Virata Parvam ఫస్ట్ రివ్యూ.. సాయిపల్లవి కెరీర్ బెస్ట్ అంటూ యువ హీరో ఎమోషనల్
నీది నాది ఒకే కథ చిత్రంతో దర్శకుడు వేణు ఊడుగుల డైరెక్షన్‌లో సాయిపల్లవి, రానా దగ్గుబాటి, ప్రియమణి, నందితా దాస్, జరీనా వాహెబ్ నటించిన విరాట పర్వం చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది. లాక్‌డౌన్ కారణంగా థియేటర్ల మూసివేత కారణంగా ఈ చిత్రం విడుదలలో జాప్యం జరిగింది. అయితే ఈ చిత్రం జూన్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ క్రమంలో హీరో నిఖిల్ సిద్దార్థ్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఆ ట్విట్ వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాల్లో సాయిపల్లవి, రానా
విరాట పర్వం చిత్ర ప్రమోషన్స్ తెలుగు రాష్ట్రాల్లో ఊపందుకొన్నాయి. ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో సాయిపల్లవి, రానా దగ్గుబాటి, చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటూ పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. భావోద్వేగమైన ప్రేమకథగా రూపొందిన విరాట పర్వం సినిమా గురించి ప్రేక్షకులకు తెలియజేస్తున్నారు.

సెలబ్రిటీలకు ప్రత్యేక షోలు
విరాటపర్వం రకరకాల ప్రమోషన్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే సెలబ్రిటీలకు ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. సినీ, మీడియా, ప్రేక్షక వర్గాలకు ఈ సినిమాను చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమోషనల్ ఈవెంట్లలో భాగంగా తెలుగు సినిమా పరిశ్రమలోని కొందరు నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఈ సినిమాను ప్రదర్శించారు.

హీరో నిఖిల్ సిద్దార్థ ట్వీట్
విరాట పర్వం సినిమా చూసిన యువ హీరో నిఖిల్ సిద్దార్థ ఎమోషనల్ అయ్యారు. విరాట పర్వం గురించి గొప్పగా చెబుతూ ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. విరాట పర్వం ఒక అద్భుతమైన ప్రేమకథ. ఈ సినిమా తర్వాత గొప్ప అనుభూతితోపాటు వావ్ అని మనసులో అనుకొన్నాను అంటూ నిఖిల్ సిద్దార్థ ట్వీట్ చేశారు.
సాయి పల్లవి, రానా పెర్ఫార్మెన్స్ గురించి
విరాట పర్వం సినిమాలో నటించిన సాయి పల్లవి ప్రతిభ గురించి మాట్లాడుతూ.. ఆమె కెరీర్‌లోనే బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. రానా దగ్గుబాటి తన ఫెర్ఫార్మెన్స్‌తో గొప్పగా ఆకట్టుకొన్నాడు. ఈ సినిమాను చూడాలనే కుతుహలాన్ని, ఆసక్తిని పెంచడంలో సక్సెస్ అయ్యారు. ఇంత గొప్ప సినిమాను అందించిన వేణు ఊడుగుల, నిర్మాత సుధాకర్ చెరుకూరికి హ్యాట్సాఫ్ అంటూ నిఖిల్ సిద్దార్థ్ తన ట్వీట్‌లో తెలిపారు.

సరళ అనే అమ్మాయి ప్రేమ కథగా
ఇక విరాటపర్వం సినిమా విషయానికి వస్తే.. తెలంగాణ ప్రాంతంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరెక్కించారు. వరంగల్ ప్రాంతంలో సరళ అనే అమ్మాయి జీవితంలో సంఘటనలు, ఆ ఘటన చుట్టూ రాజకీయ, నక్సల్ వర్గాలు మధ్య జరిగిన సంఘర్షణను విరాట పర్వంగా తెరకెక్కించారు.
Recommended Video


విరాట పర్వంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: సాయి పల్లవి, రానా దగ్గుబాటి, ప్రియమణి, నందితా దాస్, జరీనా వాహెబ్, ఈశ్వరీ రావు, సాయి చంద్, నవేదా పేతురాజ్ తదితరులు
రచన, దర్శకత్వం: వేణు ఊడుగుల
నిర్మాత: డీ సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి
సినిమాటోగ్రఫి: డానీ సాంచెజ్ లోపేజ్, దివాకర్ మణి
ఎడిటింగ్: ఏ శ్రీకర ప్రసాద్
మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
బ్యానర్: శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్
రిలీజ్ డేట్: 2022-06-17


Click it and Unblock the Notifications











