Don't Miss!
- News
అమరావతి కేసు విచారణ-సుప్రీం నిర్ణయంపై ఉత్కంఠ ? ఫాస్ట్ ట్రాక్ విజ్ఞప్తి, ఫిర్యాదుల నేపథ్యం !
- Finance
బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గుతున్న బంగారం ధరలు; నేడు హైదరాబాద్, ప్రధాన నగరాల్లో ధరలిలా!!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Sports
SA20 : దంచికొట్టిన సన్‌రైజర్స్ బ్యాటర్.. చిత్తుగా ఓడిన క్యాపిటల్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
బోయపాటి, దానయ్య మాటల యుద్ధం.. వినయ విధేయ వివాదం కొత్త మలుపు.. దిల్ రాజు రంగంలోకి
సంక్రాంతి రేసులో భాగంగా దర్శకుడు బోయపాటి, మెగా పవర్‌స్టార్ రాంచరణ్ కాంబినేషన్‌లో వచ్చిన వినయ విధేయ రామ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటం ప్రస్తుతం టాలీవుడ్‌లో చిచ్చు రేపుతున్నది. నష్టపోయిన డిస్టిబ్యూటర్లకు చెల్లించే మొత్తం విషయం నిర్మాత డీవీవీ దానయ్య, దర్శకుడు బోయపాటి శ్రీను మధ్య గొడవకు దారి తీసినట్టు ఓ వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్నది. ఇటీవల తన సినిమా ఫ్లాప్ అయిందని రాంచరణ్ అధికారికంగా వెల్లడించిన తర్వాత ఈ వివాదం మరింత రాజుకొన్నది. వివరాల్లోకి వెళితే..

ఓవరాల్‌గా నష్టం ఎంత మేరకంటే
వినయ విధేయ రామ మెగా అభిమానులే కాదు.. సాధారణ ప్రేక్షకులను కూడా తీవ్రంగా షాక్‌కు గురిచేసింది. తొలి ఆట నుంచి ఫ్లాప్ టాక్ వచ్చినా ఈ చిత్రం రూ.100 గ్రాస్ (రూ.65 కోట్ల నికర) వసూళ్లను సాధించింది. అయితే ఈ చిత్రం ఓవరాల్‌గా రూ.30 కోట్ల నష్టాన్ని డిస్టిబ్యూటర్లకు మిగిల్చింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్, హీరో, నిర్మాత తలా రూ.5 కోట్లు తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకొన్నారు.

దానయ్యకు బోయపాటి ఝలక్
అయితే ఈ ఒప్పందంలో దర్శకుడు బోయపాటి మెలికపెట్టడం వివాదంగా మారిందనేది తాజా సమాచారం. నిర్మాత దానయ్య, హీరో రాంచరణ్ తలా రూ.5 కోట్లు తిరిగి వచ్చేశారని, దర్శకుడిని నుంచి రావాల్సిన రూ.5 కోట్ల గురించి వాకబు చేయగా తాను తిరిగి ఇచ్చేది లేదని స్పష్టం చేయడంతో వారి మధ్య గొడవ జరిగినట్టు సమాచారం.

డీవీవీ దానయ్యపై బోయపాటి ఆరోపణలు
దర్శకుడు బోయపాటి తాను ఇవ్వాల్సిన మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి నిరాకరించడంతోపాటు నిర్మాత దానయ్యపై బిజినెస్‌కు సంబంధించిన కొన్ని ఆరోపణలు చేశారనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. అత్యధిక రేటుకు సినిమా హక్కులను అమ్ముకోవడమే నష్టాలకు కారణం అని దానయ్యపై మండిపడినట్టు కథనాలు వెలువడుతున్నాయి.

నెవ్వెంత అంటే.. దానయ్య, బోయపాటి వాగ్వాదం
దర్శకుడు బోయపాటి, నిర్మాత దానయ్య మధ్య మాటల యుద్ధం భారీగానే జరిగినట్టు లోకల్ మీడియాలోనే కాకుండా జాతీయ మీడియాలో కూడా వార్తలు వెలువడుతున్నాయి. వారిద్దరి మధ్య వాడివేడిగా వాగ్వాదం చోటుచేసుకున్నదని, వారి మధ్య సయోధ్యను కుదర్చడానికి సినీ పెద్దలు రంగంలోకి దిగినట్టు తెలిసింది.
రామ్ చరణ్ ‘ప్లాప్' స్టేట్మెంటును... బోయపాటి జీర్ణించుకోలేక పోతున్నారా?

రంగంలోకి దిల్ రాజు, ప్రసాద్
ప్రస్తుతం డీవీవీ దానయ్య, బోయపాటి శ్రీను మధ్య వివాదం భారీగానే ముదిరిందని, దాని తీవ్రతను తగ్గించడానికి నిర్మాతలు దిల్ రాజు, ఎన్‌వీ ప్రసాద్ రంగంలోకి దిగారు. త్వరలోనే వివాదానికి తెర దించేందుకు పెద్దలు చర్చలు జరుపుతున్నారు. బోయపాటి, దానయ్య మధ్య కొద్ది రోజుల్లోనే వివాదం కొలిక్కి రావొచ్చు అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఫ్లాప్ ఇబ్బందుల్లో రాంచరణ్
రంగస్థలం సినిమా తర్వాత భారీ అంచనాలతో వచ్చిన వినయ విధేయ రామ సినిమా ప్రేక్షకులను నిరాశపరచడం బాధగా ఉంది. మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకొంటాను అని రాంచరణ్ అధికారికంగా ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. వినయ విధేయ రామ సినిమా దారుణంగా పరాజయం చెందడం రాంచరణ్‌ను కలిచి వేసింది అని సినీ వర్గాలు చెప్పుకొంటున్నాయి.