twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అభిమానుల సమక్షంలో నటి విజయ నిర్మల పుట్టినరోజు వేడుకలు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల పుట్టినరోజు వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అభిమానులు భారీగా తరలివచ్చి విజయ నిర్మలకు శుభాకాంక్షలు తెలిపారు. సినీ ప్రముఖులు దాసరి నారాయణరావు, జయసుధ, నరేష్ తదితరులు ఈ వేడుకల్లొన్నారు.

    ఈ సందర్భంగా వేద పండితులు విజయనిర్మల-కృష్ణ దంపతులను ఆశీర్వదించారు. వేడకలు ముగిసిన అనంతరం విజయనిర్మాల చేతుల మీదుగా పేదలకు దుస్తులు పంపిణీ చేసారు. పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలతో పాటు, విజయ నిర్మల గురించి వివరాలు స్లైడ్ షోలో.....

    విజయ నిర్మల

    విజయ నిర్మల


    విజయనిర్మల 1946లో జన్మించారు. విజయనిర్మల పుట్టిల్లు నరసరావుపేట. విజయనిర్మల బాల్యం అత్యధిక కాలం పాతూరులోనే గడిచింది. రాజాగారి కోటలోని విక్టోరియా హాల్లో ఆమె చిన్నతనంలో నృత్య ప్రదర్శన కూడా ఇచ్చింది. తదనంతర కాలంలో విజయనిర్మల తల్లిదండ్రులతో కలిసి మద్రాస్‌ వెళ్లిపోయారు.

    బాల నటిగా...

    బాల నటిగా...


    పాండురంగ మహత్యంలో బాలనటిగా చిత్రరంగంలో ప్రవేశించారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి కథానాయకిగా ఉన్నతస్థానానికి చేరారు.

    గిన్నిస్ బుక్ రికార్డ్

    గిన్నిస్ బుక్ రికార్డ్


    2002 లో ప్రపంచములోనే అతిఎక్కువ సినిమాలు తీసిన మహిళా దర్శకురాలిగా గిన్నీస్ ప్రపంచ రికార్డు సాధించారు విజయ నిర్మల.

    దర్శకత్వంలోకి...

    దర్శకత్వంలోకి...


    హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేసిన తర్వాత 1971లో దర్శకత్వం వహించడము ప్రారంభించారు. విజయ నిర్మల నటించిన అధిక చిత్రాలలో కధానాయకుడు కృష్ణే కావటం విశేషం. వీరిద్దరూ జంటగా సుమారు యాభై వరకూ చిత్రాలలో నటించారు.

    అసలు పేరు నిర్మల

    అసలు పేరు నిర్మల


    ఈమె అసలు పేరు నిర్మల అయితే తనకు సినీరంగములో తొలి అవకాశమిచ్చిన విజయా స్టూడియో‌కు కృతజ్ఞతగా విజయనిర్మల అని పేరు మార్చుకొన్నారు.

    విజయ సంస్థపై అభిమానం అలా...

    విజయ సంస్థపై అభిమానం అలా...


    బాలనటిగా ఆమె 'పాండురంగ మహాత్మ్యం' (బాలకృష్ణుడి పాత్ర) వంటి చిత్రాలలో నటించినా, పెద్దయిన తర్వాత హీరోయిన్‌గా నటించిన మొదటి చిత్రం 'భార్గవీ నిలయం'. ఆ మలయాళ చిత్రంలో ప్రేమ్‌నజీర్‌ హీరో. అప్పుడామె వయసు 18 సంవత్సరాలు. అప్పట్లో విజయావారు తమ తొలి చిత్రం 'షావుకారు'ను 'ఎంగవీట్టు పెణ్‌' పేరుతో తమిళంలో తీయాలని సంకల్పించి తెలుగులో ('షావుకారు') జానకికి తొలి అవకాశం ఇచ్చినట్లుగానే తమిళంలో నిర్మలకు ఇచ్చి ప్రోత్సహిద్దామనుకున్నారు.

    ఆమె కోసం ఎస్వీ రంగారావును తీసేసారు

    ఆమె కోసం ఎస్వీ రంగారావును తీసేసారు


    షూటింగ్‌ రోజున నిర్మల మేకప్‌ వేసుకుని ఆనందంగా సెట్లోకి వెళ్లింది. ఆ చిత్రంలో ఆమెకు మామగారి పాత్రలో ఎస్‌.వి.రంగారావు నటిస్తున్నారు. నిర్మల సన్నగా ఉండటంతో ఎస్వీ రంగారావు అభ్యంతరం చెప్పారు. అవకాశం పోయిందని బాధ పడింది. మర్నాడు షూటింగ్‌కు పిలుపొచ్చింది. 'ఏం జరిగి ఉంటుందా?' అని నిర్మల ఆశ్చర్యంతో మేకప్‌ వేసుకుని సెట్లోకి వెళ్తే, అక్కడ మామగారి స్థానంలో ఎస్‌విఆర్‌కు బదులుగా ఎస్‌.వి. సుబ్బయ్య అనే క్యారెక్టర్‌ నటుడున్నారు. అంటే హీరోయిన్‌కు అభ్యంతరం చెప్పినందుకు నిర్మాతలు ఎస్‌విఆర్‌నే తీసేశారన్నమాట. ఆ చిత్రం తమిళంలో హిట్‌ కావడంతో నిర్మల అప్పటి నుంచీ 'విజయ'నిర్మల అయింది.

    English summary
    Vijaya Nirmala Birthday celebrations held in Hyderabad today. Vijaya Nirmala actress and director who has directed 44 movies. In 2002, the Guinness Book of Records named her as the female director who had made the highest number of films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X