For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అతనిప్పుడు "జోసెఫ్ విజయ్", బీజేపీనేత పై వేటు: కొత్త రంగుల "మెర్సల్ వివాదం"

  |

  తమిళనాట 'మెర్సల్‌' చిత్ర వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. సినిమా విడుదల అయిన దగ్గరినుంచీ జీఎస్టీ గురించి మాట్లాడిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు దెబ్బతిన్న ఒక మతం వారి మనోభావాలూ అంటూ హీరో విజయ్ మతం విశయాన్ని లేవనెత్తి కొత్త రంగు పులిమారు. అంతే కాదు అతనికి సపోర్ట్ ఉన్నవాళ్ళని కూడా దెబ్బతీసే ప్రయత్నాలు మొదలయ్యాయి. మొదటి పంచ్ విశాల్ కీ, రెండోది దక్షిణ చెన్నై జిల్లా బీజేపీ సాంకేతిక విభాగం ఉపాధ్యక్షుడు సిద్ధార్ధ్‌ మణి పై...

  "మెర్సల్" కొత్త వివాదం.. సిగ్గు లేదా? అంటూ హీరో విశాల్ ఫైర్..

  మెర్సల్ కలెక్షన్ల సునామీ.. గోల్‌మాల్, సీక్రెట్ సూపర్‌స్టార్, కబాలి రికార్డులు మటాష్

   సినిమా రంగం మాత్రం విజయ్ పక్కనే

  సినిమా రంగం మాత్రం విజయ్ పక్కనే

  సినిమా రంగం మాత్రం విజయ్ పక్కనే నిలబడింది, పార్థిబన్, కమల్ హాసన్, విశాల్ లాంటి హీరోలూ, సీనియర్ నటులూ స్పష్టంగా తాము విజయ్ పక్కనే ఉన్నాం అని చెప్పేస్తే... రజినీ మాత్రం జస్ట్ ‘మీరు చేసింది కరెక్ట్‌. ముఖ్యమైన అంశాలనే చిత్రంలో ప్రస్తావించారు. మీకు అభినందనలు' అని "యూనిట్ కి అభినందనలు తెలిపి" తెలివిగా వ్యవహరించారు. అంటూ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘మెర్సల్‌' చిత్ర బృందాన్ని ప్రశంసించారు.

   దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా

  దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా

  మెర్సల్‌ చిత్రంలో జీఎస్టీ, డిజిటల్‌ ఇండియా పథకాలకు వ్యతిరేకంగా ఉన్న సంభాషణలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రజనీ ట్వీట్‌ చర్చనీయాంశమైంది. అన్నాడీఎంకే అసమ్మతి నేత దినకరన్‌ కూడా ఈ చిత్రానికి మద్దతు తెలిపారు. ఇదిలా ఉండగా, ‘మెర్సల్‌' చిత్రంలో పలు సంభాషణలు దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని మదురైకి చెందిన న్యాయవాది ముత్తుకుమార్‌ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  విజయ్‌ అసలు పేరు జోసఫ్‌ విజయ్‌

  విజయ్‌ అసలు పేరు జోసఫ్‌ విజయ్‌

  మరోవైపు ఈ విశయం లో సీరియస్ గా నిలబడ్డ వాళ్ళకి ఇబ్బందులు మొదలయ్యాయి. విజయ్‌ అసలు పేరు జోసఫ్‌ విజయ్‌ అన్న అంశాన్ని పలువురు బీజేపీ కార్యకర్తలు హైలెట్‌ చేస్తూ సామా జిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తుండటంతో ఈ వివాదం మతం రంగు పులుముకుంది. మెర్సల్‌ వివాదంలో బీజేపీ నే త ఒకరు విజయ్‌కి మద్దతుగా నిలిచారు.

   బీజేపీ సాంకేతిక విభాగం ఉపాధ్యక్షుడు

  బీజేపీ సాంకేతిక విభాగం ఉపాధ్యక్షుడు

  స్వతహా గా విజయ్‌కి అభిమాని అయిన దక్షిణ చెన్నై జిల్లా బీజేపీ సాంకేతిక విభాగం ఉపాధ్యక్షుడు సిద్ధార్ధ్‌ మణిని పార్టీ అధిష్ఠానం తాత్కాలికం గా పార్టీ నుంచి తొలగించింది. సినిమాకన్నా ఒక నటుడికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం, దేశాన్ని కించపరిచే వారికి మద్దతునివ్వటం వంటి కారణాలు ఆయన మీద మోపబడ్డాయి..

  జీఎస్టీ విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు

  జీఎస్టీ విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు

  ‘మెర్సల్‌' చిత్ర బృందానికి మద్దతుగా నిలిచిన నటుడు విశాల్‌ కార్యాలయంలో సోమవారం జీఎస్టీ విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. చెన్నై వడపళనిలోని విశాల్‌కు చెందిన సినీ నిర్మాణ సంస్థ విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం వరకు నలుగురు అధికారులు తనిఖీలు నిర్వహించారు.

   విశాల్‌ ఘాటుగానే స్పందించాడు

  విశాల్‌ ఘాటుగానే స్పందించాడు

  మెర్సల్‌ వివాదంలో నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శిగా, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న విశాల్‌ ఘాటుగానే స్పందించారు. సినిమాలో జీఎస్టీకి వ్యతిరేకంగా ఉన్న సంభాషణలు తొలగించేందుకు చిత్ర నిర్మాత సమ్మతించినప్పటికీ.. ఆ అవసరం లేదని విశాల్‌ వాదించారు.

   51లక్షలను ప్రభుత్వ ఖాతాలో జమ చేయనందుకుగాను

  51లక్షలను ప్రభుత్వ ఖాతాలో జమ చేయనందుకుగాను

  ఈ నేపథ్యంలో విశాల్‌ కార్యాలయంలో జీఎస్టీ అధికారులు తనిఖీ చేయడం సంచలనంగా మారింది. చెన్నైలోని జీఎస్టీ విభాగం అధికారులు మాత్రం విశాల్‌ కార్యాలయంలో ఎటువంటి తనిఖీలు చేయలేదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, విశాల్‌ నిర్మాణ సంస్థ విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ.. టీడీఎ్‌సగా చెల్లించాల్సిన రూ.51లక్షలను ప్రభుత్వ ఖాతాలో జమ చేయనందుకుగాను ఐటీ టీడీఎస్‌ విభాగం ఈ నోటీసులు జారీ చేసింది.

  English summary
  Days after a controversy broke out over references to GST in the Tamil film 'Mersal', a GST intelligence team raided the house of movie star Vishal, according to several media reports.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X