Don't Miss!
- News
Lady: ప్రతీకారం, 58 ఏళ్ల ఆంటీని రేప్ చేసి చంపేసిన 16 ఏళ్ల అబ్బాయి, పగతో ప్రైవేట్ పార్ట్స్ ను వదల్లేదు !
- Finance
Telangana Budget: కీలక రంగాలకు కేటాయింపులు ఇలా.. జర్నలిస్టుల సంక్షేమానికి కూడా..
- Sports
INDvsAUS : స్పిన్ పిచ్‌లతో భారత్‌కూ సమస్యే?.. రికార్డులు చూస్తే తెలిసిపోతోంది!
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మనుషుల వికృత చేష్టలకు ఏ శిక్ష సరిపోతుంది?.. విజయశాంతి ఆవేదన
కేరళలో గర్భం దాల్చిన ఏనుగు మృతిపై యావత్ భారతావని స్పందించింది. మనుషులను నమ్మి మోసపోయి ప్రాణాలను కోల్పోయిన ఏనుగుపై మానవాళి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏనుగు మృతిపై సామాన్య జనంతో పాటు సెలెబ్రిటీలందరూ ఆవేదన చెందారు. ఈ దుర్ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని అందరూ కోరారు. తాజాగా సినీ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి తీవ్ర ఆవేదకు లోనయ్యారు. అసలు ఏం జరిగిందంటే..

నమ్మించి వంచించారు..
గర్భం దాల్చిన ఏనుగు ఆహారం కోసం గ్రామంలోకి రావడంతో కొందరు ఆకతాయిలు టపాసులు అమర్చిన పైనాపిల్‌ను దానికి ఇచ్చారు. తింటూ ఉండగానే అది పేలిపోవడంతో నోటికి పెద్ద దెబ్బ తగిలింది. ఆ దెబ్బకు తట్టుకోలేక దగ్గర్లోని నదిలోకి వెళ్లింది. అలా అక్కడే ఆ ఏనుగు కూడా మృతి చెందింది. లోకాన్ని చూడని ఆ చిట్టి ఏనుగు గర్భంలోనే అంతమైంది.

స్పందించిన రాములమ్మ..
ఏనుగు మృతిపై రాములమ్మ స్పందిస్తూ.. ‘ఈ సృష్టిలో గొప్ప జీవి మనిషేనని గర్వంగా చెబుతారు. కానీ, దేవుడికి తన సృష్టిపై తనకే అసహ్యం వేసేలా ప్రవర్తిస్తున్నారు మనుషులు. ఈ ప్రకృతిపై మనిషికి మాత్రమే ఆధిపత్యం ఉన్నట్టు, మిగిలిన జీవాల మనుగడ మనిషి దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి ఉన్నట్టు కొందరు ప్రవర్తిస్తున్న తీరుతో కడుపు రగులుతోంది.

వికృతచేష్టలకు ఏ శిక్ష సరిపోతుంది?
కేరళలో గర్భంతో ఉన్న ఒక ఏనుగుకు బాణాసంచా మందు కూరిన అనాసపండు పెట్టి, ఆ మూగజీవి మరణవేదనను క్రూరంగా వినోదించిన ఈ మనుషుల వికృతచేష్టలకు ఏ శిక్ష సరిపోతుంది? ఇదే కాదు, టిక్‌టాక్ వీడియో కోసం ఓ కుక్కపిల్ల కాళ్ళూచేతులు కట్టేసి మురికి కాలువలోకి విసిరి ప్రాణాలు తీసిన ఘోరాన్ని చూశాం.

అసలేం జరుగుతోంది..
అంతకుముందు ఒక వ్యక్తి మేడపై నుంచి కుక్కను దారుణంగా విసిరేశాడు. మూగజీవాలపై ఇలా ఎన్నెన్నో అకృత్యాలు... అసలేం జరుగుతోంది? ఇతర జీవులకు భూమ్మీద బతికే హక్కు లేదా? నేడు మన ప్రపంచం అనుభవిస్తున్న ఈ రోగాలు... దిగజారిన పరిస్థితులు... చూస్తుంటే...
Recommended Video

మానవత్వమున్న మనుషులుగా బతుకుదాం..
మనిషి చేసే తప్పులకు ఆ ప్రకృతి విధిస్తున్న శిక్షలే ఇవని అనిపిస్తోంది. తప్పు చేసినవారే కాదు... చూస్తూ స్పందించనివారు... అడ్డుకునే శక్తి ఉన్నప్పటికీ ఆ పని చెయ్యనివారు కూడా శిక్షార్హులే. అందుకే ఇకనైనా మారదాం... నిండైన మానవత్వమున్న మనుషులుగా బతుకుదాం. ఆ పరమేశ్వరుని దృష్టిలో మనం కృతఘ్నులం కావద్దు. మీ విజయశాంతి' అని పేర్కొంది.