twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బోయపాటి చేసిన మిస్టేక్స్ ఇవే: సీనియర్ రైటర్ విశ్లేషణ హాట్ టాపిక్

    |

    సినిమాను మేము ఇంత కష్టపడి తీశాం.. అంత కష్టపడి తీశాం అని దర్శకులు, హీరోలు మూవీ ఫంక్షన్లలో చెబుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. మరింత కష్టపడి తీసిన సినిమాలు కొన్ని సందర్భాల్లో బాక్సాఫీసు వద్ద ఎందుకు ప్లాప్ అవుతాయి? అంటే... కారణం ఒకటే. ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా తీయక పోవడమే.

    రామ్ చరణ్-బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన 'వినయ విధేయ రామ' బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైంది. సినిమా ప్లాపును ఒప్పుకుంటూ రామ్ చరణ్ బహిరంగ లేఖ కూడా సంధించడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సినిమాలోని లోపాలను ఎత్తి చూపుతూ విశ్లేషించడంతో మరోసారి దీని గురించి చర్చ మొదలైంది.

    చాలా కొత్త విషయాలు చెప్పిన పరుచూరి...

    చాలా కొత్త విషయాలు చెప్పిన పరుచూరి...

    ‘వినయ విధేయ రామ' చిత్రాన్ని విశ్లేషించే క్రమంలో సాధారణ ప్రేక్షకులు తెలియని చాలా కొత్త విషయాలు, ఆసక్తికరమైన విషయాల వెల్లడించిన పరుచూరి... బోయపాటి శ్రీను లాంటి సక్సెస్‌లో ఉన్న రైటర్, డైరెక్టర్ సినిమాలో మార్పులు చెప్పడం అంత తేలిక కాదంటూనే సినిమాలో ఆయన చేసిన తప్పులను ఎత్తి చూపే ప్రయత్నంచేశారు.

    కథ అలా రాస్తే బావుండేదా?

    కథ అలా రాస్తే బావుండేదా?

    అన్నయ్య చనిపోయాడనే సంగతి ప్రీ క్లైమాక్స్ దాకా ఎవరికీ తెలియదు. నా అభిప్రాయం ప్రకారం అన్నయ్య చనిపోయిన సంగతి వదినకు తప్ప అందరికీ చెప్పి... వదినకు ఈ విషయం ఎప్పుడు తెలుస్తుందనే ఇంట్రస్ట్ కొనసాగించి ఒక పక్క దు:ఖం, మరోపక్క ఉత్కంఠ రెండు నడుస్తూ ఉంటే బావుండేది. ఇలా చేస్తే సినిమా ఆడుతుందని నేను చెప్పడం లేదు. ఈ కథను ఇలా కూడా రాసుకోవచ్చని మాత్రమే చెబుతున్నాను... అని పరుచూరి తెలిపారు.

    టోపోగ్రఫీ మిస్సయింది

    టోపోగ్రఫీ మిస్సయింది

    టోపోగ్రఫీ కూడా సినిమాలో మిస్సయింది. ఏ సంఘటన ఎక్కడ జరుగుతుంది? అనేది ప్రేక్షకులకు తెలియకుండా పోయింది. నక్సల్ స్వాడ్ రామ్ ఇంటి మీదకు వచ్చి వీరిని తీసుకెళ్లిన లొకేషన్ ఎక్కడ అనేది ఎవరికీ అర్థం కాలేదు. ఒక వేళ అది ఆంధ్రప్రదేశ్ అయితే అక్కడికి బీహార్ చీఫ్ మినిస్టర్ వచ్చి ఆయన భద్రతా సిబ్బంది గన్స్ పెట్టడానికి వీలుండదు. ముఖేష్ రిషి తదితరుల తోపో గ్రఫీ కూడా కరెక్టుగా లేదు. ఎవరి మూలంగా కథ ప్రారంభం అయిందో వారి మీద నిర్ణయం జరుగలేదు. వారు ఏమైపోయారో తెలియదు, వారికి పనిష్మెంట్ జరిగినట్లు చూపించలేదు. హీరో కుటుంబం అంతా ఇలా కావడానికి కారణం అయిన ఆ వ్యక్తులు అలాగే ఉండి పోయారని... పరుచూరి గుర్తు చేశారు.

    నేటివిటీ మిస్సయింది

    నేటివిటీ మిస్సయింది

    కథ బీహార్ వెళ్లడం వల్ల నేటివిటీ మిస్సయింది. ఏపీ తెలంగాణలో ఎక్కడో అక్కడి నుంచి సహాయం తీసుకుంటే సరిపోయేది. ఏ విషయం కథలో దాచారో ఆ కథ సెకండాఫ్‌లో చెప్పే సమయానికి 30 నిమిషాల ఎపిసోడ్ ఉంది. అందులో అతడి(వివేక్ ఒబెరాయ్)ని నరికాడు వెళ్లిపోయాడు... కానీ అతడు బ్రతికి ఉన్నాడు. ప్రీ క్లైమాక్స్ ముందు ఎవరినైతే కొట్టాడో.. మళ్లీ అతడినే క్లైమాక్స్‌లో కొట్టాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది. ఇలా కాకుండా ముఖేష్ రిషి వాడు పోతే ఏంటి మేము ఉన్నామని వస్తే కొత్త విలన్స్‌ను కొట్టిన ఫీలింగ్ ఉండేది... అని పరుచూరి అభిప్రాయపడ్డారు.

    థియేటర్లో డిస్ట్రబెన్స్ కారణం ఆ సీన్లు

    థియేటర్లో డిస్ట్రబెన్స్ కారణం ఆ సీన్లు

    నేను చూసిన అమేజాన్ ప్రైవ్ వీడియోలో రామ్ చరణ్ డైరెక్టుగా గుర్రం మీద వచ్చారు. సినిమా ట్రిమ్ చేయక ముందు ట్రైన్, ఫ్లైట్ షాట్లు ఉన్నాయని చెప్పారు కానీ ఇందులో లేవు. తలలు నరికితే గద్దలు తీసుకెల్లడం కూడా థియేటర్లో కాస్త డిస్ట్రబెన్స్ అనిపించింది. పాముతో విలన్ కరిపించుకునే సీన్ కూడా అంత భయం కల్పించే విధంగా లేదు. ఆ టోపోగ్రఫీ కూడా ఎక్కడిదో అర్థం కాలేదని తెలిపారు.

    మనం ఎంత కష్టపడ్డా.. వారికి నచ్చడం ముఖ్యం

    మనం ఎంత కష్టపడ్డా.. వారికి నచ్చడం ముఖ్యం

    ఇలా కొన్ని మార్పులు చేసుకుని... గ్యాంగ్ లీడర్లో మాదిరి అన్న, వదిన, చిన్నన్న, ఆ వదిన, వీరి మధ్య జరిగిన హ్యూమన్ డ్రామా... హీరో ఎంత త్యాగం చేస్తున్నాడు అనేది చూపిస్తే వినయ విధేయ రామ అతుక్కునేది. కానీ అతడు ఓపెనింగ్ నుంచి భయంకరమైన విస్పోటనంతో ఉంది. ఈ సినిమాలో రామ్ చరణ్, బోయపాటి శ్రీను చాలా కష్టపడ్డారు. మనం ఎంత కష్టపడినా ప్రేక్షకులకు నచ్చే విధంగా కథనం లేకపోతే ఒక్కోసారి మనం కోరుకున్న విజయాన్ని పొందలేమని పరుచూరి తెలిపారు.

    English summary
    Paruchuri Gopala Krishna About Ram Charan's Vinaya Vidheya Rama Movie 11th Hour. In Today's Paruchuri Paataalu, Lesson 60, Paruchuri Gopala Krishna Talks About Vinaya Vidheya Rama 11th Hour, In Which He Says That Suspense and Sentiment Will not Work for a Movie. He Also Explains about Some Small Changes in The Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X