అండర్‌వేర్‌తో స్టేషన్‌లో సినీ ప్రముఖులు.. అలా చేస్తే పేర్లు బయట పెడతా: మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ (మా) ఎన్నికల హీట్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. ప్రస్తుతం పాలక వర్గానికి గడువు ఉన్నా.. అప్పుడే అధ్యక్ష పదవి కోసం బరిలో నిలిచిన సినీ పెద్దలంతా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్టిస్టులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ మరింత వేడి పెంచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల బరిలో నిలిచిన మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమకు చెందిన ఆర్టిస్టుల కేసులపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు మీకోసం!

 ‘మా' బరిలో 5గురు సినీ ప్రముఖులు

‘మా' బరిలో 5గురు సినీ ప్రముఖులు

మొదట్లో ఏకగ్రీవాలైనా.. క్రమక్రమంగా 'మా' ఎన్నికలు అంటే ఇద్దరు ముగ్గురు ప్రముఖులు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. అయితే, ఈ సారి మాత్రం ఏకంగా ఐదుగురు నటీనటులు ఎన్నికల బరిలో నిలిచారు. వారెవరో కాదు చాలా కాలంగా సినీ రంగంలో విశేషమైన సేవలు అందిస్తోన్న ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావులు పోటీలో ఉన్నారు.

తప్పుకుంటానని విష్ణు వీడియో రిలీజ్

తప్పుకుంటానని విష్ణు వీడియో రిలీజ్

'మా' అధ్యక్ష బరిలో నిలిచిన మంచు విష్ణు ఇటీవల ఓ వీడియోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో 'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' స్థాపించినప్పటి నుంచి ఎన్నో విషయాలను ప్రస్థావించిన అతడు.. మా బిల్డింగ్‌ను కట్టేందుకు డబ్బులు ఇస్తానని చెప్పాడు. అంతకంటే ముందు పెద్దలంతా కలిసి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని అన్నాడు. అలా జరిగితే తప్పుకుంటానని ప్రకటించాడు.

‘మా' ఎన్నికపై విష్ణు.. ఆ మాట మీదే

‘మా' ఎన్నికపై విష్ణు.. ఆ మాట మీదే

తాజాగా మంచు విష్ణు ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ ఎన్నికల గురించి ఎన్నో విషయాలను ప్రస్తావించాడు. అంతేకాదు, ఇప్పటికైనా సినీ పెద్దలంతా కలిసి ఏకగ్రీవం చేయడానికి ఒప్పుకుంటే ఎన్నికల నుంచి తప్పుకుంటానని విష్ణు స్పష్టం చేశాడు. ఆ దిశగా అడుగులు వేస్తే సంతోషమేనని కూడా చెప్పుకొచ్చాడు.

మా అజెండా అది కాదు.. సమస్యలెన్నో

మా అజెండా అది కాదు.. సమస్యలెన్నో

'మా' ఎన్నికల్లో అందరూ బిల్డింగ్ గురించే మాట్లాడుతున్నారన్న మంచు విష్ణు.. తమ ప్రధాన అజెండా అది కాదని స్పష్టం చేశాడు. 'ఎన్నికల ఏకగ్రీవం అయితే బిల్డింగ్ సొంత డబ్బుతో కట్టిస్తా. కానీ, నా ప్రధాన అజెండా అది మాత్రం కాదు. ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయి. కరోనా సమయంలో ఎంతో మంది డబ్బులు లేక ఇబ్బందులు పడ్డారు' అని మంచు విష్ణు వివరించాడు.

సహాయం చేసి పేర్లు చెప్పుకోకూడదు

సహాయం చేసి పేర్లు చెప్పుకోకూడదు

కోవిడ్ సమయంలో చాలా మంది సహాయాలు చేశారని, కొందరు మాత్రం ప్రచారం చేసుకున్నారని మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశాడు. 'కరోనా సమయంలో చాలా మంది ప్రముఖులు సినీ కార్మికులకు సహాయం చేశారు. ఇప్పటి ప్రెసిడెంట్ నరేష్ గారు చాలా మందికి హెల్ప్ చేశారు. నా ఉద్దేశంలో సహాయం చేస్తే మరో చేతికి తెలీయకూడదు. అలా చెప్పుకోకూడదు' అని పేర్కొన్నాడు.

Recommended Video

MAA Election : Jeevita Rajasekhar Vs Prakash Raj Vs Manchu Vishnu| Triangular Fight|Filmibeat Telugu
అండర్‌వేర్‌తో స్టేషన్‌లో ఉన్నారంటూ

అండర్‌వేర్‌తో స్టేషన్‌లో ఉన్నారంటూ

సినీ ప్రముఖుల పోలీస్ కేసులపై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'కరోనా సమయంలో నేను కూడా చాలా మందికి సహాయం చేశాను. కానీ ఎవరికీ చెప్పుకోలేదు. అంతెందుకు ఇండస్ట్రీలో సగం మంది కేసుల్లో చిక్కుకుని పోలీస్ స్టేషన్‌లో అండర్‌వేర్‌తో ఉంటే.. తెల్లవారుజాము వరకూ ఉండి రాజీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి' అని షాకింగ్ విషయాలు బయట పెట్టాడు విష్ణు.

అలా చేస్తే వాళ్ల పేర్లు బయట పెడతా

అలా చేస్తే వాళ్ల పేర్లు బయట పెడతా

ఈ ఇంటర్వ్యూలో కొందరు సినీ ప్రముఖులకు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చాడు. 'అప్పుడు నేను హెల్ప్ చేయడం వల్ల ఊచలు లెక్కబెట్టకుండా తప్పించుకున్న వాళ్లే ఇప్పుడు ఎక్కువ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ల వ్యవహారం శృతి మించిందంటే మాత్రం ఆ పేర్లు అన్నీ బయట పెడతాను' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆ ప్రముఖులు ఎవరా అని అంతా ఆలోచిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X