»   » క్షమించండి అంటున్న ‘ద్వారక’హీరో విజయ్‌ దేవరకొండ

క్షమించండి అంటున్న ‘ద్వారక’హీరో విజయ్‌ దేవరకొండ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: 'పెళ్లి చూపులు' ఫేం విజయ్‌ దేవరకొండ, పూజా ఝవేరి జంటగా నటించిన చిత్రం ద్వారక. మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే సినిమా టీమ్ ఈ చిత్రం సక్సెస్ మీట్ ని హైదరాబాద్‌ ఫిల్మ్‌ఛాంబర్‌లో ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ... తమ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. అయితే హీరో విజయ్ మాత్రం క్షమాపణ చెప్పి ఆశ్చర్యపరిచారు.

హీరో విజయ్ మాట్లాడుతూ 'నేను నా టీమ్ కథను నమ్మి చాలా జన్యూన్ ఎఫర్ట్ పెట్టి ఈ సినిమా చేశాం. నాకు ఒకటే కోరిక ఒక పది సినిమాలు తర్వాత నా వికీ పిడియా పేజ్ ఓపెన్ చేసుకుని చూసుకుంటే అన్ని సినిమాలు వేటికవే డిఫరెంట్ గా ఉండాలి.

అందుకే అన్ని జానర్ సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఇప్పటికి నేను చేసిన మూడు సినిమాలు ఎవడె సుబ్రహ్మణ్యం, పెళ్లిచూపులు, ద్వారక చూస్తే అన్నీ వేటికవే భిన్నంగా ఉంటాయి. మేము చేసిన ఈ సినిమా చాలా మందికి నచ్చింది.

Vijay Devarkonda says sorry at Dwarka Success meet

అలాగే కొంతమందికి నచ్చలేదు కూడా. వారికి క్షమాపణ చెప్తున్నాను. తప్పకుండా అందరికీ నచ్చే సినిమాలు చేస్తాను. ఇకపోతే ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రమోషన్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం' అన్నారు.

విజయ్‌ దేవరకొండ, పూజ జవేరి జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, మురళీ శర్మ, పృథ్వీ, రఘుబాబు, ప్రభాకర్‌, కృష్ణభగవాన్‌, షకలక శంకర్‌, ఉత్తేజ్‌, నవీన్‌, గిరిధర్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: లక్ష్మీభూపాల్‌, ఫైట్స్‌: విజయ్‌, ఆర్ట్‌: బ్రహ్మకడలి, ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌.కె.నాయుడు, సంగీతం: సాయికార్తీక్‌, నిర్మాతలు: ప్రద్యుమ్న, గణేష్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్‌ రవీంద్ర(ఎం.ఎస్‌.ఆర్‌).

English summary
Vijay Devarkonda might have signed Dwaraka film before Pelli Choopulu released but how one wishes he had waited for a better story. Director Srinivas Ravindra, a newcomer, does not pick a fresh subject but merely rehashes a oft-told story.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu