»   » శంకర్, విక్రమ్ ల ‘ఐ’ ల షాకిచ్చే రికార్డ్

శంకర్, విక్రమ్ ల ‘ఐ’ ల షాకిచ్చే రికార్డ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : శంకర్‌ తాజా చిత్రంతో మరో సరికొత్త రికార్డు అందుకోనున్నాడు. తన సినిమాలకు ప్రేక్షకులు సహజంగా కోరుకునే అంశాలతో పాటు సందేశాన్ని కూడా జోడిస్తాడాయన. తొలి చిత్రం 'జెంటిల్‌మెన్‌' నుంచి రజనీకాంత్‌తో 'శివాజీ' వరకు ఇదే పంథాను కొనసాగించారు. ప్రస్తుతం విక్రమ్‌తో 'ఐ' రూపొందిస్తున్నాడు. గతంలో వారిద్దరి కలయికలో వచ్చిన 'అన్నియన్‌' జనాల్ని బాగా ఆకట్టుకున్న నేపథ్యంలో 'ఐ'పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.

విక్రమ్‌కు జంటగా ఎమీ జాక్సన్‌ నటిస్తుండగా, సంగీతం స్వర మాంత్రికుడు ఏఆర్‌ రెహమాన్‌ సమకూర్చుతున్నాడు. ఒలింపిక్‌ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం 75 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మిగతాది కూడా వీలైనంత త్వరగా ముగించి పొంగల్‌కు థియేటర్లలోకి తెచ్చే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా విడుదల విషయంలోనూ శంకర్‌ సరికొత్త రికార్డు అందుకోనున్నాడు. మొత్తం 17 భాషల్లో విడుదల చేయనున్నారు. 'ఎందిరన్‌'ను 9 భాషల్లో జనం మధ్యకు తెచ్చారు.

ఈ సినిమాలో విక్రమ్‌ కొన్ని ప్రయోగాలు చేశారు. పదిహేనేళ్ల బాలుడిగానూ, 85యేళ్ల వృద్ధుడిగానూ కొన్ని సన్నివేశాల్లో నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన తన దేహశైలిని కూడా మార్చుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఆయన ప్రత్యేకమైన కసరత్తులు చేశారు. ఈ చిత్రంలో విక్రమ్...తమిళనాడు స్టేట్ భాక్సింగ్ ఛాంపియన్ గా కనిపించనున్నాడని సమాచారం. .

ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్‌లో బంగారు పతకం ఎలా సాధించారనేది 'ఐ' చిత్ర కథ అని వినపడుతోంది. అందుకోసం ఆయన ఎనిమిది కేజీలు పైగా బరువు తగ్గారు. ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న ఐ చిత్రం ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో సాగుతుందనే సమాచారం. ఈ నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని శంకర్ ఐ చిత్రాన్ని ఓ రేంజిలో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్‌లో బంగారు పతకం ఎలా సాధించారనేది ఐ చిత్ర కథ అని వినపడుతోంది.

English summary

 Vikram's Ai, which is directed by Shankar is in news again. The flick was recently renamed as Ai by director Shankar, the latest buzz says that the movie will be released in 17 languages across the globe. Star director Shankar, who recently updated his blog about the movie said that the movie is getting delayed because it is taking lot of time for the physical changes, moulding, scanning and allied process in Vikram's body. He defended the delay by saying it's worth the wait.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X