»   »  హీరో మంచు విష్ణు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్

హీరో మంచు విష్ణు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
vishnu-manchu-
హైదరాబాద్: హీరో మంచు విష్ణు ఇండియాలోనే బిగ్గెస్ట్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్‌‌కు స్పాన్సర్‌గా వ్యవహరించబోతున్నారు. భాగ్యనగర్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ వారు ఈ పోటీలను నిర్వహించబోతున్నారు. మంచు విష్ణు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఈ పోటీలను 'విష్ణు మంచు మిస్టర్ భాగ్య నగర్-2014' పేరుతో నిర్వహించనున్నారు.

పిబ్రవరి 16వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి హైదరాబాద్ వనస్థలి పురంలోని గణేష్ టెంపుల్ కాంప్లెక్స్ ఓపెన్ ఆడిటోరియంలో ఈ పోటీలు జరుగనున్నాయి. ఈ విషయమై మంచు విష్ణు మాట్లాడుతూ....ఇలాంటి స్పోర్ట్స్ ను ప్రోత్సహించడం తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. ప్రతి ఒక్కరు జిమ్ చేయాలని, శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవాలని మంచు విష్ణు సూచించారు.

ఈ పోటీల్లో టైటిల్ విన్న‌ర్‌కు రూ. లక్ష రూపాయల ఫ్రైజ్ మనీ ఇవ్వబడుతుందని, 2వ, 3వ స్థానం దక్కించుకున్న వారికి సైతం క్యాష్ ఫ్రైజ్, సర్టిఫికెట్ ఇవ్వబడుతుందని నిర్వహకులు తెలిపారు. టోటల్ ఫ్రైజ్ మనీ రూ. 5 లక్షలు మంచు విష్ణు స్పాన్సర్ చేస్తున్నారని భాగ్యనరగ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెల్లడించారు.

ఈ పోటీలకు మంచు విష్ణు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఈ పోటీల్లో పాల్గొనదలిచిన బాడీబిల్డింగ్ క్రీడాకారులు.... 9700471900, 9989486737 నెంబర్లకు కాల్ చేసి పేరు రిజిస్ట్ చేసుకోవాలని, ఎవరైనా సరే ఇందులో పాల్గొనవచ్చని నిర్వాహకులు వెల్లడించారు.

English summary
Bhagyanagar Body Building Association has announced a Body Building Competition titled ‘Vishnu Manchu Mr. Bhagyanagar 2014’. The competition will be held at Ganesh Temple Complex Open Auditorium, Vanasthalipuram from 4:00 PM onwards on February 16.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu