Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బన్నీకి ఇంతకంటే మంచి హీరో దొరకడు.. పాన్ ఇండియా అంటే ఆ మాత్రం ఉండాలి మరి!
టాలీవుడ్ హీరోల నుంచి నెక్స్ట్ పాన్ ఇండియా ప్రాజెక్టులు మరిన్ని రాబోతున్నట్లు హెచ్చరికలు అందుతున్నాయి. బాలీవుడ్ ఆడియెన్స్ కూడా బిగ్ స్క్రీన్ పై మన హీరోలను చూడాలని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా అల్లు అర్జున్ కూడా విభిన్నమైన కథాంశంతో రెడీ అవుతున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాపై అంచనాలు రోజురోజుకు మరింత ఎక్కువవుతున్నాయి.

బన్నికోసం థియేటర్స్ వరకు వస్తారో లేదో..
అల్లు అర్జున్ కి నార్త్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్నట్లు ఆయన డబ్బింగ్ సినిమాలకు వచ్చే రెస్పాన్స్ ని చూస్తే ఈజీగా అర్ధమవుతోంది. అయితే యూ ట్యూబ్ లో చూసే జనాలు థియేటర్స్ వరకు వస్తారో లేదో చూడాలి మరి. ఇక బన్నీ కూడా పుష్పతోనే బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు.

ఆ స్పెషల్ పాత్ర కోసం..
సినిమా మేకింగ్ విషయంలో దర్శకుడు సుకుమార్ ఏ మాత్రం తగ్గడం లేదు. అలాగే నిర్మాతలు కూడా స్టైలిష్ స్టార్ కోసం ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం మంచి స్టార్ కావాలని గత కొంత కాలంగా చర్చలు జరుపుతూనే ఉన్నారు. మొదట విజయ్ సేతుపతిని అనుకోగా అతను బిజీగా ఉండడం వలన డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడు.

అవన్నీ అబద్దాలని తేలిపోయింది
ఇక ఆ పాత్రలో నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయని టాక్ వస్తోంది. అది నెగిటివ్ రోల్ అని కూడా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. అవి ఎంతవరకు నిజమో తెలియదు గాని సినిమాలో హీరో రేంజ్ పెరగాలి అంటే ఆ పాత్ర చాలా కీలకమనేది మాత్రం నిజం. అందుకే దర్శకుడు దీర్ఘంగా ఆలోచిస్తున్నాడట. ఇక ఆ మధ్య మాధవన్, నారా రోహిత్ అలాగే మరో యువ హీరో నటించే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి గాని అవన్నీ అబద్దాలని తేలిపోయింది.

విక్రమ్ అయితే బెస్ట్
ఇక ఫైనల్ గా దర్శకుడు బన్నీ సలహా మేరకు విక్రమ్ అయితే బావుంటుందని ఆలోచిస్తున్నారట. అయితే నటన కోసం ప్రాణం పెట్టె చియాన్ విక్రమ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. దర్శకుడు తలచుకుంటే అతన్ని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. విక్రమ్ ఎందుకో ఈ మధ్య సరైన సక్సెస్ అందుకోవడం లేదు. ఇక పుష్ప సినిమా కోసం అతనైతే బావుంటుందని అందరూ చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. మరీ విక్రమ్ బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకుంటాడో లేదో చూడాలి.