»   »  జవాన్ల బలిదానాల ముందు ఈ సాయం చిన్నదే: వివేక్ ఓబెరాయ్

జవాన్ల బలిదానాల ముందు ఈ సాయం చిన్నదే: వివేక్ ఓబెరాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రోడ్డు నిర్మాణ కార్మికులకు భద్రత కల్పిస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లపై గత మార్చి 11 న దాడిచేసి మావోలు కాల్పులు జరపడంతో 25 మంది మరణించారు. ఈ దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ కుటుంబాలకు ఫ్లాట్లు నిర్మించేందుకు ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆ జవాన్ల బలిదానాల ముందు తాను చేసే సాయం చాలా చిన్నదని పేర్కొన్నాడు. దేశ ప్రజలను రక్షణ కోసం ప్రాణత్యాగం చేస్తున్న జవాన్లను స్మరిస్తూ నివాళిగా వారి కుటుంబాలకు ఈ ఫ్లాట్లను ఇస్తున్నానని తెలిపాడు.

వాటితో పెద్ద‌గా ప‌నుండ‌దు

వాటితో పెద్ద‌గా ప‌నుండ‌దు

"ఓ సినీ న‌టుడిగా నేను జీవితంలో ఎన్నో అవార్డుల‌ను నా న‌ట‌న‌కు అందుకున్నా. వాటిని ఇంటికి తీసుకెళ్లి షోకేస్‌లో పెట్ట‌డం త‌ప్ప, వాటితో పెద్ద‌గా ప‌నుండ‌దు. అవేవీ నాకు సంతృప్తి ఇవ్వ‌వు. నేను న‌డుపుతున్న అనాథాశ్ర‌మానికి వెళ్లి అక్క‌డ పెరుగుతున్న పిల్ల‌ల‌ను చూస్తేనే నాకు ఆనందం క‌లుగుతుంది.

అవార్డులు నాకు ఆనందాన్ని క‌లిగించ‌వు

అవార్డులు నాకు ఆనందాన్ని క‌లిగించ‌వు

సినిమాలు, అవార్డులు నాకు ఆనందాన్ని క‌లిగించ‌వు" అని చెప్పిన వివేక్ సీఆర్పీఎఫ్ జవాన్ల బలిదానాల ముందు తాను చేసే సాయం చాలా చిన్నదని అన్నాడు. దేశ ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు ప్రాణత్యాగం చేస్తున్న జవాన్లను స్మరిస్తూ నివాళిగా వారి కుటుంబాలకు ఈ ఫ్లాట్లను ఇస్తున్నానని తెలిపాడు.

సాధారణ విషయం కాదు

సాధారణ విషయం కాదు

జవాన్ల కుటుంబాలకు అండగా నిలిచి, వారిని గౌరవించేందుకు తనకు తోచిన మార్గం ఇదని వివేక్ ఓబెరాయ్ తెలిపాడు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలతో పాటు కార్గిల్, సియాచిన్ వంటి చోట్ల విధులు నిర్వర్తించడం సాధారణ విషయం కాదని, ఎన్నో ఒత్తిళ్లను తట్టుకుని నిలబడాల్సి ఉంటుందని, అంత కష్టమైన పరిస్థితుల్లో కూడా సమర్థవంతంగా విధులు నిర్వర్తించడం వారికే చెల్లిందని తెలిపాడు.

అక్షయ్‌కుమార్

అక్షయ్‌కుమార్

కాగా, తన రెమ్యూనరేషన్ తో జవాన్ల కుటుంబాలకు ఇళ్లు కట్టివ్వడంపై దేశ వ్యాప్తంగా వివేక్ ఓబెరాయ్ పై అభినందనల వర్షం కురుస్తోంది. మరో బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ కూడా జవాన్ల సంక్షేమానికి నిధులు సేకరించి వారిపై తన అభిమానాన్ని చాటుకుంటున్నాడు.

సైనా నెహ్వాల్ కూడా

సైనా నెహ్వాల్ కూడా

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కూడా అమరులై సీఆర్పీఎఫ్ జవాన్లకు సాయం ప్రకటించి తన గొప్ప మనసును చాటుకున్నారు. దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసే సైనికులు కోసం తమకు తోచిన సాయం అందిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

English summary
In a warm philanthropic gesture, Bollywood actor Vivek Oberoi has decided to donate 25 flats to the families of the troopers killed in last month’s Maoist attacks in Sukma.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu