»   » రాజమౌళి... ‘మహాభారతం’ గ్యారంటీ, ‘మగధీర-2’ రావచ్చేమో!

రాజమౌళి... ‘మహాభారతం’ గ్యారంటీ, ‘మగధీర-2’ రావచ్చేమో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'బాహుబలి' చిత్ర కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ తన సొంత దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'శ్రీవల్లి'. సెప్టెంబర్ 15వ సినిమా రిలీజ్ కాబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. దీంతో పాటు రాజమౌళి చేయబోయే 'మహాభారతం' గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మగధీర-2 గురించి అడిగితే ఆసక్తికరంగా స్పందించారు.

శ్రీవల్లి సినిమాను గురించి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడారు. మనసు, ఆలోచనలకి సంబంధించిన మానసిక విశ్లేషణగా ఈ కథ కొనసాగుతుందన్నారు. వాల్మీకి రాసిన 'రామాయణం' ఎలా విషాదం నుంచి పుట్టిందో, అలానే 'శ్రీవల్లీ' కూడా విషాదంలోంచే వచ్చిందన్నారు.

ఆ బాధలో నుండి పుట్టిన కథే

ఆ బాధలో నుండి పుట్టిన కథే

నా ప్రాణమిత్రుడైన రమేష్‌ విజయవాడలో ఉండేవాడు. ఓ సారి వినాయకచవితి రోజు బాగా గుర్తొచ్చాడు. అపుడు ఎందుకో వెళ్లలేక పోయాను. ఆ తరువాత రెండేళ్లకు వైజాగ్ లో ఆయన ఇంటికి వెళ్లాను. అయితే 2010లో వినాయక చవితి ముందు రోజు చనిపోయాడనీ, చివరి క్షణాల్లో నన్ను బాగా తలుచుకున్నాడని తెలిసింది. నా మిత్రుడు నన్ను తలచుకున్నప్పుడే .. నా మనసు ఆయన వైపుకు ఎందుకు లాగింది? అనే ఆలోచనలో నుంచి, ఆ బాధలో నుంచి ఈ కథ పుట్టిందని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

అందరూ కొత్త స్టార్స్

అందరూ కొత్త స్టార్స్

ఎరోటిక్ థ్రిల్లర్ చిత్రమిది. పేరున్న నటీనటులు వారి ఇమేజ్‌ను పక్కనపెట్టి కొత్త తరహా సినిమాలు చేసినా అవి ఆకట్టుకోవడం కష్టం. ప్రేక్షకులకు తొందరగా రుచించవు. ఎలాంటి ఇమేజ్‌లేని కొత్త నటీనటులయితే పాత్రల కంటే కథపైనే దృష్టిపెట్టి సినిమాను బలంగా తెరపై చూపించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే నూతన తారలతో ఈ సినిమా చేశామని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

మనసుపై ప్రయోగం

మనసుపై ప్రయోగం

ప్రోటాన్స్, న్యూట్రన్స్‌తో పాటు విశ్వాంతరాలలో లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఖగోళాలను మనసుతో చూడగలుగుతున్నాం. అలాంటి మనసును కొలవగలిగితే, చూడగలిగితే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి ఈ కథ పుట్టింది. పుట్టుకతో ఏ మనిషి దొంగ, వ్యసనపరుడు కాడు. పరిస్థితులే వారిని అలా మారుస్తాయి. ఆ మార్పును సరిదిద్ది వారిని స్వచ్ఛమైన మనస్కులుగా మళ్లీ మార్చగలిగితే ఎలా ఉంటుందనే అంశాన్ని సినిమాలో చూపించాం. ఓ అమ్మాయి మనసుపై శాస్త్రవేత్త చేసిన ప్రయోగం కారణంగా ఆమెకు గతజన్మలోని ప్రియుడితో పాటు స్మృతులు గుర్తుకువస్తాయి. ఆ తర్వాత ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయన్నది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుందని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

మగధీర-2

మగధీర-2

మగధీర-2 కథ రాస్తారా? వచ్చే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు విజయేంద్రప్రసాద్ ఆసక్తికరంగా స్పందించారు. చిరంజీవి, రామ్‌చరణ్‌ల కోసం ఆ స్థాయిలో ఓ కథ రాయాలని ఉంది. రాజమౌళి వెసులు బాటును బట్టి ఎప్పుడైనా ఆచరణలోకి రావచ్చు అన్నారు.

మహాభారతం

మహాభారతం

రాజమౌళి తన కోరీర్లో ‘మహాభారతం' తీయడం గ్యారంటీ. అది ఎప్పుడో నేనూ కచ్చితంగా చెప్పలేను. రాజమౌళికి యుద్ధాలంటే బాగా ఇష్టం. వాటి కోసమైనా ‘మహాభారతం' తీస్తాడు అంటూ విజయేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు.

బాహుబలిలో కొత్తదనం లేదు

బాహుబలిలో కొత్తదనం లేదు

‘బాహుబలి' అనేది అత్తాకోడళ్ల మధ్య జరిగే కథ. లేదంటే అన్నదమ్ముల మధ్య జరిగే కథ. దాన్నే హంగులతో సర్వాంగసుందరంగా తయారుచేసే సరికి గొప్ప సినిమా అయింది... అంతే తప్ప అందులో కొత్తదనం లేదు. మహాభారతం తీయగలనా? లేదా? అని తనను తాను టెస్టు చేసుకోవడానికే ‘బాహుబలి' తీశాడు, అందులో విజయం సాధించాడు. మహాభారతం తీయగలననే నమ్మకం ఇపుడురాజమౌళిలో ఏర్పడింది అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.

రెహమాన్ అడిగారు

రెహమాన్ అడిగారు

విజయ్‌ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘మెర్సాల్‌'కు స్ర్కీన్‌ప్లే రాశాను. ఆ సినిమా ఆడియో వేడుకలో దాని మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎ.ఆర్‌. రెహమాన్‌గారు తన దగ్గర ఓ ఓ పాయింట్‌ ఉందని, దాన్ని డెవలప్‌ చేసి పెట్టమని అడిగారని, ఆయన అడగటం చాలా సంతోసంగా ఉంది. అయితే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

ఝాన్సీ లక్ష్మీభాయి కథ గురించి

ఝాన్సీ లక్ష్మీభాయి కథ గురించి

డైరెక్టర్‌ క్రిష్‌ అయితేనే ఝాన్సీ లక్ష్మీ భాయి కథ రాస్తాననే కండిషన్‌ పెట్టాను. క్రిష్‌ తీసిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి'ని నిర్మాతలు, కంగన చూశారు. ఇంతకంటే మంచి డైరెక్టర్‌ తమకు ఎక్కడ దొరుకుతారని వాళ్లూ ఆనందించారు. హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ నిక్‌ పోవెల్‌ ఆధ్వర్యంలో ఇటీవల రామోజీ ఫిల్మ్‌సిటీలో 30 రోజులు యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించారు... విజయేంద్ర ప్రసాద్ అని తెలిపారు.

English summary
Vijayendra Prasad interesting comments about Magadheera 2. "Yes, may be Chiru and Charan in the sequel." Vijayendra Prasad said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu