For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మంచు విష్ణు కొత్త చిత్రం ప్రారంభం(ఫొటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్ : కామెడీ ఎంటర్టైనర్ 'దేనికైనా రెడీ'తో విజయం అందుకొన్న మంచు విష్ణు ఇప్పుడు మరోసారి వినోదం పంచడానికి సిద్ధమవుతున్నారు. విష్ణు హీరోగా 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. అందాల రాక్షసి చిత్రంతో పరిచయమైన లావణ్య హీరోయిన్ . వీరూపోట్ల దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌బాబు నిర్మాత. ఈ చిత్రం ఆదివారం తిరుపతి సమీపంలోని చంద్రగిరిలో ప్రారంభమైంది.

  తిరుపతి సమీపంలోని చంద్రగిరి ప్రభుత్వ పాఠశాలలో ఈ చిత్రం ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. వీరూ పోట్ల దర్శకత్వంలో విష్ణు కుమార్తెలు ఆరియానా, వివియానా సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. విష్ణు తల్లి నిర్మలా మోహన్‌బాబు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం తొలి దృశ్యాన్ని చిత్రీకరించారు.

  తొలి సన్నివేశానికి మంచు మనోజ్‌ క్లాప్‌ నిచ్చారు. లక్ష్మీప్రసన్న స్విచ్చాన్‌ చేశారు. మోహన్‌బాబు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మలా మోహన్‌బాబు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ దృశ్యానికి మోహన్‌బాబు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ వేడుకలో పార్లమెంట్ సభ్యులు డా. శివప్రసాద్, విష్ణు సతీమణి విరానికా తదితరులు పాల్గొన్నారు. వేద పండితుల సమక్షంలో వీరూ పోట్లకు మోహన్ బాబు స్క్రిప్ట్ అందించారు.

  మోహన్ బాబు తన ముద్దుల మనమరాలితో ...

  ఈ వేడుకలో పాల్గొన్న మంచు లక్ష్మి తండ్రితో మాట్లాడుతూంటే...సోదరుడు మంచు మనోజ్ ప్రక్కనే ఉన్నారు.

  తన మేనకోడలిని చంకన వేసుకుని మంచు లక్ష్మి..స్విఛాన్ చేసారు

  చిన్నారి తో కూడా స్విఛ్చాన్ చేయిస్తూ...

  మరి ఓకేనా అంటున్నట్లున్న మోహన్ బాబు,లక్ష్మి ప్రసన్న

  ఈ సినిమా ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం వారి కళ్లల్లో కనపడుతోంది.

  స్క్రిప్టుని..దర్శకుడు వీరూ పోట్లకి ..అందిస్తున్న మోహన్ బాబు.

  తండ్రీ కొడుకు ఆసక్తిగా జరిగే ముచ్చటను తిలకిస్తూ...

  హీరో గెటప్ ఇలాగే ఉంటుందేమో ఈ సినిమాలో ...అందుకే ఈ స్టిల్...

  మోహన్‌బాబు మాట్లాడుతూ ''వినోదాత్మకంగా సాగే చిత్రమిది. అన్ని వయసుల వారినీ ఆకట్టుకొనేలా ఉంటుంది. ఈ దర్శకుడు 'బిందాస్‌', 'రగడ' సినిమాలు రూపొందించారు. వాటి కంటే మంచి విజయం సాధిస్తుందీ చిత్రం. 25 రోజుల పాటు తిరుపతి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతాం'' అన్నారు.

  అన్నగారిపై క్లాప్ కొడుతున్న మంచు మనోజ్...

  హిట్ కొట్టబోతున్న ధీమాతో..మంచు విష్ణు...

  దర్శకుడు చెబుతూ ''ఇదివరకు మనోజ్‌తో ఓ సినిమా చేశా. ఇప్పుడు విష్ణుతో కలిసి పనిచేస్తుండడం ఆనందంగా ఉంది. యాక్షన్‌, వినోదం మేళవించిన కథ ఇది. మణిశర్మ బాణీలు ఆకట్టుకొంటాయ''న్నారు.

  బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అలీ, ఆహుతి ప్రసాద్‌, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సర్వేష్‌ మురారి, కళ: రఘు కులకర్ణి, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌. ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: విజయ్‌, సమర్పణ: అరియానా, వివియానా.

  కెమెరా సర్వేష్ మురారి, మంచు ఫ్యామిలీ, దర్శకుడు వీరూ పోట్ల కలిసిన గ్రూప్ ఫోటో...

  English summary
  Manchu Vishnu's new film was launched on Sunday morning (Feb 24th) in Tirupati under the direction of Veeru Potla of Bindaas and Ragada fame. Lakshmi Prasanna switched on the camera for the muhurtham scene, while Manoj sounded the clapboard. Dr.Mohan Babu did the honors of directing the muhurtham scene. Mohan Babu said the film is going to be shaped up as an action comedy that would appeal to all section of audiences. Manisharma is going to compose the music. Major part of the movie would be shot here in Tirupati, he said. Vishnu has Lavanya Tripati as heroine. She made debut with Andala Rakshasi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X