twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కబాలి, వివేకం రికార్డులు బ్రేక్.. మెర్సల్‌కు వంద కోట్లు!

    తమిళ ఇలయ దళపతి విజయ్ నటించిన మెర్సల్ చిత్రం భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. విజయ్ త్రిపాత్రాభినయానికి ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. రిలీజైన రోజు తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ కావడంతో సినిమాక

    By Rajababu
    |

    తమిళ ఇలయ దళపతి విజయ్ నటించిన మెర్సల్ చిత్రం భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. విజయ్ త్రిపాత్రాభినయానికి ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. రిలీజైన రోజు తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ కావడంతో సినిమాకు ఎదురే లేకుండా పోయింది. ఈ చిత్రం వంద కోట్ల మార్కును దాటేందుకు పరుగులు పెడుతున్నది.

    4500 స్క్రీన్లలో మెర్సల్

    4500 స్క్రీన్లలో మెర్సల్

    మెర్సల్ చిత్రం దేశవ్యాప్తంగా 4500 స్క్రీన్లలో రిలీజైంది. గురువారం నుంచి ప్రతీ రోజు 95 శాతం అక్యుపెన్సీ సాధిస్తున్నది. విడుదలైన రోజే రూ.43.3 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు నాటికి 70 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం.

    100 కోట్ల క్లబ్‌లో

    100 కోట్ల క్లబ్‌లో

    శనివారానికి మెర్సల్ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది అని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రజనీకాంత్ నటించిన కబాలీ, అజిత్ చిత్రం వివేకం కలెక్షన్ల రికార్డులను తుడిచిపెట్టింది అని చెబుతున్నారు.

    150 కోట్ల క్లబ్‌లో

    150 కోట్ల క్లబ్‌లో

    మెర్సల్ చిత్రం ఇదే ఊపును కొనసాగిస్తే 150 కోట్ల క్లబ్‌లో చేరడం చాలా సులభం అనే మాట వినిపిస్తున్నది. ఎందుకంటే మెర్సల్ రిలీజ్ తర్వాత లాంగ్ వీకెండ్ ఉండటం కలిసి వచ్చిందంటున్నారు.

    జీఎస్టీపై విజయ్ ఎటాక్

    జీఎస్టీపై విజయ్ ఎటాక్

    క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశంలో.. సింగపూర్‌లో వైద్య సేవలపై జీఎస్టీ కేవలం 7 శాతం. అయితే అక్కడ ఉచితంగా మందులు ఇస్తారు. కానీ మనదేశంలో అదే వైద్య సేవలపై విధించేంది 28 శాతం, అదనంగా మందుల కొనుగోలుపై 12 శాతం పన్ను విధిస్తారు. ఇదెక్కడి న్యాయం. పేద కుటుంబాలకు శాపంగా మారిన మద్యంపై ఇక్కడ ఎలాంటి పన్ను ఉండదు. ఇది మన ప్రభుత్వాల తీరు అని హీరో ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మెర్సల్‌లోని జీఎస్టీ సన్నివేశం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

    మెర్సల్ డైలాగ్స్‌ను తొలగించాలి

    మెర్సల్ డైలాగ్స్‌ను తొలగించాలి

    కేంద్రం అమలు చేస్తున్న జీఎస్టీపై కొన్ని సన్నివేశాల్లో హీరో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. వాటిని వెంటనే సినిమా నుంచి తొలగించాలి. ఆ డైలాగ్స్‌ విజయ్ రాజకీయ ఆకాంక్షలకు అద్దంపడుతున్నాయి అని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తమిలిసాయి సౌందర్‌రాజన్ విమర్శించాడు.

    120 కోట్ల బడ్జెట్‌తో

    120 కోట్ల బడ్జెట్‌తో

    మెడికల్ మాఫియాపై ధ్వజమెత్తుతూ రూపొందించిన మెర్సల్ చిత్రం బడ్జెట్ 120 కోట్లు. ఈ చిత్రంలో విజయ్‌కు జంటగా కాజల్, సమంత అక్కినేని, నిత్యామీనన్ నటించారు. దర్శకుడు ఎస్‌జే సూర్య మరోసారి పవర్ ఫుల్ పాత్రలో కనిపించారు.

    English summary
    Ilayathalapathy Vijay has hit it out of the park once again! His latest release Mersal has opened to phenomenal response from the audience all over the world. According to trade reports, Mersal is all set to enter the Rs 100-crore club either today or tomorrow. In Tamil Nadu, the Thalapathy-starrer has officially surpassed the collections of superstar Rajinikanth's Kabali and Ajith Kumar's Vivegam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X