»   » విజయ్ దేవరకొండకు మరో షాక్... యువకుల అరెస్ట్, ఏం జరిగిందంటే?

విజయ్ దేవరకొండకు మరో షాక్... యువకుల అరెస్ట్, ఏం జరిగిందంటే?

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  'గీత గోవిందం' సినిమా విడుదలకు ముందే ఇంటర్నెట్లో లీక్ అవ్వడం అప్పట్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్‌‌గా తీసుకున్న నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొన్ని గంటల్లోనే ఈ కేసును చేధించారు. ఈ కేసులో పలువురు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులను సైతం అరెస్టు చేశారు. హైదాబాద్‌లో డిజిటల్ బ్యాంకులో పని చేస్తున్న ఒక వ్యక్తి ద్వారా సినిమాలోని సీన్లు లీక్ అయినట్లు గుర్తించారు. తాజాగా మరో విజయ్ దేవరకొండ సినిమా లీక్ అయినట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. విజయ్ నెక్ట్స్ రిలీజ్ 'నోటా' విషయంలో కాకుండా... విడుదల కాకుండా హోల్డ్‌లో ఉన్న 'టాక్సీవాలా' విషయంలో లీక్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

   ‘టాక్సీ వాలా' చూస్తూ పట్టుబడ్డ యువకులు

  ‘టాక్సీ వాలా' చూస్తూ పట్టుబడ్డ యువకులు

  ఆ సమయంలోనే విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా' కూడా లీక్ అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే దాని గురించి పోలీసులకు ఎలాంటి ఎవిడెన్స్ లభించలేదు. తాజాగా ‘టాక్సీవాలా' చూస్తూ కొందరు యువకులు పట్టుడ్డారు.

  Vijay Deverakonda Talks About Coincidence With NTR Movie
  పోలీసుల అదుపులో యువకులు

  పోలీసుల అదుపులో యువకులు

  పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో కొందరు యువకులు మొబైల్ ఫోన్లలో 'టాక్సీవాలా' చూస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని సైబర్ ఇన్వెస్టిగేషన్‌కు పంపినట్లు తెలుస్తోంది.

  వీరికి మొబైల్‌లోకి సినిమా ఎలా వచ్చింది?

  వీరికి మొబైల్‌లోకి సినిమా ఎలా వచ్చింది?

  ఇంకా విడుదలకాని ‘టాక్సీవాలా' సినిమా వీరి మొబైల్‌లోకి ఎలా వచ్చింది? ఎవరెవరితో వారికి సంబంధాలు ఉన్నాయి అనే అంశాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ ‘గీతా ఆర్ట్స్' వారు కూడా ఈ విషయంలో సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

  ‘టాక్సీవాలా' రిలీజ్ ఎప్పుడు?

  ‘టాక్సీవాలా' రిలీజ్ ఎప్పుడు?

  టాలీవుడ్ అగ్ర‌నిర్మాణ‌ సంస్థ‌లు జిఏ 2, యువి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఎస్‌కె‌ఎన్ నిర్మాత‌. రాహుల్ సంకృత్యాన్ అనే కొత్త దర్శకుడుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విజయ్ దేవరకొండ సరసన మాళవికా నాయర్, ప్రియాంకలు నటించారు. ‘గీత గోవిందం' కంటే ముందే ఈ మూవీ విడుదల కావాల్సి ఉండగా.... పలు కారణాలతో వాయిదా వేశారు. ఈ మూవీ రిలీజ్ ఎప్పుడు? అనే విషయంలో ఇప్పటి వరకు దర్శక నిర్మాతల నుండి ఎలాంటి క్లారిటీ లేదు. బహుషా ‘నోటా' తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది.

  English summary
  Vijay Deverakonda Taxiwala Movie Leaked before release. Vijay Devarakonda's immediate project after Arjun Reddy is titled as Taxiwala. Rahul Sankrityan who earlier directed the film The End helmed the megaphone for the project. The makers wrapped up the entire shoot and are currently busy with the post-production activities. The delay in the graphics work is said to be the reason for the constant postponement of the movie.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more