»   » ఈసారి ఆత్మహత్య తో కాదు: నిజంగా గ్రేట్ అనిపించుకున్న వితిక (వీడియో)

ఈసారి ఆత్మహత్య తో కాదు: నిజంగా గ్రేట్ అనిపించుకున్న వితిక (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ భార్య వితిక షేర్ ఈ మధ్య ఆత్మాహత్యాయత్నం చేశారనే వార్తతో ఒక్క సారి వార్తల్లోకి ఎక్కింది. ఇదివరకే సినిమాల్లో హీరోయిన్ గా చేసినా రాని పబ్లిసిటీ ఈ ఒక్క వార్త తో వచ్చేసింది. వితిక ఆత్మహత్యకు ప్రయత్నించిందన్న వార్తలు సినీ వర్గాలను షాక్ గురిచేశాయి. గత బుధవారం ఉదయమే ఈ వార్త మీడియాలో సంచలనంగా మారింది.

వరుణ్ సందేశ్ ప్రేమించి పెళ్లి చేసుకొన్న వితిక ఎందుకు సూసైడ్‌కు ప్రయత్నం చేశారనే విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో పరిస్థితి చేజారి పోతుందని భావించిన వరుణ్ సందేశ్ తన భార్యతో మీడియాకు ఓ ప్రకటన రిలీజ్ చేయించారు. మొత్తానికి ఆ గొడవ ప్రశాంతగా ముగిసింది. అయితే ఇప్పుడు మరో మంచి పని చేసి వైరల్ అయిపోయింది వితిక.. ఈ సారి ఏ అఘాయిత్యమూ చేయలేదు లెండి..ఒక మంచి పనే చేసింది. ఎంతో ఇష్టంగా పెంచుకున్న జుట్టుని క్యాన్సర్ రోగుల కోసం ఇచ్చేసింది...

'ఇవ్వడంలో సంతోషం ఉంటుందని అందరూ అంటారు. ఇవ్వడం అంటే మామూలుగా కాకుండా అది కూడా కొంచెం భిన్నంగా ఉంటే మరింత సంతోషంగా ఉంటుంది. అందుకే నేను నా తలనీలాలను దానం చేస్తున్నాను. డబ్బు, అన్నం వంటివి దానం చేయడం కంటే ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో ఇష్టంగా పెంచుకున్న జుట్టును దానం చేయడం కొంచెం కష్టం. అందువల్లే నేను నా తలనీలాలను దానం చేశాను.

ఈసారి హెయిర్‌కట్‌కు వెళ్లినప్పుడు మీరు కూడా భిన్నంగా చేయడానికి ప్రయత్నించండి.'' అంటూ తను హెయిర్ కట్ చేయించుకుంటున్న వీడియోను పోస్ట్ చేసింది వితిక. తను ఎంతో ఇష్టంగా పెంచుకున్న జుట్టుని క్యాన్సర్ రోగుల కోసం చెన్నైలోని 'క్యాన్సర్ ఇస్టిట్యూట్ ఆద్యార్‌'కు దానం చేసినట్టు ఆమె చెప్పింది.

English summary
Varun sandesh"s Wife Actress Vithika Sheru Donats hair for the Cancer Institute Adyar (Chennai) for the cancer patients.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu