రూ. 300 కోట్లతో మరో భారీ సినిమా రాబోతోంది, హీరో ఎవరో తెలుసా?

By Bojja Kumar

Recommended Video

బాహుబలి ని తరహా మరో భారీ సినిమా.. హీరో ఎవరో తెలుసా?

'బాహుబలి' ప్రాజెక్టు వచ్చే వరకు ఇండియాలో అంత భారీ స్థాయిలో తెరకెక్కిన సినిమా లేదు. అసలు ఆ సినిమా వచ్చే వరకు ఇండియన్ సినిమా చరిత్రలో రూ. 1000 కోట్లు వసూలు చేసిన దమ్మున్న చిత్ర రాజమే లేదు. బాహుబలి-2 విడుదలైన తర్వాతే మన సినిమా రూ. 2000 కోట్లు వసూలు చేయగలదు అనే నమ్మకం అందరిలోనూ ఏర్పడింది. విదేశీ చిత్ర నిర్మాణ సంస్థలు కూడా ఇండియన్ సినిమా మార్కెట్ మీద దృష్టి సారించేలా చేశాయి.

రూ. 300 కోట్లతో మరో సినిమా రాబోతోంది

రూ. 300 కోట్లతో మరో సినిమా రాబోతోంది

ఇండియన్ సినీ పరిశ్రమలో మరో భారీ చిత్రం రాబోతోంది. బడ్జెట్ రూ. 300 కోట్లతో ఎపిక్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్క నుంది. మహాభారతంలోని కర్ణుడి పాత్ర ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘మహావీర్ కర్ణ' పేరుతో ఈ చిత్రం రూపొందనుంది.

హీరో ఎవరో తెలుసా?

హీరో ఎవరో తెలుసా?

సౌత్ స్టార్ విక్రమ్ ఈ చిత్రంలో కర్ణుడి పాత్రలో నటించబోతున్నారు. ఈ చిత్రం హిందీలో తెరకెక్కుతోంది. అయితే హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం ఇతర ఇండియన్ భాషల్లో కూడా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

దర్శకుడు ఎవరు?

దర్శకుడు ఎవరు?

మలయాళ దర్శకుడు ఆర్.ఎస్.విమల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఇటీవలే ఈ దర్శకుడు విక్రమ్ ను కలిసి సినిమా గురించి వివరించారు. విక్రమ్ ఈ పాత్ర చేయడానికి వెంటనే ఓకే చెప్పారు.

అఫీషియల్‌గా ఖరారు చేసిన విక్రమ్

అఫీషియల్‌గా ఖరారు చేసిన విక్రమ్

‘మహావీర్ కర్ణ' చిత్రంలో తాను నటించబోతున్నట్లు విక్రమ్ సోషల్ మీడియా ద్వారా ఖరారు చేశారు. ఇలాంటి చిత్రం చేయబోతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సినిమా కోసం విక్రమ్ తన శరీరాకృతిని పాత్రకు తగిన విధంగా మార్చుకోబోతున్నారు.

న్యూయార్క్ బేస్డ్ ఫిల్మ్ ప్రొడక్షన్

న్యూయార్క్ బేస్డ్ ఫిల్మ్ ప్రొడక్షన్


అమెరికాలోని న్యూయార్క్ బేస్డ్ ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థ ‘యూనైటెడ్ ఫిల్మ్ కింగ్‌డమ్' ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. రూ. 300 కోట్లలో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

షూటింగ్ ఎప్పటి నుండి?

షూటింగ్ ఎప్పటి నుండి?

ఈ చిత్ర షూటింగ్ అక్టబోర్ 2018 నుండి మొదలు కాబాతోంది. డిసెంబర్ 2019లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

త్వరలో పూర్తి వివరాలు

త్వరలో పూర్తి వివరాలు

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి నటీనటుల ఎంపిక జరుగుతోంది. సినిమా షూటింగ్ మొదలయ్యే నాటికి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. విక్రమ్ కోరీర్లోనే ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్ మూవీ.

బాహుబలి తర్వాత వరుస భారీ చిత్రాలు

బాహుబలి తర్వాత వరుస భారీ చిత్రాలు

బాహుబలి తర్వాత ఇండియాలో వరుస భారీ బడ్జెట్ చిత్రాలు వస్తున్నాయి. ఇప్పటికే రజనీకాంత్ హీరోగా రూ. 450 కోట్లోతో 2.0 చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు మోహన్ లాల్ చిత్రం రూ. 1000 కోట్లతో తెరకెక్కబోతోంది. ఇపుడు రూ. 300 కోట్లతో విక్రమ్ మూవీ కూడా ఖరారైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X