»   » నటిపై రేప్ కేసులో మున్నాభాయ్ నటుడు విశాల్ అరెస్టు

నటిపై రేప్ కేసులో మున్నాభాయ్ నటుడు విశాల్ అరెస్టు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: టీవీ, సినీ నటిపై అత్యాచారానికి పాల్పడినట్లు నమోదైన కేసులో బాలీవుడ్ నటుడు విశాల్ థక్కర్‌ను ముంబై పోలీసులు మంగళవారంనాడు అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్టు చేసినట్లు చార్కోప్ పోలీసులు చెప్పారు.

మున్నాభాయ్ సినిమాలో నటించిన విశాల్ ఠక్కర్ తనపై అత్యాచారం చేశాడని టీవీ సీరియల్స్, చిత్రాల్లో నటించిన 26 ఏళ్ల యువతి ఆరోపించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, అతను తనపై దాడి చేశాడని, తనను మోసం చేశాడని కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబైలోని చార్కోప్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది.

తనను పెళ్లి చేసుకుంటానని విశాల్ హామీ ఇచ్చాడని, శారీరక సంబంధం పెట్టుకున్న తర్వాత పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఆమె ఆరోపించింది. వారిద్దరు ఓ షూటింగ్‌లో కలిశారని, ఆ తర్వాత డేటింగ్ చేయడం ప్రారంభించారని పోలీసులు చెప్పారు.

Vishal Thakkar arrested in Rape case

వారిద్దరు సన్నిహిత మిత్రులుగా మారి సహజీవనం చేయడం ప్రారంభించినట్లు కూడా వారు తెలిపారు. అయితే, ఆమెకు మరొకరితో సంబంధం ఉందని విశాల్ అనుమానిస్తూ వచ్చాడని, దీంతో ఇరువురి మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయని అంటున్నారు.

విశాల్ తనను కొట్టడం వల్లనే తాను బయటకు వెళ్లిపోయి వేరే ఫ్రెండ్‌తో ఉంటున్నానని ఆ మహిళ చెప్పింది. శనివారంనాడు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు రోజుల క్రితం విశాల్ తన ఫ్రెండ్ ఇంటికి వచ్చి, క్షమాపణ కోరి, తనతో రావాలని బతిమిలాడాడని, ఆ రాత్రి విశాల్ ఇక్కడే ఉండి తనను కొట్టాడని, తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. విశాల్ ఠక్కర్ టాంగో చార్లీ, చాందినీ బార్ వంటి చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం అతను తారక్ మెహతా కా ఊల్టా చష్మా అనే టీవీ కార్యక్రమంలో నటిస్తున్నాడు.

English summary
Bollywood actor Vishal Thakkar arrested by Mumbai police in a rape case.
Please Wait while comments are loading...