విశాల్ కొత్త చిత్రం ‘ధీరుడు’
విశాల్ మాట్లాడుతూ -''లవ్, యాక్షన్, కామెడీ మిళితమైన సినిమా ఇది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకుల్ని రంజింపజేసే సినిమా ఇది. తమన్ అద్భుతమైన స్వరాలందించారు. ఈ నెల 25న సోనీ కంపెనీ ద్వారా ఆడియోను విడుదల చేస్తున్నాం. జూలై మూడో వారంలో సినిమాను విడుదల చేస్తాం'' అని తెలిపారు.
అలాగే ...నేను సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించా. నాన్న, అన్న ఇద్దరూ నిర్మాతలే. నన్ను ప్రయోజకుణ్ని చేయాలన్నదే వారి తపన. అలా నటుడు అర్జున్ వద్ద సహాయ దర్శకుడిగా చేరా. ఆ తర్వాత అర్జున్ సూచనల మేరకు హీరోగా తెరంగేట్రం చేశా. తాజాగా 'సమర్' వరకు సినీజనాలను అలరించాననే అనుకుంటున్నా అన్నారు.
ఇవి నా రెండు అవతారాలైతే నిర్మాతగా మారడమే నా మూడో అవతారం. నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాలని నాన్న, అన్న కలసి నిర్మాతగా చేశారు. విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టర్(వీఎఫ్‌ఎఫ్) పేరిట కొత్త బ్యానరు రూపొందించా. నిర్మాతగా మారాక బాధ్యతలు మరింత పెరిగాయి. నా బ్యానరులో వస్తున్న తొలిచిత్రం 'ధీరుడు' అన్నారు.
మురళీశర్మ, రాజేంద్రన్, సంతానం, అజయ్, జగన్, సీత, మనోబాల తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: సాహితి, రామజోగయ్యశాస్త్రి, వనమాలి, ఛాయాగ్రహణం: వైది, ఎడిటింగ్: ఎ.ఎల్.రమేశ్, నిర్మాణసార«థ్యం: వడ్డి రామానుజం, నిర్మాత: విశాల్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భూపతి పాండ్యన్.


Click it and Unblock the Notifications












