»   » విశ్వరూపం నిషేధానికి కారణం ఆమె.. జయలలితపై కమల్ ఫైర్

విశ్వరూపం నిషేధానికి కారణం ఆమె.. జయలలితపై కమల్ ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

గతంలో విశ్వరూపం చిత్రంపై నిషేధం విధించిన తమిళనాడు ప్రభుత్వంపై విలక్షణ నటుడు కమల్ హాసన్ మరోసారి నిప్పులు చెరిగారు. విశ్వరూపం చిత్రాన్ని అడ్డుకొన్నద ఎవరో నాకు తెలుసు అని ఇటీవల తమిళ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. అప్పటి ముఖ్యమంత్రి, దివంగత నేత జే జయలలితపై పరోక్షంగా తీవ్రంగా విమర్శలు చేశారు.

నాలుగు సంవత్సరాల క్రితం తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్ కమల్ ఫిల్మ్స్ కేసు నమోదు చేసింది. జయ ప్రభుత్వం తీరు వల్ల నాకు రూ.55 కోట్ల నష్టం వాటిల్లింది. విశ్వరూపంపై నిషేధానికి కారణం కేవలం కొన్ని ముస్లిం సంస్థలే కాదు. కొందరు ముస్లిం కమ్యూనిటీకి చెందిన నేతలే నాకు సహాయం చేసి కష్టాల నుంచి బయటపడేశారు. అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వ నేతనే విశ్వరూపం వివాదానికి కారణం అని జే జయలలితపై పరోక్షంగా ఆరోపణలు చేశారు.

Vishwaroopam row: Kamal Haasan says he knew who was behind the ban

ప్రస్తుతం సుభాష్ నాయుడు అనే చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. షూటింగ్‌లో కాలికి గాయం కావడంతో సినిమా నిర్మాణం వాయిదా పడింది. మూడు భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, సౌరభ్ శుక్లా నటిస్తున్నారు.

English summary
veteran filmmaker actor Kamal Haasan spoke to a Tamil channel recently. He said he knew who was behind his troubles with Vishwaroopam. he hinting at the then chief minister of the state, late J Jayalalithaa.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu