»   » వినాయక్‌, సాయి ధరమ్ తేజ్ టైటిల్ కన్ఫర్మ్.. మళ్లీ అమ్మాయి పేరుతోనేనా?

వినాయక్‌, సాయి ధరమ్ తేజ్ టైటిల్ కన్ఫర్మ్.. మళ్లీ అమ్మాయి పేరుతోనేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్డా అయిన దర్శకుడు వీవీ వినాయక్‌ తదుపరి చిత్రంపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాడు. ప్రస్తుతం స్క్రిప్ట్‌పై తన బృందంతో కలిసి కసరత్తు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసిన వినాయక్ ప్రస్తుతం మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో సినిమా రూపొందించే పనిలో ఉన్నాడు. ఈ చిత్రానికి సీ కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. చాలా రోజుల క్రితమే ఈ సినిమాను ప్రకటించినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల పట్టాలెక్కలేదు. సీ కల్యాణ్ టేకప్ చేయడంతో ఈ సినిమా వేగం పుంజుకొన్నది. ఇటీవల ఈ చిత్రానికి ఓ టైటిల్ ఖరారు చేసినట్టు తెలిసింది.

Vinayak-Tej's New Film Title Confirmed!

దాదాపు స్కిప్టు వర్క్ పూర్తయినట్టు సమాచారం. ప్రస్తుతం నటీనటుల ఎంపికను చేపట్టినట్టు తెలుస్తున్నది. ఈ సినిమా టైటిల్‌ను తాత్కాలికంగా ఖరారు చేసినట్టు చిత్ర యూనిట్ పేర్కొన్నది. సాయి ధరమ్ తేజ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దుర్గ అనే టైటిల్‌ను ఖారారు చేశారట. వినాయక్‌కు రెగ్యులర్‌గా కథ అందించే ఆకుల శివ ఈ చిత్రానికి కూడా కథా రచయితగా పనిచేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం బీవీఎస్ రవి తెరకెక్కించే జవాన్ చిత్రంలో నటిస్తుననారు. జవాన్ రిలీజ్ కాగానే దుర్గ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.


English summary
Mass Movies specialist VV Vinayak is busy with the script work of his next film. He is all set to wield the megaphone for a movie starring Supreme hero Sai Dharam Tej. The update is that the makers tentatively titled the film as Durga.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu