»   » రాజమౌళికి గర్వం తలకెక్కొద్దు, కొట్టాను: విజయేంద్ర ప్రసాద్

రాజమౌళికి గర్వం తలకెక్కొద్దు, కొట్టాను: విజయేంద్ర ప్రసాద్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ సినీ కథా రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ ఇండియాలో ఇపుడు టాప్ ఆఫ్ ది టౌన్ గా మారారు. ఎందుకంటే ఆయన కథ అందించిన ‘బాహుబలి' సినిమాతో పాటు సల్మాన్ ఖాన్ నటించిన బాలీవుడ్ మూవీ ‘బజ్రంగి భాయిజాన్' చిత్రాలు విడుదలైన భారీ విజయాలు అందుకున్నాయి.

ఈ సందర్భంగా ఆయన నవ్య ఇంటర్వ్యూలో తన గురించి, తన తనయుడు రాజమౌళి గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తెల్లవారుజామున వాకింగ్‌ చేస్తున్నప్పుడే నాకు సినిమా కథలకు థాట్స్‌ వస్తాయి. నా కథలు అప్పుడే రూపుదిద్దుకుంటాయి. ఇప్పటికి సుమారు ఇరవై సినిమాలకు కథలు రాశానని తెలిపారు.

రాజమౌళి గురించి చెబుతూ...రాజమౌళి ఏలూరులో చదువుకున్నాడు. ఇంటర్మీడియట్‌ తర్వాత రాజమౌళిని చదివించడానికి ఆర్థిక స్తోమతు లేకపోవడంతో ఆయన్ని సినిమా పరిశ్రమకు తీసుకురావల్సి వచ్చింది. అలా రాజమౌళి మద్రాసు వచ్చేశాడు. కోటగిరి వెంకటేశ్వరరావు గారి దగ్గర అసిస్టెంట్‌ ఎడిటర్‌గా చేరి మూడు సంవత్సరాలు పనిచేశాడు. తర్వాత క్రాంతికుమార్‌గారి దగ్గర కొన్నాళ్ళు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. అలా సినిమా రంగంలో పనిచేస్తున్నప్పుడు, ఆయనలో చిత్తశుద్ధి, ఏకాగ్రతతో పాటు ఒక స్పార్క్‌ చూశానని నవ్య ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.

Vijayendra Prasad Interview about Rajamouli

బాహుబలి గురించి...మాట్లాడుతూ ఒక శుభముహూర్తాన, ఇంట్లో ఉన్నప్పుడు ‘ప్రభాస్‌తో ఒక సినిమా చెయ్యాలి నాన్నా' అన్నాడు రాజమౌళి. ‘కాస్ట్యూమ్స్‌ కరెక్ట్‌గా ఉండాలి, ప్రతీ కేరక్టరూ పరిపుష్టంగా ఉండాలి' అన్నాడు. అప్పుడే ఆ సినిమా కథ పురుడుపోసుకుంది. బాహుబలి చిత్రంలోని ఆఖరి సన్నివేశాన్ని, నేను కథాప్రారంభంగా రాజమౌళికి చెప్పినప్పుడు అది ఆయనకు బాగా నచ్చింది. బాహుబలి సినిమాకు సంబంధించిన పాత్రలు, సన్నివేశాలు రాజమౌళి మనసులోంచి పుట్టినవే. ఆయన మనసులోని ఆలోచనలను వరుస క్రమంలో పేర్చడానికి నేరు రచయితగా దోహదపడ్డాను అని విజయేంద్ర ప్రసాద్ నవ్య ఇంటర్వ్యూలో తెలిపారు.

బాహుబలి హాలీవుడ్‌ రేంజ్‌లో ఈ చిత్రం విజయవంతమయిందంటున్నారు. అంతా భగవత్‌ సంకల్పం. ఆ గర్వం ఆయన తలకెక్కకూడదని ఆ దేవుడికి నేను దణ్ణం పెట్టుకుంటాను. రాజమౌళి అమ్మకూచిగానే పెరిగాడు. ఆయన్ని ఎప్పుడూ కొట్టి శిక్షించలేదు. కానీ ఒకసారి మాత్రం కొట్టవల్సి వచ్చింది. ఒకరోజు నేను ఇంటికి వచ్చేసరికి నేలమీద ఒక లైనులో పాకుతూ వెళుతున్న చీమల్ని నలుపుతూ చంపడం గమనించాను. వెంటనే పిర్ర మీద గట్టిగా ఒక్క దెబ్బ కొట్టాను. ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకున్నాడు రాజమౌళి. ఎత్తుకుని సముదాయించాను. ఇప్పుడు ‘నిన్ను ఎందుకు కొట్టానో తెలుసా? అని అడిగాను. కన్నీళ్ళు పెట్టుకుంటూనే తెలియదన్నాడు. ‘ఎందుకు ఏడ్చావ్‌?' అని అడిగాను. నొప్పి పుట్టింది అన్నాడు. నువ్వు నలిపినప్పుడు చీమలకు కూడా అలాగే నొప్పి పుడుతుంది. జీవహింస మహాపాపం. ఇతరుల్ని ఎప్పుడూ అలా బాధ పెట్టకూడదు' అని చెప్పాను. ఆ తర్వాత ఆయన్ని నేను ఎప్పుడూ కొట్టలేదు అంటూ విజయేంద్రప్రసాద్ నవ్య ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

English summary
Vijayendra Prasad Interview about Rajamouli.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu