»   » దయచేసి అర్థం చేసుకోమంటున్న విజయ్.. కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు!

దయచేసి అర్థం చేసుకోమంటున్న విజయ్.. కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు!

Subscribe to Filmibeat Telugu

డిజిటల్ ప్రొవైడర్స్ ఛార్జీలకు వ్యతిరేకంగా తమిళ చిత్ర పరిశ్రమ గత నాలుగు రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలో భాగంగా తమిళ చిత్ర పరిశ్రమ మొత్తం షూటింగ్ లని నిలిపివేసింది. అందరూ నిరసనలో భాగం అవుతున్నారు. కానీ స్టార్ హీరో విజయ్ మాత్రం తన చిత్ర షూటింగ్ ని కొనసాగిస్తుండడం వివాదంగా మారుతోంది. అంతా సినిమాలు ఆపేసి నిరసన తెలియజేస్తుంటే విజయ్ మాత్రం చిత్ర షూటింగ్ ని ఎలా కొనసాగిస్తాడని సినీ ప్రముఖులు విరుచుకుపడుతున్నారు.

దీనికి విజయ్ చిత్ర బృందం వివరణ ఇచ్చింది. ఈ చిత్రానికి ముందుగా ఫైట్ మాస్టర్స్ డేట్స్ ఇచ్చారని, ఇప్ప్పుడు షూటింగ్ జరపకపోతే తరువాత వారు అందుబాటులో ఉండరని చెబుతున్నారు. అందువలనే షూటింగ్ ని కొనసాగిస్తున్నామని అంటున్నారు. షూటింగ్ ఇప్పుడు ఆపేస్తే సినిమాకు భారీ నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. ప్రముఖ నటుడు శరత్ కుమార్ దీనిపై స్పందించారు. తాము కూడా తమ చిత్రాలకు నష్టం వాటిల్లుతుందని తెలిసిన షూటింగ్ లని నిలిపివేశామని, నిరసనలో పాల్గొనకుండా ఇలా కారణాలు చెప్పడం తగదని అన్నారు. మురుగదాస్ దర్శత్వం వహిస్తున్న ఈ చిత్రం దళపతి 62 అని వర్కింగ్ టైటిల్ ని కొనసాగిస్తున్నారు.

Vijay’s Thalapathy 62 film were given permission to shoot
English summary
Vijay movie in controversy. Vijay’s Thalapathy 62 film were given permission to shoot
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X