For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Veera Simha Reddy: బాలయ్య‌తో విశ్వక్ సేన్.. హై రేంజ్ ప్లాన్.. సీక్రెట్లు లీక్ చేసిన డీజే టిల్లు హీరో

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ మధ్య కాలంలో మరింత ఉత్సాహంగా కనిపిస్తోన్న ఆయన.. ఈ సంక్రాంతికి 'వీర సింహా రెడ్డి' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ రెస్పాన్స్‌ను అందుకుంటూ సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్‌ను 'వీరసింహుని విజయోత్సం' పేరిట నిర్వహించింది. ఇందులో యంగ్ హీరోలు విశ్వక్, సిద్ధు స్పీచ్‌లతో ఆకట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే...

  వీర సింహా రెడ్డిగా బాలకృష్ణ రచ్చ

  వీర సింహా రెడ్డిగా బాలకృష్ణ రచ్చ


  నటసింహా బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన మాస్ మూవీనే 'వీర సింహా రెడ్డి'. ఈ యాక్షన్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌ కాగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ వంటి స్టార్లు నటించారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మించారు. అలాగే, థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు.

  పైట తీసేసి పచ్చిగా హీరోయిన్ ఫోజులు: ఉప్పొంగిన అందాలతో రెచ్చగొడుతూ!

  భారీ స్పందన.. బిగ్గెస్ట్ కలెక్షన్లతో

  భారీ స్పందన.. బిగ్గెస్ట్ కలెక్షన్లతో

  క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'వీర సింహా రెడ్డి' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ దీనికి ఏమాత్రం సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్పందన దక్కుతోంది. దీంతో ఈ మూవీకి కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఫలితంగా ఈ మూవీ బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించి.. టార్గెట్‌కు మరింత చేరువ అయింది.

  వీరసింహుని విజయోత్సవంతో

  వీరసింహుని విజయోత్సవంతో


  నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కలయికలో రూపొందిన 'వీర సింహా రెడ్డి' మూవీ భారీ కలెక్షన్లను సాధిస్తుండడంతో చిత్ర యూనిట్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో 'వీరసింహుని విజయోత్సవం' పేరిట ఓ సక్సెస్‌ను మీట్‌ను నిర్వహించింది. దీనికి పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు హాజరై ఓ రేంజ్‌లో సందడి చేసేశారు.


  Suhana Khan: అందాల ఆరబోతతో షారుఖ్ కూతురు రచ్చ.. షార్ట్ డ్రెస్‌లో యమ హాట్‌గా!

  ఎవరైనా వింటే నా పని బుస్కీనే

  ఎవరైనా వింటే నా పని బుస్కీనే


  'వీర సింహా రెడ్డి' సక్సెస్ మీట్‌కు డీజే టిల్లు ఫేం సిద్దు జొన్నలగడ్డ గెస్టుగా వచ్చాడు. ఈ సందర్భంగా బాలకృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. 'సార్ అంటే ఫస్ట్ భయం ఉండేది. కానీ, ఆయనతో మాట్లాడితే మొత్తం పోయింది. ఇక, బాలయ్య సార్ నన్ను బ్రో అని పిలువు అంటారు. అప్పుడు సార్‌తో అన్నా.. ఆ మాట ఎవరైనా వింటే నా బుస్కీ అయితది అని' అని చెప్పాడు.

  నా ఇంజిన్ దొబ్బితే దొబ్బిందని

  నా ఇంజిన్ దొబ్బితే దొబ్బిందని


  'వీర సింహా రెడ్డి' సక్సెస్ ఈవెంట్‌లో మరో గెస్టుగా వచ్చిన విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. 'అందరికీ నమస్తే.. వారం నుంచి నా సినిమా డబ్బింగ్ చెప్పట్లే. పోస్ట్ ప్రొడక్షన్ కోసం అరిచీ అరిచీ నా ఓకల్‌ కార్టుకు దెబ్బ తగిలింది. దీంతో డాక్టర్ వారం రోజులు వాయిస్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. కానీ, దీని ఇంట్లో నా ఇంజిన్ దొబ్బితే దొబ్బింది జై బాలయ్య' అంటూ ఫ్యాన్స్‌ను హుషారెత్తించాడు.

  బాలయ్య బ్రోను సాధించానని

  బాలయ్య బ్రోను సాధించానని

  ఆ తర్వాత విశ్వక్ కొనసాగిస్తూ.. 'ఇండస్ట్రీకి వచ్చి ఏ సాధించావురా అంటే.. నేను ఇన్ని సినిమాలు హిట్ చేశా.. ఇన్ని సినిమాలు చేస్తున్నా.. ఇంత సంపాదిస్తున్నా.. ఇవన్నీ కొన్ని అచీవ్‌మెంట్లు అయితే సార్.. మీరు జస్ట్ ఫోన్ చేసి బ్రో హౌయ్ ఆర్ యూ అని అడిగారు. అందుకే ఇప్పుడు చెప్తున్నా నువ్వు ఏం సాధించావురా అంటే బాలయ్య బ్రో లవ్‌ను సాధించాను అని' అంటూ చెప్పుకొచ్చాడు.

  మొగుడ్ ఆఫ్ మాస్ చేస్తా అని

  మొగుడ్ ఆఫ్ మాస్ చేస్తా అని


  చివర్లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఓ సస్పెన్స్ క్రియేట్ చేశాడు. 'బాలయ్య సార్ నన్ను అలా అనొద్దు అని తిడుతుంటారు. సార్ మీకు తెలీదు.. ఇప్పటికీ మీకు కొత్త ఫ్యాన్స్ పుడుతున్నారు. ఇప్పుడు చెబుతున్నా.. ఈ మాస్ కా దాస్‌కు ఛాన్స్ ఇస్తే మీ గాడ్ ఆఫ్ మాస్‌ను మొగుడ్ ఆఫ్ మాస్ చేస్తా.. హైదరాబాద్‌లో... ఏదో ప్లాన్ చేస్తున్నా' అని చెప్పాడు. దీంతో బాలయ్య కోసం విశ్వక్ స్టోరీ రాస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.

  English summary
  Veera Simha Reddy Unit Conducted Veerasimhune Vijayotsavam Event Last Night. Vishwak Sen and Siddu Spoke Great Words on Balakrishna In This Event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X