చిరంజీవి 150వ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ హీరో!
హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమా గురించి రామ్ చరణ్ ఇటీవల ఫిల్మీబీట్ స్పెషల్ ఇంటర్వ్యూలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తమిళంలో హిట్టయిన ‘కత్తి' సినిమాను చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించబోతున్నారు.
చిరంజీవి రీ ఎంట్రీ సినిమా కావడంతో చాలా ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడూ తెలుగులో కనిపించే రోటీన్ విలన్ కాకుండా డిపరెంటుగా ప్లాన్ చేసారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
తెలుగులో రక్త చరిత్ర సినిమాలో పెర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టిన వివేక్ ఒబెరాయ్... బాలీవుడ్లో ‘క్రిష్-3' మూవీలోనూ విలన్ గా పవర్ ఫుల్ గా నటించాడు. ఈనేపథ్యంలో అతడే చిరంజీవి సినిమాలో విలన్ పాత్రకు అయితే బావుంటుందని వివి వినాయక్ భావించినట్లు తెలుస్తోంది.

చిరంజీవి ఇటీవల స్వయంగా వివేక్ ఒబెరాయ్ కి ఫోన్ చేసి ఈ విషయమై అడిగారని, ఏకంగా చిరంజీవి నుండి కాల్ రావడంతో వివేక్ ఒబెరాయ్ ఫుల్ ఎగ్జైట్మెంటులో ఉన్నారని, వెంటనే ఒకే చెప్పారని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన రానుంది.
చిరంజీవి 150వ సినిమాను జనవరి, 2016లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సురేఖ ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఠాగూర్ మధు ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించబోతున్నారు. ప్రస్తుతం వివి వినాయక్ స్క్రిప్టుకు ఫైనల్ టచ్ ఇచ్చే పనుల్లో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











