»   » మంచు విష్ణు, సోనారిక జంటగా కొత్త సినిమా (ఫోటోస్)

మంచు విష్ణు, సోనారిక జంటగా కొత్త సినిమా (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు విష్ణు హీరోగా అడ్డా ఫేం జి.కార్తిక్ రెడ్డి దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. సోమా విజయ్ ప్రకాష్ నిర్మాణ నిర్వహణలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలింస్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. జాదూగాడు ఫేం సోనారిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ముఖ్యఅతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. మరో అతిథి జెమిని కిరణ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు.

దర్శకుడు జి.కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ...లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. గతంలో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టెనర్లు వచ్చినప్పటికీ ఆ సినిమాకు కంటే భిన్నంగా, కొత్త కోణాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. మంచి ఫీల్ ఉన్న లవ్ స్టోరి. విష్ణుగారి బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. అనూప్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రేపటి నుండి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభిస్తున్నామన్నారు.

 Vishnu Manchu & Sonarika's news film launch

నిర్మాతలు డి.కుమార్, పల్లి కేశవ్ రావ్, సోమా విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ...మా బ్యానర్ లో చేస్తున్న రెండో మూవీ. సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని రూపొందిస్తాం. మంచి ఎంటర్ టైనింగ్ సబ్జెక్ట్. విష్ణుగారికి బాడీ లాంగ్వేజ్ కి తగిన స్టోరి. బబ్లీ గర్ల్ పాత్రలో సోనారిక పాత్ర ఆకట్టుకునే విధంగా ఉంటుందన్నారు.

బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్‌రెడ్డి, రవికిషన్‌, పృథ్వీ, రాజా రవీంద్ర, వెన్నెలకిషోర్‌, శ్రీనివాస్‌రెడ్డి, సత్య, నవభారత్‌ బాలాజీ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, కెమెరా: విజయ్‌ సి.కుమార్‌, ఎడిటర్‌: యస్‌.ఆర్‌.శేఖర్‌, ఆర్ట్‌: రామాంజనేయులు, ఫైట్స్‌: విజయ్‌, పి.ఆర్‌.ఓ: వంశీ-శేఖర్‌,నిర్మాణ, నిర్వహణ: సోమా విజయ్‌ప్రకాష్‌, నిర్మాతలు: డి.కుమార్‌, పల్లి కేశవరావు, రచన-దర్శకత్వం: జి.కార్తిక్‌ రెడ్డి.

English summary
Vishnu Manchu & Sonarika's news film launch today at Rana Naidu studio.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu