»   » ఇందిరా పార్కు వద్ద విజయ్, సమంత సందడి (ఫోటోలు)

ఇందిరా పార్కు వద్ద విజయ్, సమంత సందడి (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ హీరో విజయ్, లవ్లీ లేడీ సమంత కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతోంది. 'తుపాకీ' తర్వాత ఎ.ఆర్. మురగదాస్, విజయ్‌ల కాంభినేషన్లో వస్తున్న తమిళ సినిమా ఇదే. ఈ చిత్రం 'కత్తి' అనే టైటిల్‌తో తెరెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.

ఇటీవల పాతబస్తీలో గల చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌పై సినిమా షూటింగ్ జరిగింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో ఇందిరా పార్కు వద్ద జరుగుతోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న మురుగదాస్ కథ కూడా అందించారు. ఐనగరన్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. అనిరుధ్ రవిచంద్ర్ సంగీతం అందిస్తున్నాడు.

ఇందిరా పార్కు వద్ద షూటింగుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో.....

విజయ్-మురుగదాస్

విజయ్-మురుగదాస్


గతంలో విజయ్- మురగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన 'తుపాకి' చిత్రం అటు తమిళనాడుతో పాటు ఇటు తెలుగునాట కూడా మంచి విజయం సాధించింది.

సమంత

సమంత


ఈ సినిమా ద్వారా మొట్టమొదటిసారి సమంత, విజయ్‌తో జోడీ కడుతోంది. దీనికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ స్వరాలు సమకూర్చనున్నారు.

భారీ అంచనాలు

భారీ అంచనాలు


విజయ్- మురగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన 'తుపాకి' విజయం సాధించిన నేపథ్యంలో తర్వాతి సినిమాపై భారీ అంచనాలు ఉండటం సహజం. అందుకు తగిన విధంగానే ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

కత్తి

కత్తి


ఈ చిత్రానికి కత్తి అనే టైటిల్ ఖరారు చేసారు. అయితే తెలుగులో ఈ చిత్రానికి ఏం టైటిల్ పెట్టబోతున్నారనేది తెలియాల్సి ఉంది.

English summary

 Tamil actor Vijay, Samantha participated in a movie shooting at Indira park, Hydreabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu