»   » బాహుబలి-3 మీద క్లారిటీ ఇచ్చిన విజయేంద్రప్రసాద్!

బాహుబలి-3 మీద క్లారిటీ ఇచ్చిన విజయేంద్రప్రసాద్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి మూవీ అభిమానులను కొన్ని రోజులుగా వేధిస్తున్న ప్రశ్నకు క్లారిటీ దొరికింది. బాహుబలి మూవీ పార్ట్-2తోనే ఆగిపోతుందా? లేక భవిష్యత్తులో పార్ట్-3 ఉండే అవకాశం ఉందా? అనే సందేహానికి ఇటీవల ఇంటర్వ్యూలో సరైన సమాధానం ఇవ్వలేక పోయాడు దర్శకుడు రాజమౌళి.

తన తండ్రి విజయేంద్ర ప్రసాద్.... బాహుబలి-3 కథ రాస్తే, అది నాకు నచ్చితే తప్పకుండా తీస్తా అని అన్నారు. ప్రస్తుతానికైతే కథ లేదు, అందుకే నేను పార్ట్-3 తీస్తాననిగానీ, తీయనని గానీ ఇప్పుడే గ్యారంటీ ఇవ్వలేనని చెప్పుకొచ్చారు రాజమౌళి.

అయితే ఈ విషయమై తాజాగా రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పందించారు.

బాహుబలి పార్ట్-3 సినిమా ఉండదు

బాహుబలి పార్ట్-3 సినిమా ఉండదు

బాహుబ‌లి స్టోరీని ఇప్ప‌టికే పూర్తి చేశాం. మూడో పార్ట్ ఉండ‌టానికి ఆస్కారం లేదు. నేనుగానీ, నా కుమారుడుగానీ దీనిపై ఎలాంటి ఆలోచ‌న చేయ‌లేదు. నేను స్టోరీ కూడా రాయ‌డం లేదు అని విజ‌యేంద్ర ప్ర‌సాద్ వెల్ల‌డించారు.

బాహుబలి ప్రపంచం ఇక్కడితో ముగియదు

బాహుబలి ప్రపంచం ఇక్కడితో ముగియదు

ఇకపై బాహుబలి సిరీస్ సినిమాలు ఉండవని, అయితే బాహుబ‌లి ప్ర‌పంచం మాత్రం కొనసాగుతుందని విజయేంద్రప్రసాద్ చెప్పారు. బాహుబ‌లిపై కామిక్ సిరీస్‌, టీవీ సిరీస్ రానున్నాయని విజయేంద్రప్రసాద్ తెలిపారు.

అవే సెట్స్ లో షూటింగ్

అవే సెట్స్ లో షూటింగ్

భవిష్యత్తులో రాబోయే బాహుబలి కామిక్ సిరీస్, టీవీ సిరీస్ షూటింగ్ ప్రస్తుతం ఉన్న బాహుబలి సెట్స్‌లో షూటింగ్ జరుపుకుంటాయని విజయేంద్ర ప్ర‌సాద్ తెలిపారు.

వెయ్యికోట్ల బాహుబలి

వెయ్యికోట్ల బాహుబలి

కాగా... బాహుబలి-2 మూవీ రూ. వెయ్యికోట్లు వసూలు చేసి సరికొత్త చరిత్ర క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇండియాలో ఇంత భారీ వసూళ్లు సాధించిన తొలి చిత్రం ఇదే.

English summary
The senior writer Vijayendra Prasad said that he penned the story for only two parts and that neither he nor his son are planing to make a third part. He confirmed that there won't be Baahubali 3.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu