twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విశ్వరూపం రూ. 350 కోట్లు వసూలు చేస్తుంది: కమల్ హాసన్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: కమల్ హాసన్ 'విశ్వరూపం' చిత్రం డిటిహెచ్ రిలీజ్ నేపథ్యంలో థియేటర్ల ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కేవలం తమిళ సినిమా చరిత్రలోనే బిగ్ బడ్జెట్ సినిమా కాదు... భారతీయ సినీ చరిత్రలోనే ఇదో భారీ బడ్జెట్ చిత్రం.

    విశ్వరూపం సినిమా మొత్తం ఖర్చు దాదాపు రూ. 100 కోట్లకు చేరువైంది. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీలో విడుదల చేస్తున్న నిర్మాతలు ఈచిత్రం బాక్సాఫీసు వద్ద భారీ లాభాలను తెచ్చి పడుతుందని ఆశిస్తున్నారు. ఈ చిత్రం డిటిహెచ్ రైట్స్, థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ అన్నీ కలిపి భారీ లాభాలను తెచ్చి పెడుతుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది నిర్మాతల నుంచి.

    ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన కమల్ హాసన్ చెప్పిన వివరాల ప్రకారం.... ఈ చిత్ర నిర్మాణానికి రూ. 95 కోట్లు ఖర్చయింది, ఈ చిత్రం తమకు 100శాతం లాభాలను తెచ్చి పెడుతుందని ఆశిస్తున్నారు. ఓ ప్రముఖ నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ హాట్లాడుతూ... 'విశ్వరూపం చిత్రం నుంచి నేను 100 శాతం లాభాలను ఎక్స్ పెక్ట్ చేస్తున్నాను. థిట్రికల్ రైట్స్, డిటిహెచ్ రైట్స్ అన్నీ కలిపి రూ. 350 కోట్ల వరకు వసూలు చేస్తుందని భావిస్తున్నాను' అని వెల్లడించారు.

    విశ్వరూపం రూ. 350 కోట్లు వసూలు చేస్తుంది: కమల్ హాసన్

    మరో వైపు కమల్ హాసన్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. డిటిహెచ్ రిలీజ్ నేపథ్యంలో నాకు బెదిరింపులు వస్తున్నాయని, నా సినిమా పైరసీ సీడీలు తయారుచేస్తామని, సినిమా ప్రసార సమయంలో విద్యుత్ ప్రసారాలు లేకుండా చేస్తామని తనను బెదిరిస్తున్నారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

    విశ్వరూపం రూ. 350 కోట్లు వసూలు చేస్తుంది: కమల్ హాసన్

    కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ‘విశ్వరూపం' చిత్రం రూపొందుతోంది. ఈచిత్రం డిటిహెచ్ విడుదల నేపథ్యంలో వివాదం ఏర్పడటంతో ఆయన తమిళనాడు ప్రభుత్వం సాయం కోరారు.

    విశ్వరూపం రూ. 350 కోట్లు వసూలు చేస్తుంది: కమల్ హాసన్

    విశ్వరూపం చిత్రం డిటిహెచ్ రిలీజ్ ను తమిళనాడు థియేటర్ల ఓనర్లు వ్యతిరేకిస్తున్నారు. థియేటర్ల కంటే ముందుగా డిటిహెచ్ ద్వారా టీవీల్లో విడుదల చేయడం ద్వారా తాము నష్టపోతామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    విశ్వరూపం రూ. 350 కోట్లు వసూలు చేస్తుంది: కమల్ హాసన్

    కమల్ హాసన్ డిటిహెచ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ థియేటర్ల ఓనర్లు సినిమాను ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నారు. అయితే కమల్ హాసన్ మాత్రం తమిళనాడులో 390 థియేటర్లలో సినిమా విడుదలవుతోందని తెలిపారు.

    విశ్వరూపం రూ. 350 కోట్లు వసూలు చేస్తుంది: కమల్ హాసన్

    మరి సినిమా విడులవుతుందా? లేదా? కమల్ హాసన్ ఆశించిన లాభాలు ఈ సినిమా తెచ్చి పెడుతుందా? తొలి డిటిహెచ్ రిలీజ్ గా రికార్డుల కెక్కిన ఈ చిత్రం చిత్ర సీమ దశను మారుస్తుందా? అనే విషయాలు త్వరలో తేలనున్నాయి.

    English summary
    Kamal Hassan's Vishwaroopam, which is facing stiff opposition for its release on Direct-To-Home (DTH) format, is not only one of the biggest films of Tamil film industry but also a mega-budget film made in the Indian film circuit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X