»   »  అక్కడ హిట్: విశాల్ ‘కథకళి’ రిలీజ్ డేట్ ఖరారు

అక్కడ హిట్: విశాల్ ‘కథకళి’ రిలీజ్ డేట్ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: విశాల్‌, కేథరిన్‌ త్రేసా జంటగా పాండిరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళచిత్రం 'కథాకళి' . ఈ చిత్రాన్ని సంక్రాంతికే రిలీజ్ ప్లాన్ చేసారు. తమిళంలో ఆల్రెడీ రిలీజైనా తెలుగులో మాత్రం థియేటర్ల సమస్యతో వాయిదా వేసారు. తాజాగా ఈ చిత్రాన్ని జనవరి 22న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమిళంలో ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో తెలుగులోనూ మంచి ఫలితాలు సాధిస్తుందని నమ్మకంగా ఉన్నారు నిర్మాతలు.

నటుడు విశాల్ సొంత చిత్ర నిర్మాణం నెలకొల్పి పాండియనాడు, నాన్ శివప్పు మనిదన్, పూజై అంటూ వరుస చిత్రాలను నిర్మిస్తూ విజయాలను అందుకుంటున్నారు యువ దర్శకుడు పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం కూడా తమిళంలో ఆల్రెడీ మంచి విజయం సాధించింది.

సినిమా గురించి విశాల్ మాట్లాడుతూ... నా కెరీర్లో మరో డిపరెంట్ కమర్షియల్ మూవీ ‘కథాకళి'. డైరెక్టర్ పాండిరాజ్ ఈ కథను చాలా అద్భుతంగా డీల్ చేసారు. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టెనర్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగులో నాకు మళ్లీ మరో హిట్ అవుతుంది' అన్నారు.

Vishal's Kathakali releasing on Jan 22nd

విశాల్ సరసన కేథరిన్, రెజీనా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో నాజర్, కరుణాస్, శత్రు, సూరి, శ్రీజిత్ రవి, పవన్, మైమ్ గోపీ, మధుసూదన్ రావు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: బాలసుబ్రహ్మణ్యం, సంగీతం: హిప్ హాప్ తమిళ, ఎడిటింగ్: ప్రదీప్, మాటలు: శశాంక్ వెన్నెల కంటి, ఫైట్స్: అనల్ అరసు, పాటులు: వెన్నెలకంటి, భువనచంద్ర, నిర్మాత: విశాల్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పాండ్యరాజ్.

English summary
Vishal's Kathakali got a blockbuster talk in Kollywood, makers are trying to release the Telugu version on January 22nd itself.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu