»   » "ఆచారి అమెరికా యాత్ర" ప్రారంభం... (ఫోటోస్)

"ఆచారి అమెరికా యాత్ర" ప్రారంభం... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

మంచు విష్ణు-బ్రహ్మానందంల క్రేజీ కాంబినేషన్ లో జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఆచారి అమెరికా యాత్ర". "దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం" లాంటి సూపర్ హిట్ చిత్రాల అనంతరం మంచు విష్ణు-జి.నాగేశ్వర్రెడ్డిల కాంబిణేషన్ లో తెరకెక్కనున్న మూడో చిత్రమిది.

పద్మశ్రీ డా.మోహన్ బాబు జన్మదినం నేడు (మార్చి 19న) ఈ చిత్ర ప్రారంభోత్సవం తిరుపతిలో సినీ మరియు రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎల్.కుమార్ చౌదరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

ముహూర్తపు సీన్

ముహూర్తపు సీన్

మంచు విష్ణు-బ్రహ్మానందంలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కళాబంధు సుబ్బిరామిరెడ్డి క్లాప్ కొట్టగా.. రాజకీయవేత్త రఘురామరాజు కెమెరా స్వీచ్చాన్ చేశారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గౌరవదర్శకత్వం వహించారు.

అమెరికాలో మేజర్ పార్ట్ షూటింగ్

అమెరికాలో మేజర్ పార్ట్ షూటింగ్

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "మల్లిడి వెంకటకృష్ణ మూర్తి ఈ చిత్రానికి ఆద్యంతం అలరించేలా ఓ మంచి కథను సమకూర్చారు. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కే ఈ చిత్రం షూటింగ్ మేజర్ పార్ట్ అమెరికాలో జరగనుందని తెలిపారు.

విష్ణు, బ్రహ్మీ

విష్ణు, బ్రహ్మీ

మంచు విష్ణు, బ్రహ్మానందంల కాంబినేషన్ విశేషంగా అలరిస్తుంని నిర్మాత తెలిపారు. మోహన్ బాబుగారి పుట్టినరోజున మా సినిమా ప్రారంభోత్సవం జరగడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే రెగ్యులర్ షూట్ మొదలవుతుందని వెల్లడించారు.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్

ఈ చిత్రానికి కథ: మల్లాది వెంకటకృష్ణమూర్తి, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, కళ: కిరణ్, ఫైట్స్: వెంకట్, డ్యాన్స్: ప్రేమ్ రక్షిత్-దినేష్-గణేష్, కాస్ట్యూమ్స్: నరసింహ, లిరిక్స్: భాస్కరభట్ల, పబ్లిసిటీ డిజైన్స్: కృష్ణ ప్రసాద్, స్టిల్స్: రాజు, మాటలు: డార్లింగ్ స్వామి, స్క్రీన్ ప్లే: విక్రమ్ రాజ్-నివాస్-వర్మ, సంగీతం: శేఖర్ చంద్ర, ఛాయాగ్రహణం: సిద్దార్థ, నిర్మాతలు: కీర్తి చౌదరి-కిట్టు, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జి.నాగేశ్వర్రెడ్డి!

English summary
Achari America Yatra, the new hilarious riot from Vishnu Manchu, director G Nageshwar Reddy and produced by Keerthi Chowdary and Kittu is launched today in Tirupathi. Vishnu and Nageshwar Reddy’s combination is popular for super hits like Denikaina Ready and Eedo Rakam Ado Rakam is back with a funny script. This is a dream hat trick produced on Padmaja Pictures presented by ML Kumar Chowdary.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu