని తెలిపాడు.

   ఏదైనా అవ‌స‌రం వ‌స్తే కాల్ చెయ్

  ఏదైనా అవ‌స‌రం వ‌స్తే కాల్ చెయ్

  నీ కంటూ ప్ర‌త్యేక గుర్తింపును పొందేందుకు క‌ష్ట‌ప‌డుతున్నవ్. ఆనంద్ ను చూస్తుంటే ఒక అన్న‌గా గ‌ర్వపడుతున్నాను. ఇలాగే కొత్త ద‌ర్శ‌కుల‌తో, న‌టీన‌టుల‌తో నీ ప్ర‌యాణం సాగిపోవాల‌ని కోరుకుంటున్నాన‌ని అంటూ.. రౌడి స్టార్ తమ్ముడికి దీవెనలు అందించాడు.. ఫైన‌ల్‌గా సినిమాలోని తండ్రి పాత్ర చెప్పిన డైలాగ్ ని గుర్తు చేస్తూ.. ఒక్క విష‌యం గుర్తుపెట్టుకో.. "క‌ష్ట‌ప‌డు.. ఏదైనా అవ‌స‌రం వ‌స్తే కాల్ చెయ్" అనే డైలాగ్‌తో విజయ్ తన విషెస్ ని అందించాడు.

  English summary
  Young hero Vijay Devarakonda is known to be an unstoppable hero in Tollywood right now. Vijay, who has a unique identity of his own, wants to lead his younger brother in the same vein. It is well known that Anand Devarakonda came forward to the audience with his film Dorasani last year.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X