»   » బాహుబలి అనే ట్రైలర్ కోసం జనం వందల కోట్లు పోసారు : రాజమౌళి తండ్రి

బాహుబలి అనే ట్రైలర్ కోసం జనం వందల కోట్లు పోసారు : రాజమౌళి తండ్రి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పుడు భారత దేశం మొత్తం ఒక మ్యానియా... దాని పేరు బాహుబలి 2. ఇప్పుడు టాలీవుడ్ సినిమా అంటే కేవలం తెలుగు వాళ్ళ సినిమా మాత్రమే కాదు దేశం మొత్తం ఎదురు చూసే సినిమా. "కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు? అన్న ప్రశ్న విలువ రమారమీ 1000 కోట్లు. ఇప్పటి వరకూ ప్రపంచం లోనే అతి ఖరీదైన ప్రశ్న ఇదేనేమో.

బాలీవుడ్ ని పక్కకు పెట్టి

బాలీవుడ్ ని పక్కకు పెట్టి

బాహుబలి ఇంతటి హైప్ తెచ్చుకోవటానికి కారణం పార్ట్ 1 తెరకెక్కిన విధానమే. అంత ఆసక్తి కరంగా సాగింది కథా, కథనమూ... నిన్నా మొన్నటి వరకూ టాలీవుడ్ ని చిన్న చూపు చూసిన ఉత్తరాది మొత్తం బాలీవుడ్ ని కూడా పక్కకు పెట్టి "బాహుబలి" ఎప్పుడొస్తాడు అంటూ ఎదురు చూసింది.


బాహుబలి ఒక ట్రైలర్

బాహుబలి ఒక ట్రైలర్

అలాంటి కథని ఎవరైనా కేవలం ఒక ట్రైలర్ అంటే మీకెలా అనిపిస్తుందీ..? ఆ అన్నది కూడా ఎవరో కాదు బాహుబలికి కథను సమకూర్చిన విజయేంద్రప్రసాద్. రాజమౌళి కి తండ్రికూడా అయిన ఆయన బాహుబలి: ది బిగినింగ్ ఒక ట్రైలర్ అంటూ తేల్చి పడేసారు...


బాహుబలి ఫస్ట్ హాప్ అనే ట్రైలర్

బాహుబలి ఫస్ట్ హాప్ అనే ట్రైలర్

ఎక్కడైనా సినిమాకు డబ్బులు ఖర్చు పెడతారని.. కానీ.. బాహుబలి ఫస్ట్ హాప్ అనే ట్రైలర్ కు జనాలు డబ్బులు పెట్టి చూశారు అంటూ. బాహుబలి 2 మ్ని గురించి మాట్లాడారాయన. ఏదైనా సినిమా ట్రైలర్ కు.. నిర్మాత డబ్బులు ఖర్చు చేసి.. ప్రచారం చేస్తారని.. కానీ.. బాహుబలి 2కి రెండున్నర గంటల ట్రైలర్ ను ప్రజలు విశేషంగా ఆదరించారని..,


వందల కోట్లు ఖర్చు

వందల కోట్లు ఖర్చు

కోట్లాది రూపాయిల్ని ఖర్చు చేశారని.. ఒక ట్రైలర్ కు వందల కోట్ల కలెక్షన్లు రావటం ఒక రికార్డుగా ఆయన వ్యాఖ్యానించటం విశేషం. రెండో భాగమే అసలైన కథ అని.. అందులోని క్యారెక్టర్లను పరిచయం చేయటానికి మొదటి భాగమన్నారు. ఏమైనా.. ట్రైలర్ కోసం వందల కోట్లు ఖర్చు చేయటం ఒక రికార్డుగా అభివర్ణించారు విజయేంద్రప్రసాద్.


గర్వంగా ప్రకటించారు

గర్వంగా ప్రకటించారు

నిజానికి ఆయన బాహుబలి పార్ట్ 1 ని తగ్గించలేదు కేవలం ఇంట్రడక్షన్ లా ఉన్న ఆ భాగమే అంత అద్బుతంగా తీసి జనాన్ని మెప్పించగలిగామని గర్వంగా ప్రకటించారు అనుకోవాలి. అసలు ఈ సినిమాకి పని చ్వ్హేసిన టెక్నీషియన్లు, చిత్రంలో న‌టించిన ప్ర‌తి ఒక్క‌రూ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.


గ్రాఫిక్స్ అమోఘం

గ్రాఫిక్స్ అమోఘం

ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి గురించి చెప్ప‌క్క‌ర్లేదు. త‌ను ఏ బాహుబ‌లిని అయితే క‌ల‌లు క‌న్నాడో అంత‌కంటే గొప్ప‌గా చూపించ‌గ‌ల‌గ‌డంలో సక్సెస్ అయ్యారు. భావోద్వేగాల‌ను స‌రిగ్గా క్యారీ చేయ‌డంలో విజ‌య‌వంతం అయ్యారు జ‌క్క‌న్న‌. ఇక చిత్రంలో గ్రాఫిక్స్ అమోఘం.


అంత‌ర్జాతీయ స్థాయి

అంత‌ర్జాతీయ స్థాయి

బాహుబ‌లి ఫ‌స్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్‌లో గ్రాఫిక్స్ ప‌రంగా వండ‌ర్స్ క్రియేట్ చేశార‌నే చెప్పాలి. అంత‌ర్జాతీయ స్థాయికి ఏమాత్రం తీసిపోకుండా అత్యంత జాగ్ర‌త్త‌ల‌తో సినిమాను తెర‌కెక్కించారు. 24 క్రాఫ్ట్స్‌ను ఒకే తెర‌పైకి తీసుకొచ్చి రాజ‌మౌలి ఈ చిత్రానికి బాహుబ‌లిగా మార్చి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా జనాన్ని మెప్పించగలిగాడు కూడా .



English summary
Peaople spent crores on a trailer Named Bahubali the Beginning Says Vijayendra prasad who is writer Of Bahubali
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu