»   » యాక్షన్ థ్రిల్లర్ ('వేటాడు వెంటాడు' ప్రివ్యూ)

యాక్షన్ థ్రిల్లర్ ('వేటాడు వెంటాడు' ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : విశాల్, త్రిష జంటగా నటించిన 'వేటాడు వెంటాడు' ఈ రోజు (జనవరి 24) న విడుదల కానుంది. ఇటీవల తమిళంలో విడుదలైన 'సమర్' చిత్రానికి ఇది అనువాదం. క్రైం థ్రిల్లర్‌గా తమిళ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి వసూళ్ల వేట సాగించిన చిత్రమిది. విశాల్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిందనీ, బ్యాంకాక్, మలేషియా, చైనా లొకేషన్లలో చిత్రీకరించిన ఈ సినిమా ఓ విజువల్ ఫీస్ట్ అని నిర్మాతలు చెప్తున్నారు.

కథ విషయానికి వస్తే... శంకర్‌ (విశాల్) ఓ సాదాసీదా కుర్రాడు. జీవితం సరదాగా గడిచిపోతే చాలని భావిస్తుంటాడు. ఓ అందాల భామని చూసి మనసుపడ్డాడు. ఆమె కూడా శంకర్‌ ప్రేమను అంగీకరించింది. అన్నీ సవ్యంగా జరిగిపోతున్నాయనుకొన్న తరుణంలో ఓ ఎదురు దెబ్బ తగిలింది. ఆ ఒక్క దెబ్బ అతని జీవితాన్ని ఊబిలోకి నెట్టివేసింది. మరి అందులో నుంచి అతను ఎలా బయటపడ్డాడు? ఆ కుట్ర వెనక ఉన్నది ఎవరు? తదితర విషయాల్ని తెరపైనే చూడాలి.

నిర్మాత మాట్లాడుతూ ''ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించే కథ ఇది. ఎవరి కోసం వేట మొదలైంది? ఎవరు ఎవర్ని వెంటాడారన్నది ఇందులో ఆసక్తికరం. విశాల్‌ పోషించిన పాత్ర రెండు కోణాల్లో సాగుతుంది, యువన్ అందించిన బాణీలకు మంచి స్పందన వచ్చింది. తమిళంలో పొంగల్ రేసులో తొలిస్థానంలో ఉన్న సినిమా ఇది. తెలుగులో ఇంకా ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది'' అని అన్నారు.

విశాల్ మాట్లాడుతూ....జీవితం చాలా మందికి వరం.. ఇంకొంత మందికి శాపం. నాకు మాత్రం యుద్ధం. నేను ఓ మామూలు కుర్రాడ్ని. కానీ అతని వెనుక పోలీసులుపడ్డారు. మాఫియా తరుముతోంది. స్నేహితులు కూడా అనుమానంగా చూస్తున్నారు. ఈ సమాజం నన్ను ద్రోహిగా జమకట్టింది. ఎందుకు? నా వెనుక ఉన్న కథేమిటి? నన్ను వెంటాడి, వేటాడుతున్నది ఎవరు? ఈ విషయాలు తెలుసుకోవాలంటే మా సినిమా చూడండి అంటున్నారు విశాల్‌.

బ్యానర్: ఎం.కె. ఎంటర్‌ప్రైస్, 5 కలర్స్ మల్టీమీడియా
నటీనటులు: విశాల్, త్రిష, సునయన తదితరులు
మాటలు: శశాంక్ వెన్నెలకంటి,
సంగీతం: యువన్‌శంకర్‌ రాజా
కథ, కథనం, దర్శకత్వం: తిరు.
నిర్మాత : శ్రీనివాస్‌ దామెర

విడుదల తేదీ: జనవరి 24,2013

English summary

 Vishal and Trisha starrer ‘Vetadu Ventadu’ is going to release today in Andhra Pradesh. The movie is the dubbed version of the Tamil film ‘Samar’, which released in Tamil Nadu on January 13th. Thiru is the director of this movie.
Please Wait while comments are loading...