»   » సంపూ... పేరు వింటే మంచు విష్ణు పిల్లలు హడల్!

సంపూ... పేరు వింటే మంచు విష్ణు పిల్లలు హడల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘డైనమైట్' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది హీరోయిన్ ప్రణీత. ఇటీవల ప్రణీత మంచు విష్ణు పిల్లలకు సంబంధించిన ఓ విషయం బయట పెట్టింది. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు పేరు చెబితే చాలా విష్ణు కూతుర్లు అరియానా, వివియానా భయపడి పోతున్నారట.

ఓ సారి ‘డైనమైట్' సినిమా సెట్లోకి సంపూర్ణేష్ బాబు పోలీస్ యూనిఫాంలో వచ్చాడు. ఆ సమయంలో అతనితో ఏదో మాట్లాడుతున్నాను. ఆ సమయంలో అక్కడే ఉన్న మంచు విష్ణు కూతుర్లు అరియానా, వివియానా అతన్ని చూసి భయపడి పోతున్నారు.

Vishnu's Kids Ariana and Viviana scary moment

చిన్న తనంలో పిల్లలు మారాం చేస్తే...మన దారికి తెచ్చుకోవడానికి బూచోడి పేరు చెప్పి భయపెట్టిస్తాం. అదే విధంగా విష్ణు తన పిల్లలు మాట వినకుంటే ‘సంపూకు ఫోన్ చేస్తాను' అని చెప్పి భయ పెట్టి తన దారికి తెచ్చుకుంటున్నాడు. మంచు గర్ల్స్ కి సంబంధించి ఇది వరస్ట్ చైల్డ్ హుడ్ రూమర్ అని చెప్పుకొచ్చారు ప్రణీత.

తన చిన్నతనంలోని చైల్డ్ హుడ్ రూమర్స్ ని గుర్తు చేసుకుంటూ.... కొందరు తల్లిదండ్రులు మా నాన్న(పిజీషియన్)ను చూపిస్తూ, నున్వు చెప్పిన మాట వినకుంటే డాక్టర్ అంకుల్ ఇంజక్షన్ ఇస్తారు అంటూ భయ పెట్టేవారు...అని చెప్పుకొచ్చింది.

English summary
"Vishnu's Daughters Ariana and Viviana got so scared. Since then, The Mancu Hero says 'Sampoo Ki Phone Chestanu' to make his kids listen to him. That's the #WorstChildhoodRumors of Manchu Girls!" Pranitha said.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu