»   »  హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట

హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట

Posted By:
Subscribe to Filmibeat Telugu

దక్షిణాది హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. నిర్మాతల మండలిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యాలు చేశారనే కేసులో ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ వ్యవహారంలో నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాలపై సస్సెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. మండలి విధించిన సస్సెన్షన్ ను సవాల్ చేస్తూ విశాల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

Vishal

తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబితే విశాల్ పై విధించిన వేటును ఉపసంహరించుకొంటామని విచారణ సందర్భంగా మండలి తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. అందుకు విశాల్ బేషరుతుగా క్షమాపణలు చెప్పారు.

కానీ ఆయనపై విధించిన సస్పెన్షన్ ను ఎతివేయలేదు. సభ్యుడిగా మళ్లీ కమిటీలో చేర్చుకోలేదు. దాంతో మళ్లీ విశాల్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గురువారం విశాల్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది.

శుక్రవారం లోగా విశాల్ పై విధించిన సస్పెన్షన్ రద్దు చేయాలని, ఆయనను మళ్లీ కమిటీలో చేర్చుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో విశాల్ విజయం సాధించారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

English summary
victory for Vishal in Suspension case, Madras High Court's ultimatum to Producers Council
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu