»   » "సైరా"లో విజయ్ సేతుపతి పవర్ఫుల్ పాత్ర: కోలీవుడ్ దృష్టి కూడా మెగాస్టార్ సినిమా మీదే

"సైరా"లో విజయ్ సేతుపతి పవర్ఫుల్ పాత్ర: కోలీవుడ్ దృష్టి కూడా మెగాస్టార్ సినిమా మీదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

విజయ్ సేతుపతి కోలీవుడ్ లో ఒక పాత్ర చేస్తున్నాడూ అంటే అది ఖచ్చితంగా ఒక డిఫరెంట్ ఆట్టిట్యూడ్ తో ఉంటుంది.ఇది తమిళుల నమ్మకం. అతని కెరీర్ లో ఫెయిల్యుర్స్ ఉండొచ్చుగాక కానీ విజయ్ ఎన్నుకునే పాత్రల్లఒ ఒక వైవిధ్యం ఉంటుందని ఒక అభిప్రాయం అక్కడివారందరిలో ఉంది. ఇప్పటివరకూ ఏ హీరో సినిమాలోనూ అతను సపోర్టింగ్ క్యారెక్టర్ చెయ్యలేదు కానీ మొట్టమొదటిసారి పరభాషలో వస్తున్న ఒక సినిమాలో అలాంటి పాత్ర చేయటానికి సిద్దమయ్యాడు విజయ్ సేతుపతి... ఆ సినిమానే తెలుగులో వస్తున్న సైరా... ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర బ్యాక్ డ్రాప్ లో మెగాస్టార్ తో పాటు నటించటానికి విజయ్ ఓకే అన్నాడు అనగానే టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ కూడా ఈ సినిమా వైపు ఆసక్తిగా చూస్తోందిప్పుడు..

క్యారక్టర్ ఏంటనేది అడగకుండానే

క్యారక్టర్ ఏంటనేది అడగకుండానే

ఇప్పుడు విక్రమ్ వేద సినిమాతో మరో పెద్ద హిట్టును కొట్టేశాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి పక్కనే నటించాలనే ఆపర్ రాగానే.. అసలు క్యారక్టర్ ఏంటనేది అడగకుండానే ఓకే చేశాడట. ఈ సినిమాలో మనోడు బ్రిటీష్ వారి దగ్గర సిపాయిగా పనిచేసే ఒక భారతీయుడు పాత్రలో నటిస్తున్నాడని టాక్.

బ్రిటిష్‌ అంగరక్షకుడిగా

బ్రిటిష్‌ అంగరక్షకుడిగా

ఇంతకీ 'సైరా'లో సేతుపతి చేసేదేంటి? ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి బ్రిటిష్‌ అంగరక్షకుడిగా నెగెటివ్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయ్ పోషిస్తున్న పాత్ర తొలుత ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పాత్రను అస్సలు ఇష్టపడదట.

బ్రిటీష్ వారిపైకి దండయాత్రకు

బ్రిటీష్ వారిపైకి దండయాత్రకు

కాని చివరకు మాత్రం ఉయ్యాలవాడ తపనను అర్ధంచేసుకుని.. ఆయనతో చేతులు కలిపి.. బ్రిటీష్ వారిపైకి దండయాత్రకు సిద్దపడుతుందట. చివరకు ఉయ్యాలవాడతో కలసి ప్రాణాలు అర్పిస్తుందట. అంతటి ఎమోషన్ ఉన్న పాత్ర కాబట్టే అడగ్గానే విజయ్ సేతుపతి ఓకే అనేశాడు.

రెగ్యులర్‌ యాక్టర్స్‌ కాకుండా

రెగ్యులర్‌ యాక్టర్స్‌ కాకుండా

కథలో ఈ పాత్ర చాలా కీలకమని, ఈ పాత్రకి పేరున్న నటుడు అవసరమని, అయితే రెగ్యులర్‌ యాక్టర్స్‌ కాకుండా ఎవరైనా పాపులర్‌ యాక్టర్‌ అయితే బాగుంటుందని ఆలోచించి చివరకు విజయ్‌ సేతుపతిని ఫైనలైజ్‌ చేసారట. ఇతను ఈ చిత్రంలో నటిస్తున్నాడని తెలియడంతో ఒక్కసారిగా తమిళ మీడియాతో పాటు అక్కడి జనాలు కూడా సైరాపై ఆసక్తి చూపిస్తున్నారు.

English summary
The Tamil actor will reportedly play a British guard in the film Syra, the story of an erstwhile freedom fighter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu