»   » విశాల్ ‘పల్నాడు’ స్టోరీ లైన్, హైలెట్స్

విశాల్ ‘పల్నాడు’ స్టోరీ లైన్, హైలెట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పందెం కోడి, భరణి, వాడు వీడు, వెంటాడు వేటాడు వంటి వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విశాల్‌ తొలిసారి విశాల్‌ ఫిలింఫ్యాక్టరీని స్థాపించి స్వయంగా నిర్మించిన ద్విభాషా చిత్రం 'పల్నాడు'. 'నా పేరు శివ' ఫేం సుశీంద్రన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 'గజరాజు' ఫేం లక్ష్మీమీనన్‌ హీరోయిన్.

విశాల్‌ అంటే పదిమందిని ఒక్కడే తంతాడు. ఇదీ జనాల్లో ఉన్న ఇమేజ్‌. దానికి దూరంగా చేసిన తొలి ప్రయత్నమిది. దాదాపు పదేళ్ల తర్వాత నా ఇమేజ్‌కి పూర్తి ఆపోజిట్‌ పాత్రలో కనిపిస్తున్నా. కొట్టాలంటే భయపడే కుర్రాడిగా ఈసారి కనిపిస్తున్నా. నా కెరీర్‌లో మర్చిపోలేని పాత్ర ఇది అన్నారు విశాల్‌.

'పల్నాడు' కథ విన్నాక నాకు నిద్రపట్టలేదు. ఇలాంటి మంచి సినిమాని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోకూడదనుకొని రంగంలోకి దిగా. కథానాయకుడిగా నటిస్తూనే నిర్మాణ బాధ్యతలు భుజాన వేసుకొన్నా అన్నారు విశాల్. ఈ చిత్రం నవంబర్‌ 2న రిలీజ్‌ అవుతోంది. పాండ్యనాడు తమిళ టైటిల్‌. పల్నాడు తెలుగు టైటిల్‌. రెండు వెర్షన్ల (దాదాపు 850థియేటర్లలో)ను ఒకేసారి దీపావళి కానుకగా నవంబర్‌ 2న రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా విశాల్ మీడియాతో మాట్లాడారు.

ఈ సినిమా హైలెట్స్ స్లైడ్ షో లో...

భయస్తుడిగా...

భయస్తుడిగా...

ఏదైనా సినిమాలో నటించేటప్పుడు 'ఇలాంటి సన్నివేశం ఇదివరకే చేశానే' అని అప్పుడప్పుడు మనసుకు అనిపిస్తుంటుంది. అందుకు భిన్నంగా ప్రతీ సన్నివేశం ఓ సరికొత్త అనుభూతికి గురిచేసిన చిత్రం 'పల్నాడు'. సెట్‌లో రోజూ కొత్తగానే అనిపించేది. విశాల్‌ అంటే తెరపై నలుగురిని కొడతాడు, పదిమందినైనా అవలీలగా ఓడిస్తాడు అని ప్రేక్షకులు వూహిస్తుంటారు. ఇప్పటిదాకా తెరపైన నా పాత్రలు అలాగే సాగాయి. వాటన్నిటికీ భిన్నంగా ఇందులో ఓ భయస్తుడిగా కనిపిస్తాను. చాలామంది ఇలాంటి పాత్ర విశాల్‌కి నప్పుతుందా? అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. నేను దాన్నొక సవాల్‌గా స్వీకరించి ఈ సినిమాలో నటించాను.

డైరక్టర్ కి నత్తి ఉంది..

డైరక్టర్ కి నత్తి ఉంది..

నా పాత్ర పేరు శివకుమార్‌. నత్తితో మాట్లాడుతూ వినోదాన్ని పంచుతా. హీరో మాట్లాడేప్పుడు ఒకటి మాట్లాడాలనుకుని ఇంకొకటి మాట్లాడేస్తుంటాడు. దాన్నుంచి కామెడీ పుడుతుంది. ప్రథమార్థం అంతా ఫన్నీగా లవ్‌లీగా ఉంటుంది. లక్ష్మీమీనన్‌తో లవ్‌ సీన్స్‌ ఆకట్టుకుంటాయి. దర్శకుడు సుశీంద్రన్‌కి కూడా కాస్త నత్తి ఉంది. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ సన్నివేశాల్లో నటించా.

స్టోరీ లైన్

స్టోరీ లైన్

కర్ర పట్టడం, ఆయుధం పట్టడం అవసరమా? వద్దు అనుకునే కుర్రాడిని కెలుకుతారు. ఆ తర్వాత అమాయకుడి కథ ఎలా మారిపోయిందనేది ఆసక్తికరం. ఇది మధ్యతరగతి రివెంజ్‌ స్టోరీ. రియలిస్టిక్‌గా ఉంటుంది. గుంటూరులోని పల్నాడు నేపథ్యంలో సాగుతుంది. ఓ సెల్‌ఫోన్‌ షాప్‌ నడుపుకునే భయస్తుడైన కుర్రాడు .. అనుకోని రీతిలో కర్ర, కత్తి పట్టాల్సి వస్తే ఎలా ఉంటుందనేది చూపించాం. భయపడేవాడు పోరాడితే ఎలా ఉంటుందో ఆసక్తికరంగా మలిచారు దర్శకుడు. ఫైట్స్‌ వైవిధ్యంగా ఉంటాయి. ముఖ్యంగా పతాకసన్నివేశం 20నిమిషాలు హైలైట్‌గా ఉంటుంది

భారతీ రాజా

భారతీ రాజా

ఈ చిత్రంలో భారతీరాజా తండ్రి పాత్రలో కనిపిస్తారు. హీరో పాత్రకి సమానమైన పాత్ర అది. పందెంకోడిలో నాన్నలా కీలకపాత్ర అది. సినిమాలో అది హైలెట్ అని చూసాక మీరే ఒప్పుకుంటారు. రియలిజం అనేది సుశీంద్రన్‌ ఫార్ములా. నా పేరు శివ.. చూశాక మీకే అర్థమై ఉంటుంది. అదే పంథాలో ఈ సినిమాని కూడా ఆద్యంతం సహజసిద్ధంగా మలిచారు.

శశాంక్ కారణం...

శశాంక్ కారణం...


"ఈ సినిమాకు పల్నాడు అని పేరు పెట్టడానికి కారణం మాటల రచయిత శశాంక్. గుంటూరు పల్నాడు బ్యాక్‌డ్రాప్‌లో అయితే సినిమా బాగా పండుతుందని ఈ పేరు పెట్టారు. పాటలకు మంచి స్పందన వస్తోంది. తెలుగువెర్షన్‌లో ‘పల్నాడు' నేపథ్యం పెడితే బావుంటుందని మాటల రచయిత శశాంక్‌ అన్నారు. అదే చేశాం. శశాంక్‌ నా తొలిసినిమా నుంచి నా వెన్నంటి ఉన్నారు. అద్భుతమైన సంభాషణలు రాశారు.

ఆ పాత్ర చూసే...ఈ సినిమా

ఆ పాత్ర చూసే...ఈ సినిమాబాలా దర్శకత్వంలో ‘వాడు-వీడు' చేయడం వల్లే నాకు ఈ అవకాశం వచ్చింది. ఆ సినిమాలో మెల్లకన్ను తిప్పేవాడిగా నా నటన నచ్చడం వల్లే సుశీంద్రన్‌ ఈ అవకాశం ఇచ్చారు. ఆ సినిమా లేకపోతే ఇది లేనేలేదు. ఈ పాత్రను నేను చేస్తున్నానని తెలియగానే చాలా మంది ఈ పాత్ర విశాల్‌కు సూట్ అవుతుందా? అని అన్నారు. ఆ మాటలను చాలెంజింగ్‌గా తీసుకుని ఈ సినిమా చేశాను.

నమ్మకం లేదు...

నమ్మకం లేదు...

"నలుగురు కూర్చుని నిర్ణయించే అవార్డులపై నాకు పెద్ద నమ్మకం లేదు. ప్రజలందరూ సినిమా బావుందని చప్పట్లు కొట్టి, ఈలలు వేస్తూ థియేటర్లలో సినిమాలు చూడటమే నా దృష్టిలో గొప్ప అవార్డుల కింద లెక్క. తెలుగు తమిళ్ కలిపి మొత్తం 900 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ''

కోపం-ఆశ

కోపం-ఆశ

''ఇప్పటిదాకా నిర్మాతలుగా... నాన్న, అన్నయ్యల పేర్లు తెరపై చూసుకొన్నా. తొలిసారి ఆ స్థానంలో నా పేరు చూసుకోవడం తియ్యటి అనుభూతిని పంచింది. ఎప్పుడో ఒకసారి దర్శకుడిగా కూడా తెరపై నా పేరు చూసుకోవాలని ఉంది. నిజానికి నేను మొదట దర్శకుడిని అవుదామనుకొన్నా, ఆ తర్వాతే నిర్మాత కావాలనుకొన్నా. అందుకు భిన్నంగా హీరో అయ్యాను. ఇప్పుడు నిర్మాతగా మారడానికి ప్రధాన కారణం నాలో ఉన్న కోపం, ఆశ. కష్టపడి చేసిన సినిమా విడుదల కాకపోతే ఎవ్వరికైనా ఎంత ఇబ్బందిగా ఉంటుంది. హీరోగా నావైపు నుంచి ఏ సమస్య లేకపోయినా... ఒక సినిమా విడుదల విషయంలో ఇబ్బందులెదురయ్యాయి. అందుకే ఈసారి నేనే నిర్మాతగా మారాల్సివచ్చింది.

తెలుగులో సినిమా...

తెలుగులో సినిమా...

''ఏ రంగంలోనైనా పోటీ అవసరం. అప్పుడే ఉత్తమ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పోటీని ఇష్టపడే నటుడిని నేను. ఈ దీపావళికి తమిళంలో నా సినిమాతో పాటు, మరో రెండు చిత్రాలు కూడా విడుదలవుతున్నాయి. అన్ని చిత్రాలకీ ప్రేక్షకాదరణ లభించాలని కోరుకుంటా. తెలుగులో నేరుగా సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. నేను నిర్మాతగా మారకపోయుంటే ఈపాటికే ఆ సినిమాని పూర్తిచేసేవాడిని. శశి దర్శకత్వం వహించనున్న ఆ చిత్రం జనవరిలో మొదలవుతుంది. తమిళంలో యూటీవీ సంస్థతో కలిసి తిరు దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నా.''.

డైరక్షన్ చేస్తా...

డైరక్షన్ చేస్తా...


నన్ను ఇప్పుడు వదిలితే దర్శకత్వం వైపు వెళ్లడానికి రెడీగా ఉన్నా. దర్శకత్వం నా యాంబిషన్‌. కానీ హీరోగానే ఖాళీ లేదు. ఈ అవకాశం కోసం ఎందరో కాచుక్కూచున్నారు. ఇది ఎవరికీ దొరకనిది. అందుకే వదలడం లేదు. పూర్తి స్థాయి యాంటీ హీరోగా నటించాలని, డార్క్ సినిమా చేయాలని కూడా ఉంది. సినిమా చేసినంత సేపు హీరోగా ఆలోచించాను. ఇప్పుడు విడుదలకు దగ్గర పడుతుండటంతో నిర్మాతగా ఆలోచిస్తున్నాను. నేను నిర్మాతగా హీరో మంచి గురించి ఆలోచిస్తాను. హీరోగా నిర్మాత మంచి గురించి ఆలోచిస్తాను.

ప్రేమ-పెళ్లి

ప్రేమ-పెళ్లి

ప్రేమ, పెళ్లి అని పుకార్లొస్తున్నాయి. అవేం నిజం కావు. ప్రతి సంవత్సరం ప్రేమ దోమ అంటూ వినిపిస్తూనే ఉంటుంది. ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. అలాగని నేను ప్రేమలో ఉన్నట్టు కాదు. ప్రేమ, పెళ్లికి ఇంకా టైముంది. ప్రస్తుతానికి నా దృష్టి మొత్తం సినిమాల మీదే ఉంది. ప్రేమలో ఉన్నామనే ఫీలింగ్ బాగానే ఉంటుంది కానీ నేను ప్రస్తుతం ప్రేమలో లేను. పెళ్లి గురించి ఇప్పుడు ఏమీ ఆలోచించడం లేదు. ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. ఎవరితో ప్రేమలోనూ పడలేదు. ప్రస్తుతానికి సినిమాలపైనే నా దృష్టంతా

హీరోయిన్...

హీరోయిన్...


లక్ష్మీమీనన్ స్కూల్ టీచర్‌గా నటించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీగా సాగుతుంది. సెకండాఫ్‌లో చివరి 25 నిమిషాలు చాలా బిగుతుగా సాగుతుంది. ఇందులోని సీన్లు, డాన్సులు, ఫైట్లు.. ఏవీ ఇంతకు ముందు ఎక్కడా చూసినట్టు అనిపించవు. అన్నీ ఫ్రెష్‌గా అనిపిస్తాయి. పూర్తిగా నాకు అలవాటు లేని ఓ బాడీ లాంగ్వేజ్‌ను ఈ సినిమా కోసం ప్రయత్నించాను.

English summary
Palnadu is an upcoming Indian Telugu Movie. Directed by Suseenthiran and Produced by Vishal Krishna under Vishal Film Factory Banner. Music scored by D.Imman. Pandiya Nadu Tamil Movie is being dubbed in telugu titled "Palnadu". Vishal and Lakshmi Menon are in the Lead Roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu