»   » 6న మంచు విష్ణు హంగామా స్టార్ట్

6న మంచు విష్ణు హంగామా స్టార్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :మంచు విష్ణు హీరో గా నటిస్తున్న చిత్రం 'డైనమైట్‌'. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి దేవా కట్టా దర్శకుడు. ప్రణీత కథానాయిక. అచ్చు సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాల్ని ఈ నెల 6న విడుదల చేయనున్నారు. అదే రోజున చిత్రం ట్రైలర్ విడుదల కానుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

దర్శకుడు మాట్లాడుతూ ''యాక్షన్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. విష్ణు నటన, ఆయన లుక్‌ ఆకట్టుకొంటాయి. చెవిపోగు, టట్టూతో విష్ణు కొత్తగా కనిపిస్తారిందులో. విజయ్‌ నేతృత్వంలో తెరకెక్కించిన యాక్షన్‌ సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణ'' అన్నారు.

Vishnu’s Dynamite ready for audio launch

ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం మంచు విష్ణు స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ప్రస్తుతం సినిమా ఫైనల్ స్టేజ్ లో ఉంది. విష్ణు స‌ర‌స‌న గ్లామ‌ర‌స్ హీరోయిన్ ప్రణీత హీరోయిన్‌గా న‌టిస్తుంది. మంచు విష్ణు న‌ట‌న‌, లుక్‌, ఫైట్ మాస్టర్ విజ‌య్ అందించిన యాక్షన్ సీక్వెన్స్‌, దేవాక‌ట్టా టేకింగ్, ప్రొడ‌క్షన్ వాల్యూస్ హైలైట్ గా ఉంటాయని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.

యువ సంగీత దర్శకుడు అచ్చు సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్యక్రమాన్ని సినీ, రాజ‌కీయ ప్రముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా నిర్వహించ‌నున్నారు.

‘వెన్నెల', ‘ప్రస్థానం', ‘ఆటోనగర్ సూర్య' సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మరియు విమర్శకుల మెప్పు పొందిన డైరెక్టర్ దేవకట్ట . థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా విక్రమ్ ప్రభు హీరోగా, ప్రియ ఆనంద్ హీరోయిన్ గా తమిళంలో ఘన విజయం సాధించిన ‘అరిమ నంబి'కి రీమేక్.

English summary
On June 6th, music scored by Achhu for “Dynamite” will be unveiled in a grand manner. It’s the remake of Tamil hit “Arima Nambi” and has Deva Katta directing it.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu