అమ్మ, నాన్న, మెగాస్టార్.. చిరునవ్వులు అంటూ విజయ్ దేవరకొండ ఎమోషనల్

By Rajababu

అర్జున్‌రెడ్డి చిత్రంతో దేశంలోని అన్ని సినిమా పరిశ్రమలను తనవైపుకు తిప్పుకొన్నాడు విజయ్ దేవరకొండ. ఈ చిత్రాన్ని చూసిన ప్రతి సాధారణ ప్రేక్షకుడు, సినీ ప్రముఖులు విజయ్ నటనను చూసి ఆశ్చర్యపోయారు. అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి అర్జున్‌రెడ్డి చిత్రానికి, విజయ్‌కి లెక్కలేనన్ని ప్రశంసలు వచ్చాయి. తాజాగా జీ గోల్డెన్ అవార్డ్స్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ ఉత్తమ నటుడి అవార్డును అందుకొన్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన ట్విట్టర్‌లో భావోద్వేగాన్ని పంచుకొన్నారు.

నాన్న, మెగాస్టార్ చిరునవ్వులు

ఉత్తమ నటుడు అవార్డును అందుకొన్న సమయంలో ఒకవైపు నాన్న చిరునవ్వులు. మరో వైపు మెగాస్టార్ చిరునవ్వులు. ఇవన్నీ చూస్తూంటే నా జీవితంలో 2017 ఎంత గొప్ప సంవత్సరమో అనిపిస్తున్నది అని విజయ్ ట్వీట్ చేశాడు.

అమ్మా, నాన్న అంటూ

అలాగే అభిమానులు న్యూ ఇయర్ విషెస్ చెబుతూ.. అమ్మా, నాన్న.. నా జీవితంలో మీ కంటే గొప్పవాళ్లు లేరు. నా ముఖంలో చిరునవ్వు చిందించడానికి కారణం మీరే అని మరో ట్వీట్ చేశాడు.

బార్సిలోనాలో విజయ్ దేవరకొండ

అర్జున్ రెడ్డి చిత్రం అందించిన ఉత్సాహంతో కొత్త సంవత్సరం వేడుకలను విజయ్ దేవరకొండ బార్సిలోనాలో జరుపుకొన్నట్టు అర్ధమవుతున్నది. డిసెంబర్ 29న ఉదయమే బార్సిలోనాలో ఉన్నాను అని ఆయన ట్వీట్ చేశారు.

ఐఎండీబీలో అర్జున్‌రెడ్డి

2017లో దేశవ్యాప్తంగా విడుదలైన చిత్రాల్లో అర్జున్‌రెడ్డి చిత్రం మూడో స్థానంలో నిలిచింది. ఈ జాబితాను ప్రముఖ సినీ విశ్లేషణ సంస్థ ఐఎండీబీ విడుదల చేసింది. ఆ రికార్డును బ్రేక్ చేయడానికి నేను ఎంత కష్టపడాలో అంటూ మరో ట్వీట్ చేశాడు విజయ్ దేవరకొండ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X