»   » అమరవీరుల కోసం ఇళ్ళు కట్టించాడు :సైనికుల కోసం స్టార్ హీరో నివాళి ఇలా

అమరవీరుల కోసం ఇళ్ళు కట్టించాడు :సైనికుల కోసం స్టార్ హీరో నివాళి ఇలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

అమరవీరుల కుటుంబాలకు చేయూత అందించేందుకు బాలీవుడ్ ప్రముఖ హీరో వివేక్ ఒబెరాయ్ ముందుకొచ్చాడు. థానేలోని సీఆర్‌పీఎఫ్ అమర సైనికుల కుటుంబాలకు 25 ఫ్లాట్లు దానం చేయనున్నట్టు ప్రకటించిన వివేక్ ఈమేరకు సీఆర్‌పీఎఫ్‌కు లేఖ రాశాడు.

అమరవీరుల కుటుంబాలకు

అమరవీరుల కుటుంబాలకు

ఇంతకుముందే ఛత్తీస్ గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టు ఎన్ కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయిన 12 మంది సీఆర్ఫీఎఫ్ సైనికుల కుటుంబాలకు స్టార్ హీరో అక్షయ్ కుమార్ 1.08 కోట్ల రూపాయల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహాలో అమరవీరుల కుటుంబాలకు తనవంతు సాయం చేసేందుకు మరో స్టార్ యాక్టర్ ముందుకొచ్చాడు.

వివేక్ ఒబెరాయ్

వివేక్ ఒబెరాయ్

ఆ రియల్ హీరో మరెవరో కాదు.. తెలుగులో రక్తచరిత్ర సినిమాతో తనదైన ముద్ర వేసిన బాలీవుడ్ స్టార్ హీరో కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వివేక్ ఒబెరాయ్. తెలుగు ప్రజలకు బాగానే సుపరిచితుడైన ఈ టాలెంటెడ్ నటుడు తాజాగా మహారాష్ట్రలోని థానేలో సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్ఫీఎఫ్) అమర సైనికుల కుటుంబాలకు 25 ఫ్లాట్లు దానం చేయనున్నట్లు ప్రకటించాడు.

 కరమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్

కరమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్

దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్ అమరుల కుటుంబాలకు తన కంపెనీ కరమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ తరపున 25 ఫ్లాట్లు నిర్మించి ఇవ్వాలని అనుకుంటున్నట్టు లేఖలో పేర్కొన్నాడు. ఈ మేరకు ఎంపిక చేసిన అమరుల కుటుంబాల పేర్లతో కరమ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఓ జాబితాను విడుదల చేసింది.

ప్రశంసల జల్లు

ప్రశంసల జల్లు

కాగా, ఇప్పటికే నాలుగు ఫ్లాట్లు అందించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఫ్లాట్ల కోసం ఎంపిక చేసిన కుటుంబాల పేర్లతో కూడిన జాబితాను విడుదల చేశారు. దీంతో వివేక్ ఒబెరాయ్ తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వివేక్ పై అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

‘వివేగం’ లో మెయిన్ విలన్ గా

‘వివేగం’ లో మెయిన్ విలన్ గా

ఇకపోతే, వివేక్ ఒబెరాయ్ ప్రస్తుతం సౌత్ లో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ లేటెస్ట్ మూవీ ‘వివేగం' లో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే, అక్షయ్ కుమార్, వివేక్ ఒబెరాయ్ తో పాటు సల్మాన్ ఖాన్ లాంటి హీరోలు కూడా అక్కడ ఇలా దానధర్మాలు చేస్తూ మంచి పేరునే సంపాదిస్తున్నారు. మరి మిగిలిన స్టార్ హీరోలు కూడా ఇలాంటి విషయాల్లో ముందుకు వస్తారో లేదో ముందుముందు చూడాలి.

English summary
Bollywood actor Vivek Oberoi's company Karrm Infrastructure Pvt. Ltd. has donated 25 flats to the families of Central Reserve Police Force (CRPF) martyrs in Thane, Maharashtra.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu